
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి.. జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ఇప్పటివరకు కేవలం రాజకీయంగా మాత్రమే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన మహేష్ కత్తి తాజాగా `అజ్ఞాతవాసి` గురించి విమర్శలు చేశారు.
‘ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?’ , ‘అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన టీజర్‌ను బేస్ చేసుకుని ‘అజ్ఞానవాసి’ పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
`అజ్ఞాతవాసి` టీజర్ ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వచ్చేలా ఉందని మరో పోస్ట్ పెట్టారు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైలర్‌ను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి, `ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి` అని పోస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment