
పశుపతికి మోడీ పూజలు
ప్రధాని మోడీ సోమవారం శ్రావణాష్టమి సందర్భంగా నేపాల్‌లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.2 కోట్ల విలువైన రెండున్నర టన్నుల చందనాన్ని సమర్పించారు.
కఠ్మాండు: ప్రధాని మోడీ సోమవారం శ్రావణాష్టమి సందర్భంగా నేపాల్‌లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.2 కోట్ల విలువైన రెండున్నర టన్నుల చందనాన్ని సమర్పించారు. గుడిలో దైవకృపకు పాత్రుడినైనట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మోడీ పశుపతికి నిర్వహించిన రుద్రాభిషేకం, పంచామృత స్నానంలో 150 మంది పూజారులు పాల్గొన్నారు.
దక్షిణ భారతానికి చెందిన ప్రధాన అర్చకుడు గణేశ్ భట్ట భారత ప్రధానికి ప్రసాదాలు అందించారు. ‘ఈ ఆలయం విశిష్టమైనది. పశుపతి, కాశీ విశ్వనాథుడు ఒకరే. భారత్, నేపాల్‌లను ఏకం చేస్తున్న పశుపతి ఆశీర్వాదాలు ఇరు దేశాల ప్రజలకు ఇకముందూ అందాలి’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆలయంలో యాత్రికుల కోసం రూ. 25 కోట్లతో సత్రాన్ని నిర్మిస్తామన్నారు.