సాక్షి, విజయవాడ: చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని.. ఎందుకంటే ఆయనకు విశ్వసనీయత అనేది లేదని.. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించాల్సిన అవసరం తమకు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర.. ప్రతీకార చర్య ఉందంటూ యెల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంతో పాటు తొలిసారి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై.. సోమవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ స్పందించారు.
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు.. ఇక రాదు. చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది.. మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. అలాంటి వ్యక్తిని ఎవ్వరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయన మీద నాకు ఎలాంటి కక్ష లేదు. నేను లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆ అరెస్ట్‌తోనూ నాకు ఎలాంటి సంబంధం లేదు అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు, సగం టీడీపీ నేతలు బీజేపీలోనే ఉన్నారు కదా అని నిలదీశారు సీఎం జగన్.
కేంద్రంలోని ఇన్‌కంటాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేశాయి. ఆయన అవినీతిని గమనించి నోటీసులిచ్చాయి, దోషుల్ని అరెస్టు చేశాయి. చంద్రబాబుకు నేరుగా ఇన్‌కంట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. స్వయంగా దేశ ప్రధాని మోదీ, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని అన్నారు. రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్ కూడా విత్‌డ్రా చేశారు. ఆనాటికే అవినీతిపరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన.. విచారణ చేయకూడదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం అని సీఎం జగన్ అన్నారు.
బాబును సమర్థించడమంటే..
ప్రజల్లోకి వెళ్లి మీరు(పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి..) మరొక విషయాన్ని చెప్పాలి. బాబును సమర్థించామంటే.. .ఈ రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అని చెప్పాలి. చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమే. చంద్రబాబును సమర్థించడమంటే.. పెత్తదాందీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమేనని చెప్పాలి. చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందకుండా వ్యతికేకించడమేనని చెప్పాలి. చంద్రబాబును సమర్థించడమంటే.. డెమోగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలను సమర్థించినట్లే అవుతుందని ప్రజలకు చెప్పాలి. చంద్రబాబును సమర్థించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలివాలని సమర్థించినట్టేనని చెప్పాలి. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానన్న పెత్తందారీ భావజాలాన్ని సమర్థించడమేనని చెప్పాలి.
మన ప్రతిపక్షాలు అన్నీ కూడా పొత్తులకోంస వెంపర్లాడుతున్నారు. వారు ఎంతమంది కలిసినా.. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. సున్నాయే.
ఎన్ని సున్నాలు కలిసిన వచ్చేది పెద్ద సున్నాయే. వారు మంచి చేసి ఉంటే.. వారిమీద వారికే నమ్మకం ఉంటే.
పవన్‌పైనా..
ఒకరైతే 15 సంవత్సరాలు అయ్యింది. ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్తా లేడు. చంద్రబాబును మోయడమే ఆయన పని. చంద్రబాబు దోచుకున్న దాంట్లో పార్టనర్. మోసాలు చేయడంలో పార్టనర్. బిస్కట్ వేసినట్టు, చాక్లెట్ వేసినట్టు. సంపాదించిన సొమ్ములో భాగం పంచడం..ఇంత ఈనాడుకు, ఇంత టీవీ-5 కు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత దత్తపుత్రుడికి దోచుకోవడం.. పంచుకోవడం..
రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా నిలవడం. మరణించాక ప్రతి ఇంట్లో కూడా మనం కనిపించడం. వీరికి తెలిసిన రాజకీయం..సీట్లోకి రావడం.. దోచుకోవడం… దోచుకున్నది పంచుకోవడం. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి గుండెలో కూడా ఉండడం మనకు తెలిసిన రాజకీయం.
మీ బిడ్డ ఎవ్వరితోనూ పొత్తుపెట్టుకోడు. రాజకీయ చరిత్రలోకాని, దేశచరిత్రలో కాని కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాడు. అబద్ధాలు నమ్మకండి… మోసాలు నమ్మకండి.మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. దాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోండి. పిలుపు ఇవ్వగలుగుతున్నాడు. అడగడానికి ధైర్యం చేయని విషయాలను నేరుగా ప్రజలనుద్దేశించి మీ బిడ్డ అడగ గలుగుతున్నాడు. అందుకే వై నాట్ 175 పిలుపుతోనే అడుగులు ముందుకేస్తున్నాం అని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment