
సాక్షి, హైదరాబాద్ : వారువీరనే తేడాలేకుండా వరుసగా పోస్టులు పెడుతూ వివాదాలకు కారకుడవుతోన్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి గర్జించారు. దళిత ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూనే గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో కలిసి కూర్చున్న జిగ్నేష్ ఫొటోపై తనదైన శైలిలో వ్యాఖ్యలు రాశారు మహేశ్.
‘లీడర్ అంటే దేవుడు. ఎవరో నాయకులకు ఊడిగం చెయ్యాలనేవి దళిత రాజకీయ పోకడలుకాబోవు. దళితులు ఆత్మగౌరవ పోరాటాలు చేసేది సమానత్వం కోసమేకానీ.. గెలిచి (నాయకుడి) పక్కన కూర్చుని చర్చించడానికి కాదు. ‘జీ హుజూర్..’ అని జైకొట్టడానికి కానేకాదు’ అని కత్తి మహేశ్ వ్యాఖ్యానించారు.
ఉనా(గుజరాత్) దళిత ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన యువనాయకుడిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జిగ్నేష్ మేవాని.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment