‘‘ఓటేయండి.. ప్రశ్నిస్తానన్నావ్. ఏం ప్రశ్నించావ్?. ఎవరికి మేలు చేశావ్?. మీ అన్న చిరంజీవిని చూసి నేర్చుకో. రాజకీయాలు సరిపడవన్నాడు. చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ, నీ ఆలోచనకు.. మాటలకు నిలకడలేనప్పుడు ఎందుకు మోసపు మాటలు చెప్పడం’’
::జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
సాక్షి, కృష్ణా: తప్పుడు మాటలు.. అసత్యాలు కట్టిపెట్టాలని పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘పవన్ మాటలు.. పచ్చిదగాకోరు మాటలు. ఏదో ఒకటి మాట్లాడటం అలవాటైపోయింది. జనం నవ్వుకుంటున్నారన్న ఆలోచన కూడా లేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బురదచల్లాలి. చంద్రబాబుకు మేలు చేయాలనేదే పవన్ పని. రాజకీయాల్లో ఇంతకంటే తప్పుడుతనం మరొకటి లేదన్నారు’’ పేర్ని నాని.
తెలంగాణ ఉద్యమం.. కనీస విచక్షణ లేదా?
రాష్ట్ర విభజన గురించి పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. 1962,63 లో తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పుడెవరు బాధ్యులు?. 2000లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జై తెలంగాణ నినాదం మొదలయ్యింది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీచేసింది నువ్వు , మీ అన్నయ్య కాదా?. మీ షూటింగ్‌లు తెలంగాణలో ఎందుకు ఆపారు.. రిలీజ్ లు ఎందుకు ఆపారు..మీరే కదా కారణం?. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బోల్డెన్నీ ఆస్తులు కొంటున్నాడు కదా..అతనూ కూడా కారణమే కదా. ఆవుతో ... ఎద్దుతో...మామిడి చెట్టుతో.. పుస్తకం తలకిందులుగా పెట్టి ఫోటోలకు దిగుతాడు కదా. పవన్‌కు ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి.తెలంగాణ వాళ్లు దీనికోసం కాదా ఉద్యమం చేసింది. పవన్ కళ్యాణ్ కు కనీసం ఈ మాత్రం విచక్షణ కూడా లేదు అని పేర్ని నాని అన్నారు.
ఆ దమ్ముందా?
పవన్ కళ్యాణ్ 25 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడని అందరికీ తెలుసు. కిరాయికి ఒప్పుకున్నాడు.. కాబట్టే కూలీకి తగ్గట్టుగా పనిచేయడమే పవన్‌కు తెలుసు. ఉద్ధేశపూర్వకంగా విషం చిమ్మడం తప్ప వాస్తవాలేమున్నాయ్. పవన్ మాట్లాడే మాటలకు అర్ధమేమైనా ఉందా?. జగన్ మోహన్ రెడ్డి మీద పవన్ కు విపరీతమైన ద్వేషం , కక్ష. చంద్రబాబు కోసమే పనిచేస్తానని షమ్ షేర్ గా చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి అవుతానంటావ్.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తావ్?. ప్రజలకు నిజాయితీతో నిజాలు చెప్పండి .. బీజేపీ , టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పండి
డ్రామాలు అందుకే!
జనసేన , టీడీపీ కార్యకర్తలు ఎంతమంది హత్యాయత్నం, గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. అప్పుడెందుకు నువ్వు బాధ్యత తీసుకోలేదు. వాలంటీర్ల పై రోజుకొక మాట...పూటకొక మాట చెబుతావ్. పవన్ కళ్యాణ్ కు ఇదే నా సవాల్. 2014 -19 మధ్య నువ్వు , చంద్రబాబు కలిసి చేసిన పాలనలో ఏం చేశావో చెప్పే దమ్ముందా?. జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్పడానికి మోదీ , అమిత్ షా దగ్గరికి వెళ్తావ్. ఒక్కరోజు మోదీని కలిసి స్టీల్ ప్లాంట్ , ప్రత్యేకహోదా గురించి ఎందుకు మాట్లాడవ్?. ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి చంద్రబాబుకు అమ్మేయడానికే నీ డ్రామాలు.
ఇదీ చదవండి: బంధం ఒకరితో.. అక్రమ సంబంధం మరొకరితో!
Comments
Please login to add a commentAdd a comment