
సాక్షి, హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌పై కొందరు నోరు పారేసుకుంటున్నారని పరోక్షంగా కత్తి మహేష్‌పై కత్తిగట్టిన హీరోయిన్ పూనమ్ కౌర్‌కు మహేష్ కత్తి కౌంటర్ ఇచ్చారు. తనపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ పూనం తీరును ఆయన ఎండగట్టారు. పవన్ ప్రాపకంతో ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి సంపాదించి ఆయన మెప్పు కోసం తనపై ప్రేలాపనలు చేస్తున్నావని మండిపడ్డారు.
పూనమ్‌పై కత్తి ఎలా చెలరేగారంటే...‘పవన్ కళ్యాణ్ రికమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను "ఫ్యాట్సు" అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది నా సంస్కారం కాదు. అడుక్కుని సంపాదించుకున్న పదవి మీద బ్రతుకుతున్న నువ్వా నాకు భిక్ష వేసేది? మాటలు జాగ్రత్తగా రాని. నేను నోరు తెరిస్తే నువ్వు, నీ పవన్ కళ్యాణ్ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకొండి’ అంటూ కౌంటర్ ఇచ్చారు.