హైదరాబాద్: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను విరమించేంత వరకు ఆ దేశంతో చర్చలు ఉండవని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సదస్సుకు భారత్ హాజరు కాబోవడం లేదని ఆమె చెప్పారు. సార్క్ సదస్సు కోసం పాక్‌కు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపుతామని పాక్ విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. హైదరాబాద్‌లో బుధవారం సుష్మ మాట్లాడుతూ ‘ఆ ఆహ్వానం అందింది. కానీ మేం సానుకూలంగా స్పందించాలనుకోవడం లేదు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పాక్ విడిచిపెట్టకుంటే ఆ దేశంతో చర్చలు ఉండవని నేను గతంలోనే చెప్పాను. సార్క్ సదస్సుకు కూడా భారత్ హాజరవ్వదు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment