
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన మీద తనదైన శైలిలో కామెంట్ చేశారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు నేడు ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై మహేశ్ కత్తి పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ ‘‘పార్టీ పెట్టి పోటీ చెయ్యకుండా ఇంట్లో కూర్చుంటే ‘పిరికిపంద’ అంటారు. హీరో రజనీ కాంత్, అరే... మా స్టేట్‌లో పవన్ కళ్యాణ్ అంటామే!!!’ ’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.