సార్క్ సదస్సు బహిష్కరణపై టాటా ఏమన్నారు..
ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో సార్క్ సదస్సును బహిష్కరించాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రశంసించారు. ''సార్క్ సమావేశాన్ని బహిష్కరించాలన్న భారత ప్రభుత్వ స్థిర నిర్ణయం, సభ్య దేశాలు కూడా అందుకు మద్దతివ్వడం చూస్తే చాలా గర్వంగా ఉంది'' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు 10 వేల లైకులు రాగా, 6,800 మందికి పైగా దాన్ని రీట్వీట్ చేశారు.
జమ్ము కశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో భౄరత సైనిక శిబిరంపై పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు 18 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న దారుణ ఘటన తర్వాత భారత్ - పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాంతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సదస్సు నుంచి తప్పుకొంటున్నట్లు భారతదేశం ప్రకటించింది. ఆ వెంటనే బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ కూడా తాము సదస్సులో పాల్గొనేది లేదని తెలిపాయి. అయితే ఎలాగైనా సదస్సు నిర్వహించాలని ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ భావిస్తోంది.
So proud of Indian govt's firm stand on bycot of SARC mtg & overwhelming support by member nations.
— Ratan N. Tata (@RNTata2000) 28 September 2016