నేపాల్లో చిరంజీవి పూజలు | Chiranjeevi to celebrate his birthday in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్లో చిరంజీవి పూజలు

Published Sat, Aug 23 2014 10:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నేపాల్లో చిరంజీవి పూజలు - Sakshi

నేపాల్లో చిరంజీవి పూజలు

చిరంజీవి తన జన్మదిన వేడుకలను శుక్రవారం నేపాల్లో ఘనంగా జరుపుకున్నారని సమాచారం. ఈ సందర్బంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి స్థానిక పశుపతి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మదిన వేడుకులు నేపాల్ జరుపుకునేందుకు చిరంజీవి ముందుగానే ఆయన కుటుంబ సభ్యులతో కలసి నేపాల్ చేరుకున్నారు.

మరోవైపు చిరంజీవి జన్మదిన వేడుకలు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో ఈ వేడుకలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుమారుడు హీరో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరణ్ తేజ్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement