Telangana Moment
-
‘తెలంగాణలో మీ షూటింగ్ల్ని ఎందుకు ఆపారు?’
‘‘ఓటేయండి.. ప్రశ్నిస్తానన్నావ్. ఏం ప్రశ్నించావ్?. ఎవరికి మేలు చేశావ్?. మీ అన్న చిరంజీవిని చూసి నేర్చుకో. రాజకీయాలు సరిపడవన్నాడు. చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ, నీ ఆలోచనకు.. మాటలకు నిలకడలేనప్పుడు ఎందుకు మోసపు మాటలు చెప్పడం’’ ::జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ సాక్షి, కృష్ణా: తప్పుడు మాటలు.. అసత్యాలు కట్టిపెట్టాలని పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘పవన్ మాటలు.. పచ్చిదగాకోరు మాటలు. ఏదో ఒకటి మాట్లాడటం అలవాటైపోయింది. జనం నవ్వుకుంటున్నారన్న ఆలోచన కూడా లేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బురదచల్లాలి. చంద్రబాబుకు మేలు చేయాలనేదే పవన్ పని. రాజకీయాల్లో ఇంతకంటే తప్పుడుతనం మరొకటి లేదన్నారు’’ పేర్ని నాని. తెలంగాణ ఉద్యమం.. కనీస విచక్షణ లేదా? రాష్ట్ర విభజన గురించి పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. 1962,63 లో తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పుడెవరు బాధ్యులు?. 2000లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జై తెలంగాణ నినాదం మొదలయ్యింది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీచేసింది నువ్వు , మీ అన్నయ్య కాదా?. మీ షూటింగ్‌లు తెలంగాణలో ఎందుకు ఆపారు.. రిలీజ్ లు ఎందుకు ఆపారు..మీరే కదా కారణం?. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బోల్డెన్నీ ఆస్తులు కొంటున్నాడు కదా..అతనూ కూడా కారణమే కదా. ఆవుతో ... ఎద్దుతో...మామిడి చెట్టుతో.. పుస్తకం తలకిందులుగా పెట్టి ఫోటోలకు దిగుతాడు కదా. పవన్‌కు ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి.తెలంగాణ వాళ్లు దీనికోసం కాదా ఉద్యమం చేసింది. పవన్ కళ్యాణ్ కు కనీసం ఈ మాత్రం విచక్షణ కూడా లేదు అని పేర్ని నాని అన్నారు. ఆ దమ్ముందా? పవన్ కళ్యాణ్ 25 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడని అందరికీ తెలుసు. కిరాయికి ఒప్పుకున్నాడు.. కాబట్టే కూలీకి తగ్గట్టుగా పనిచేయడమే పవన్‌కు తెలుసు. ఉద్ధేశపూర్వకంగా విషం చిమ్మడం తప్ప వాస్తవాలేమున్నాయ్. పవన్ మాట్లాడే మాటలకు అర్ధమేమైనా ఉందా?. జగన్ మోహన్ రెడ్డి మీద పవన్ కు విపరీతమైన ద్వేషం , కక్ష. చంద్రబాబు కోసమే పనిచేస్తానని షమ్ షేర్ గా చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి అవుతానంటావ్.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తావ్?. ప్రజలకు నిజాయితీతో నిజాలు చెప్పండి .. బీజేపీ , టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పండి డ్రామాలు అందుకే! జనసేన , టీడీపీ కార్యకర్తలు ఎంతమంది హత్యాయత్నం, గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. అప్పుడెందుకు నువ్వు బాధ్యత తీసుకోలేదు. వాలంటీర్ల పై రోజుకొక మాట...పూటకొక మాట చెబుతావ్. పవన్ కళ్యాణ్ కు ఇదే నా సవాల్. 2014 -19 మధ్య నువ్వు , చంద్రబాబు కలిసి చేసిన పాలనలో ఏం చేశావో చెప్పే దమ్ముందా?. జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్పడానికి మోదీ , అమిత్ షా దగ్గరికి వెళ్తావ్. ఒక్కరోజు మోదీని కలిసి స్టీల్ ప్లాంట్ , ప్రత్యేకహోదా గురించి ఎందుకు మాట్లాడవ్?. ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి చంద్రబాబుకు అమ్మేయడానికే నీ డ్రామాలు. ఇదీ చదవండి: బంధం ఒకరితో.. అక్రమ సంబంధం మరొకరితో! -
తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్లోకి తిరిగి వలసలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను.. తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈ మేరకు చేరికల కోసం స్వయంగా ఆయనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు బీజేపీని గట్టి దెబ్బ కొట్టాలనే ఆలోచన చేసినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది టీఆర్ఎస్. స్వయంగా ఉద్యమ నేతలకు కేసీఆరే ఆహ్వానం అందించినట్లు అధికారిక సమాచారం. ఇప్పటికే దాసోజు శ్రవణ్ చేరిక ఖరారుకాగా.. స్వామిగౌడ్, జితేందర్‌రెడ్డిలో సైతం టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. వీళ్లతో పాటు నాటి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలందరికీ తిరిగి పార్టీలోకి ఆహ్వానం అందించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యమ నేతల్లో కొందరికి స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. అంతేకాదు.. వాళ్లకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని మాటిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామిగౌడ్ చేరిక దాదాపు ఖాయమైందని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తుండగా.. జితేందర్‌రెడ్డితో చర్చల కోసం నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డితోనూ సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీని వీడిన వాళ్లను తిరిగి ఆహ్వానించడం ద్వారా.. బీజేపీ వలస రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రత్యర్థులకు వ్యూహాలను దెబ్బ కొట్టవచ్చని గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ రచించినట్లు స్పష్టమవుతోంది. -
ఖండాలు దాటిన ఖ్యాతి
తెలంగాణ తొలిదశ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు తన కలం, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజాకవి గూడ అంజయ్య. ప్రజలను ఆలోచింపజేసే ఎన్నో పాటలు రాశారాయన. ప్రస్తుతం భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటల్లో నిత్యం చిరంజీవిలా వెలుగొందుతూనే ఉంటారు. నేడు గూడ అంజయ్య 65వ జయంతి. దండేపల్లి (మంచిర్యాల) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గూడ అంజయ్య 1954 నవంబర్ 1న గూడ లస్మయ్య– లస్మమ్మ దంపతులకు ఐదో సంతానంగా జన్మించారు. ఫార్మసిస్టుగా ఆ దిలాబాద్ జిల్లాలోని ఊట్నూర్లో ప్రభుత్వ ఉద్యోగంలో చే రారు. అనంతరం కొద్ది రోజులు ఆదిలాబాద్‌లోనూ పని చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన ఆయన సినిమా పాటల రచనలో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లారు. అనంతరం అనారోగ్యానికి గురికావడంతో సాహిత్యానికి దూరమయ్యారు. ఖండాలు దాటిన ఖ్యాతి అంజయ్య రాసిన పాటల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 1970లో అంజయ్య రచించి, స్వయంగా పాడిన ‘ఊరు మనదిరా.. ఈ వాడమనదిరా..’ పాట మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. 20 దేశాల్లో ఈ పాటను వివిధ భాషల్లోకి అనువదించారు. ఎమర్జెన్సీ సమయంలో 1975లో విద్యార్థులు ఢిల్లీ వెళ్లే సమయంలో రాసిన పాట ‘భద్రం కొడుకో.. నా కొడుకో కొమురన్న.. జర పైలం కొడుకో..’ అన్న పాటతో తెలంగాణ పాటకు అంజయ్య మరింత పదునెక్కించారు. పాటల్లో సామాజిక సందేశం అంజయ్య రాసిన పాటల్లో సామాజిక సందేశాలు నిండి ఉన్నాయి. ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసిన అనేక పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని ప్రేరేపించాయి. ‘రాజిగ ఒరె రాజిగా.. ఒరి ఐలపురం రాజిగా’, ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా.. తెలంగాణకు తోటి పాలోనివా..’ అనే పాటలు ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిల్చాయి. అంతేకాకుండా అంజయ్య తన పాటలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. రచనలు.. కళ్లెదుటే జరిగిన అన్యాయాలతో చలించిపోయిన అంజయ్య 1970లో రచయితగా మారారు. 1970 నుంచి 1978 వరకు అంజయ్య రచించిన, పాడిన పాటలను కవితా సంకలనం పేరిటా పుస్తకం విడుదల చేశారు. 1999లో ఆయన స్వీయరచనలో రూపొందించిన ‘ఊరు మనదిరా’ పుస్తకాన్ని విడుదల చేశారు. ‘ది వాయిస్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో ఆయన పాటల సీడీ రూపొందించారు. పాటలతో పాటు అనేక రకాల నవలలు, నాటకాలు కూడా రచించారు. కవిగా, గాయకునిగా కాకుండా సినిమా నటునిగా కూడా రాణించారు. అంజయ్య రాసిన పాటలను ఆర్. నారాయణమూర్తి ఎక్కువగా తన సినిమాల్లో వాడుకున్నారు. అంజయ్య ఎర్రసైన్యం, మా భూమి, దండోరా, చీకటి సూర్యులు వంటి పలు చిత్రాల్లో కూడా నటించారు. అనారోగ్యంతో.. అంటరానితనం, బానిసత్వాన్ని పారదోలేలా పాటలతో తూటాలు పేల్చిన విప్లవ కవి, గాయకుడు గూడ అంజయ్య. ఆయన కలం, గళం ఆగిపోయి నాలుగేళ్లు గడిచింది. విప్లవ గేయాల రచయితగా ముద్రపడిన అంజయ్య మూత్రపిండాలు, కామెర్ల వ్యాధితో అనారోగ్యానికి గురై 2016 జూన్ 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. -
విమోచన మీద కమ్ముకున్న మబ్బులు
‘‘మన అన్నల చంపిన మన చెల్లెళ్ల చెరిచిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండగ గుర్తుంచుకోవాలె కాలంబురాగానె కాటేసి తీరాలె పట్టిన చేతులను పొట్టులో బెట్టాలె తన్నిన కాళ్లను దాగలిగ వాడాలె...’’ ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి కాళోజీ కలాన్ని కదిలించింది! ఏ భావం కాళోజీ కన్నీళ్లను కరిగించి అక్షరాలుగా మార్చింది! అదే 1948లో జరిగిన రజాకార్ల స్వైరవిహారం. ఒక్క కాళోజీనే కాదు; యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్గిరవ్వలు రేపిన దుశ్చర్య! రజాకార్ మూకల దాడులనెదుర్కోవడానికి సమాయత్తమైన ఈ పోతుగడ్డ ప్రజల ధైర్యసాహసాలు వేనోళ్లా్ల పొగడవచ్చు. విధి వక్రించినా, చరిత్ర తమను గుర్తించకున్నా ఉక్కుమనిషి పటేల్ రూపంలో రక్షణ కవచం దొరికింది. అదే దక్కను పీఠభూమి ప్రజలకు భరతమాత ఒడిలో వాలే అవకాశం దక్కినరోజు. అదే సెప్టెంబర్ 17, 1948. క్రీ.శ.1656లో బతుకుదెరువు కోసం ఖులీజ్ ఖాన్ టర్కీలోని బోఖరా నుండి భారత్‌కు వచ్చాడు. నాటి మెుఘల్ పాలకుడైన షాజహాన్ కొలువులో చేరాడు. అతని మనుమడే ఖుమ్రుద్దీన్. ‘నిజాముల్ ముల్కు’ అనే బిరుదు పొందాడు. వీళ్ళ వంశం ఆసఫ్జాహి. ఆ తర్వాత ఔరంగజేబు పాలనలోకి వచ్చాక దక్కన్ ప్రాంతానికి సుబేదార్లుగా, ఔరంగజేబు మరణం తర్వాత 1724లో దక్కన్ నవాబులయ్యారు. ఈ నవాబుల్లో చివరివాడు, ఏడవవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. కొందరు పేర్కొన్నట్లు నవాబు అభివృద్ధి కారకుడైతే, పరమత సహనం కలవాడైతే భాగ్య (భాగ్) నగరం హైదరాబాద్‌గా, భాగీరథి మహ్మద్బీగా, భాగమతి హైదర్బీగా ఎందుకు మారాయో చరిత్రలో ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. 1927లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏర్పడింది. 1937లో మతపరివర్తన ఉద్యమం ‘తబ్లీగ్’ ప్రారంభించింది. సంస్థానంలోని హరిజనులకు భూములు, ఆర్థిక స్థిరత్వం కల్పిస్తామని మత మార్పిడి చేశారు. బహదూర్ యార్ జంగ్ మరణం తర్వాత మజ్లిస్ అధ్యక్ష పదవి ఖాసీంరజ్వీకి లభిం చింది. రజాకార్ అనే మాటకు వాలంటీర్ అని అర్థం. సేవా దృక్పథం ఉండాల్సిన రజాకార్లు, వారి అధ్యక్షుడు పరమత సహనం కోల్పోయారు. 1947లో దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకొంటుంటే ఈ నైజాం ప్రాంతంలో బతుకమ్మ పండుగ మెుదలైంది. వాడీ స్టే్టషన్ దాటిన రైలును ఆపి అందులో స్త్రీలను దించి, ట్రక్కుల్లో ఎక్కించారు. గాండ్లాపూర్ సమీపంలోని ఠాణాకు తీసుకెళ్ళి వాళ్ళను వివస్త్రల్ని చేసి లాఠీలతో కొడుతూ బతుకమ్మ ఆడించారు. ఈ దురాగతాల్ని నెహ్రూ 1947 సెప్టెంబర్ 7న నిరసించారు. హైదరాబాద్ సమీపంలో అమీర్‌పేట గ్రామంలోకి మహమ్మద్ అస్లం, మహ్మద్ కరీం అనే రజాకార్లు ప్రవేశించారు. స్త్రీల ముక్కుపుడకలను లాగి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించారు. సైదాబాద్‌లో 15 మంది స్త్రీలను మానభంగం చేశారు. ఆనాటి పంజగుట్ట గ్రామంలో భర్తల ఎదుట తల్లీ కూతుళ్ళపై ఖాదర్జిలాని, సికిందర్‌ఖాన్, అబ్దుల్ జబ్బార్ అనే నాయకుల నేతృత్వంలో క్రూరమైన అత్యాచారం జరిగింది. ఈ దుస్సంఘటల్ని ఖండిస్తూ ఇమ్రోజ్ పత్రికలో పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి. వాటిని రాసిన షోయబుల్లాఖాన్‌ను కిరాతకంగా రజాకార్లు హత్య చేశారు. ఈ హత్య తర్వాత నెహ్రూ మేల్కొన్నారు. విద్యార్థులు, రైతులు నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్‌కు తరలించారు వల్లభ్‌భాయ్ పటేల్. 1948 సెప్టెంబర్ 13న సైన్యం దిగింది. మూడు రోజులు ఎదిరించిన అనంతరం నిజాం సైన్యం చేతులెత్తేసింది. ఎలాంటి రక్తపాతం జరక్కుండానే సెప్టెంబర్ 17న నిజాం తలవంచాడు. ఏ జాతి తమ చరిత్ర లోతుపాతులను విస్మరించి కరదీపిక లేకుండా ప్రయాణం చేస్తుందో, ఆ జాతి త్వరలోనే ధ్వంసం అవడం ఖాయం అంటాడో చరిత్రకారుడు. మసిపూసి మారేడు కాయ చేసి కొందరి పట్ల ‘రాగం’, మరికొందరి పట్ల ‘ద్వేషం’ కల్గించే పక్షపాతుల చేతుల్లో చరిత్ర పడితే? సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంపై కూడా అలాంటి ఎర్రమబ్బులు కమ్ముకొన్నాయి. నరకుణ్ణి చంపిన రోజును దీపావళిగా జరుపుకొనే సంస్కృతిని ఏమార్చి, ‘నరకాసురుడు’ నాయకుడు అనడానికి అలవాటుపడ్డ చారిత్రకులకు ఈ దేశంలో కొదవలేదు. ‘‘నా సిద్ధాంతాన్ని అగ్నిలో వేసి పరీక్షించుకోవచ్చు’’ అని గౌతమబుద్ధుడు చెప్పినట్లే మనమూ సరైన చరిత్రను సమాజం ముందు పెట్టి క్షీరనీర న్యాయం కోరుకుందాం! (రేపు తెలంగాణ విమోచన దినం) వ్యాసకర్త: డా.పి. భాస్కరయోగి, ప్రముఖ రచయిత, కాలమిస్టు మొబైల్ : 99120 70125 -
‘తల్లి’ విగ్రహం ప్లాన్ సార్‌దే...: ఎంపీ దయాకర్
‘నేను వృత్తిరీత్యా చిత్రకారుడిని.. తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్తగాఎంతో పేరొచ్చింది.. అంతకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ మెచ్చిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. టీఆర్ఎస్లో అంచెలంచెలుగా ఎదిగిన నాకు 2014లో వర్దన్నపేట టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారింది.. అయినప్పటికీ రాజకీయంగా నేను ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది, అంతా సార్(కేసీఆర్) చూసుకుంటారు అని సరిపుచ్చుకున్నా. అంతే 2015 పార్లమెంట్ వరంగల్ ఉప ఎన్నికలో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచా. రెండోసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ అసాధారణ మెజారిటీతో వరంగల్ ఎంపీగా మళ్లీ గెలిచాను’– సాక్షి పర్సనల్ టైం’లో వరంగల్ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమ కాలంలో చురుగ్గా పాల్గొనే ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత ఇష్టుడిగా మారారు. అయినా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు. దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా టీఆర్ఎస్లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగారు. ఆ విధేయతే వరంగల్ ఎంపీ టికెట్‌ను తెచ్చిపెట్టింది. 2015 ఉప ఎన్నికలతో పాటు తాజా సాధారణ ఎన్నికల్లో ఎంపీగా అద్భుతమైన మెజార్టీతో గెలుపొందారు పసునూరి దయాకర్. ఈ సందర్భంగా తన చదువు, వివాహం.. ఉద్యమంలో తీరుతెన్నులు.. కేసులు ఎదుర్కొన్న వైనమే కాకుండా వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ‘సాక్షి పర్సనల్ టైమ్’లో పంచుకున్నారు. ఆ వివరాలు దయాకర్ మాటల్లోనే... సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి రాష్ట్రంలోని 25 మందిలో నేనొక్కడిని.. ఉమ్మడి వరంగల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన పసునూరి కమలమ్మ – ప్రకాశం మా అమ్మానాన్నలు. 1967 ఆగస్టు 2న జన్మించాను. హైదరాబాద్ జేఎన్టీయూలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 25 సీట్లు మాత్రమే ఉండేవి. అందులో ఒక సీటు రావడంతో బీఏ ఫైన్ ఆర్ట్స్ చదివా. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేసుకుని వరంగల్‌కు చేరి ఫొటో స్టూడియో ఏర్పాటు చేసి చిత్రకారుడిగా వృత్తి ప్రారంభించాను. 2001 టీ ఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కీలకంగా పని చేశా. స్విమ్మింగ్ అంటే ఇష్టం పదో తరగతి వరకు మా ఊరు బొల్లికుంటలోనే చదువుకున్నా. ఆ రోజుల్లో చదువుతో పాటు స్నేహితులతో కలిసి ఊరిలో అన్ని ఆటలు ఆడా. స్విమ్మింగ్‌తో పాటు అన్ని ఆటలు ఇష్టమే. చిన్నప్పుడు కొద్దిగా రఫ్‌గానే ఉండేవాన్ని. కోతి కొమ్మచ్చి, తాటిముంజల కోసం చెట్లు ఎక్కడం ఇప్పటికీ మరిచిపోలేను. ఇంటర్మీడియట్ స్టేషన్‌ఘన్‌పూర్‌లో మా చిన్నాన్న దగ్గర చదుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్ జేఎన్టీయులో బీఏ ఫైన్ ఆర్ట్స్ సీటు రావడంతో అక్కడి వెళ్లా. లాస్ట్‌బెంచ్ స్టూడెంట్ను.. హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీలలో లాస్ట్‌బెంచ్‌లో కూర్చునేవాన్ని. చదువు, మార్కుల విషయంలో మాత్రం పర్ఫెక్ట్. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక హైదరాబాద్‌లో చదవాలనుకున్నా. జేఎన్టీయూలో బీఏ ఫైన్ ఆర్ట్స్ సీట్లు ఉమ్మడిరాష్ట్రంలో 25 సీట్లు మాత్రమే ఉం డేవి. అయినా అందులో సీటు కోసం ఎంట్రన్స్ రాస్తే 25 మం దిలో ఒకడిగా నాకు సీటు దక్కడం సంతోషాన్ని కలిగించింది. ‘సత్య’ సినిమా బాగా నచ్చింది చదువుకునే రోజుల్లో అన్ని ఆటలు ఆడేవాన్ని. స్విమ్మింగ్‌తో పాటు జిమ్‌కు కూడా వెళ్లేవాణ్ని. వాలీబాల్, అథ్లెటిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. వాలీబాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ పోటీల్లో పాల్గొన్నా. అథ్లెట్స్‌లో షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో కూడా ఇష్టంగా ఆడే వాళ్లం.రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా బాగా నచ్చింది. ప్రేమ, గీమల జోలికి వెళ్లలే... చదువుకునే రోజుల్లో ప్రేమ, గీమల జోలికి వెళ్లలేదు. ఆ రోజుల్లో కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు. కాలేజీకి వెళ్లిన సందర్భాల్లో ఎవరైనా తోటి విద్యార్థినులు పరిచయమైనా.. మరుసటి కనిపిస్తే కనీసం ‘హాయ్’ అని కూడా అనలేదు. ఎందుకంటే చదువుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మిగతా వాటికి ప్రాధాన్యత అవసరం లేదని భావించేవాడిని. సేమ్ టైమ్ కేవలం పరిచయం చేసుకున్నంత మాత్రాన దానిని అవకాశంగా కూడా తీసుకోవడం సరికాదనే అనిపించేది. అందుకే వాటికి జోలికి వెళ్లలే. నాటుకోడి కూర బాగా ఇష్టం. పెద్దలు కుదిర్చిన పెళ్లి హైదరాబాద్‌లో బీఏ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి వరంగల్‌కు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నా. గౌరవంగా ఉంటుందని పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓకే అన్నా. అయితే, జయవాణి (భార్య) నాకు సీనియర్‌గా ఉన్న విద్యాదర్ చెల్లెలు అని ఆ తర్వాతే తెలిసింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కనక వెంటనే జరిగిపోయింది. 1995 డిసెంబర్ 4 మా పెళ్లిరోజు. ఉద్యమ సమయంలో అన్నీ ఆమే తెలంగాణ ఉద్యమ సమయంలో నా భార్య జయవాణి కుటుంబాన్ని అంతా తానై చూసుకునేది. అటు ఉద్యమం.. ఇటు రాజకీయాల్లో నేను ముందుకు నడవడంలో ఆమె సహకారం మరవలేనిది. పిల్లలను చూసుకోవడం, ఇంటికి వచ్చే నాయకులు, కార్యకర్తలను ఆదరించి మాట్లాడటం వల్ల నాకు కొంత వెసలుబాటు లభించేది. అసలు అర్ధరాత్రి దాటంది ఇంటికి చేరుకున్న రోజులు తక్కువ. మాదిగవారి కుంట మా ముత్తాత నాటిదే... దళిత కుటుంబంలో పుట్టినా బాగానే ఉన్నాం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు కలిపి మొత్తం ఆరుగురం. అందరం కూడా కారుల్లోనే తిరిగే పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మా ముత్తాత షేర్ మల్లయ్య 90 – 100 ఎకరాల ఆసామి. ఆయన సంపాదించిన ఆస్తి మా తాతలు, తండ్రులు, మా వరకు వస్తోంది. ఇప్పటికీ ఆశాలపల్లి శివారులో ఉన్న మాదిగవారి కుంట మా ముత్తాత నుంచి వచ్చిందే. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. ఆస్తుల పంపకాలు లేవు. కలిసే ఉంటున్నాం. టీఆర్ఎస్, కేసీఆర్ చలవే.. షెడ్యూల్ కులంలో పుట్టినా మా కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఇదే సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా లేదు. కనీసం సర్పంచ్ కూడా గెలవని నేను రెండు సార్లు ఎంపీగా ఎన్నిక కావడం అనేది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చలవ, ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వల్ల నాకు ఈ స్థాయి వచ్చింది. ఇది జీవితంలో గొప్ప అనుభూతి, అవకాశం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, కేసీఆర్ సార్ దృష్టిలో నాకు స్థానం దక్కడం నా అదృష్టం. నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ కేసు నమోదైనా ఏ–1గా నా పేరే ఉండేది. అంతలా ఉద్యమంలో పాల్గొనేవాన్ని. ‘తల్లి’ విగ్రహం ప్లాన్ సార్‌దే... దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ప్లాన్ మా అధినేత కేసీఆర్ సార్‌దే. ఆయన ప్లాన్, సూచనలకు అనుగుణంగా విగ్రహాన్ని రూపొందించా. తెలంగాణ ఉద్యమం, ప్రజల ఆశలు, ఆశయాలకు ఆనుగుణంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం సృష్టికర్తగా కేసీఆర్ దగ్గర దక్కిన గుర్తింపు, పేరు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. అమ్మానాన్న, అన్న కొడుకు మరణం బాధించాయి... ఉమ్మడి కుటుంబంలో జీవితం హాయిగా సాగుతున్న సమయంలో అమ్మ కమలమ్మ, నాన్న ప్రకాశం మరణం విషాదాన్ని నింపింది. ఆరుగురి సంతానంలో ఆఖరి వాడినైన నాకు ఆ సమయంలో అమ్మనాన్నల మృతి తీవ్రంగా బాధించింది. సోషల్ మూమెంట్లో తిరిగే మా అన్న కొడుకు టిల్లు(21) చనిపోవడం కూడా తీవ్రంగా కలచివేసింది. మా అన్న బాగా సెన్సిటివ్. టిల్లు కొందరు యువకులతో గొడవ పడ్డారని వాళ్ల తల్లిదండ్రులు మా అన్నకు ఫిర్యాదు చేశారు. దీంతో అన్న టిల్లును మందలించగా ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న కుమారుడు టిల్లు చనిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఆయన బంగారం.. వర్ధన్నపేట టికెట్ మిస్సయితే బాధ పడ్డా...పసునూరి దయాకర్ సతీమణి జయవాణి ఉద్యమం, టీఆర్ఎస్లో 2014 వరకు కీలకంగా పని చేస్తున్న దయాకర్‌కు వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ వస్తుం దని ఆశించాం. కేసీఆర్ సార్ కూడా దాదాపుగా దయాకర్‌కే ఇస్తామన్నారు. ఇదే సమయంలో పార్టీలో సమీకరణ కోణంలో అరూరి రమేష్‌కు కేటాయించారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. అయితే, ‘జయా.. సార్‌కు అన్నీ తెలుసు, ఎప్పుడు ఎవరికీ టికెట్ ఇవ్వాలన్నది కేసీఆర్ సార్‌కు బాగా తెలుసు.. సరైన సమయంలో న్యాయం చేస్తానన్నారు.. సార్ దృష్టిలో మనం ఉన్నాం.. టికెట్‌తో సంబంధం లేదు’ అని ఆయన(దయాకర్) నన్ను అనునయించారు. ఆ తర్వాత వెంటనే వచ్చిన 2015 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా దయాకర్ పేరును కేసీఆర్ సార్ ప్రకటించడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మళ్లీ ఇప్పుడు టికెట్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా ఎంపీగా గెలిపించారు. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేసినందుకు గొప్ప గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఇక మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఉమ్మడి కుటుంబంలో ఈ ఇంటికోడలుగా రావడం ఆనందంగా ఉంది. రాజకీయంగా ఎక్కడికి వెళ్లినా.. ఏ సమయంలో వచ్చినా ఇంట్లోకి చేరగానే అవన్నీ మరచిపోయి చికాకు లేకుండా నాతో పాటు పిల్లలు రోని భరత్, ప్రీతమ్‌తో గడుపుతారు. అందుకే మా ఆయన బంగారం. పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ బాటలో సాగుతూ ఆయన ప్రజాజీవితంలో ఉండటం నిజంగా మా అదృష్టం. -
సీఎం కేసీఆర్ ప్రసంగాలే ప్రేరణ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉపన్యాసాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలం గాణ ఉద్యమంలో, కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ప్రసంగా లను తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసి ‘సమ్మోహనాస్త్రం’పేరుతో ముద్రించిన పుస్తకాన్ని కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మాట తుపాకీ తూటా కంటే శక్తివంతమైనదని ప్రజలను కదిలించే ఉపన్యాసానికి యుద్ధ ట్యాంకుల కంటే తిరుగులేని శక్తి ఉంటుందన్నారు. కేసీఆర్ తన మాటలతో, ఉపన్యాసాలతో రాష్ట్ర సాధ న ఉద్యమాన్ని నడిపి గెలిపించిన తీరును జూలూరు గౌరీశంకర్ సమ్మోహనాస్త్రంలో వివరించారని కేటీఆర్ అన్నారు. ఆయన ఉపన్యాసాల్లోని ముఖ్యమైన మాటలను పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచన అభినందనీయమని కొనియాడారు. అతి క్లిష్టమైన ఆర్థిక అంశాలను తన మాటలతో జనానికి సులభంగా అర్థమయ్యేలా కేసీఆర్ వివరించిన తీరును దీనిలో పొందుపరిచారన్నారు. ఎన్నికల వేళ 82 సభల్లో కేసీఆర్ ఉపన్యాసాలతో పాటుగా 51 నెలల ఆయన పాలన సారాన్ని రచయిత ప్రజల ముందు నిలిపారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శాసన మండలి సభ్యులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరక్టర్ నారా కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నించే వారికి కాదు.. పరిష్కరించే వారికి మద్దతు
సాక్షి, కథలాపూర్(వేములవాడ): ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, వచ్చే ఎన్నికల్లో ప్రశ్నించే నేతలను కాదు.. పరిష్కరించే నేతలకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి కోరారు. శనివారం కథలాపూర్ మండలకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆదివారం కరీంనగర్లో జరిగే సీఎం కేసీఆర్ సభకు వేములవాడ నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానానికి చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సుధాకర్‌రెడ్డికి ఓటర్లు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎం. జీ రెడ్డి, నాయకులు నాగేశ్వర్రావు, ధర్మపురి జలేందర్, జెల్ల వేణు, కల్లెడ శంకర్, దొప్పల జలేందర్, ఆకుల రాజేశ్, కిరణ్‌రావు, మహేందర్, గోపు శ్రీనివాస్, ఎం.డీ రఫీక్, సంబ నవీన్, శీలం మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సీతరామ్‌నాయక్ పాల్గొన్నారు. -
ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
చంద్రశేఖర్‌కాలనీ: నిజామాబాద్ ఎంపీ కవిత ఫ్రేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ మ్యాగజైన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఎంపీకి అవార్డును అందజేశారు. దేశం లోని మొత్తం 545 మంది ఎంపీలకుగాను మ్యాగ జైన్ సర్వే ద్వారా 25 మందిని ఉత్తమ ఎంపీలుగా ఎంపిక చేసింది. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికిపైగా పాయింట్లువచ్చాయి. కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని సర్వే రిపోర్టు పేర్కొన్నది. రాజనీతి, ఉద్యమకారిణి, అనవ్య ప్రతిభాశాలిగా, సామాజిక సేవాధృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఆమెకు మంచి గుర్తింపు లభించిందని మ్యాగజైన్ పేర్కొఇంది. కళా సంస్కృతిని రక్షిచడంలో, మంచి మహిళా వక్తగా ఆమె పేరు పొందారని వివరించింది. అమెరికా నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజలను చైతన్యపర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని సంస్థ పేర్కొంది. బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆమె చురుగ్గా వ్యవహరించారని, తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారని వివరించింది. అవార్డు అందుకున్న ఎంపీ కవితకు అభిమానులు అభినందనలు తెలిపారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాసానికి వెళ్లి స్పీకర్ ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
వందే యువతరం
ఈ రోజుల్లో ఎన్నికల బరిలో నిలిచి గెలవడం మాటలు కాదు. అంతా నోట్లతోనే పని. అయితే ‘మనీ’తో కాదు ‘నేమ్’తోనూ నెగ్గుకు రావచ్చంటూ కొందరు యువకులు ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. తమ పేరు నలుగురికీ పరిచయమైతే చాలని కొందరంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లక్షల్లో ఖర్చు.. చేసేందుకూ వెనుకాడబోమంటున్నారు. గెలిచే అవకాశాలున్నా లేకున్నా బరిలో నిలవడమే ధ్యేయమని అంటున్నారు. తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న యువతే పోటీకి ముందు వరుసలో ఉండగా, జిల్లాల్లో సామాజిక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించిన యువత రెండో వరుసలో ఉన్నారు. బరిలో నిలిస్తే బలమెంతో తెలస్తుందని కొందరు, బలం నిరూపించుకొని ప్రధాన పార్టీలకు దగ్గర కావాలనే స్పృహతో ఇంకొందరు పోటీకి సై అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 25–35 ఏళ్ల వయస్సు గల యువకులు దాదాపు 250 మంది పోటీలో నిలిచారు. వీరిలో 50 మంది వివిధ పార్టీల తరఫున బరిలో ఉండగా, మిగతా వారంతా ఇండిపెండెంట్లే. పేరొస్తే చాలు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పేరు వస్తుందనే కొందరు యువకులు పోటీకి దిగుతున్నట్టు చెబుతున్నారు. ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడమంటే మాటలు కాదని, అయినా తమ పేరైనా పదిమందికీ తెలుస్తుందంటున్నారు. ఖర్చులకు కూడా తగిన వనరులను సమకూర్చుకుంటున్నట్టు కొందరు చెబుతున్నారు. గతంలో వివిధ పార్టీల్లో పనిచేసిన అనుభవంతో, యువతను రాజకీయాల్లోకి ఆకర్శించేందుకు తాను రాజకీయాల్లోకి దిగానంటున్నాడు గౌటే గణేశ్. గతంలో కొత్తపల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన అనుభవంతో శివసేన టికెట్‌పై సిరిసిల్ల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్టు చెబుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన అనుభవంతో నాగర్‌కర్నూలు స్థానం నుంచి పోటీకి దిగుతున్న రాజు నేత.. ‘అమరుల ఆశయ సాధనకు, రాజకీయాల పంథాను మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా’నని అంటున్నాడు. ‘నాకున్న పరిచయాలతోనే జడ్చర్ల నుంచి పోటీకి దిగుతున్నా’నని చెబుతున్నాడు కరాటే రాజు. ఇలా ఎవరికి వారు పలువురు యువకులు లక్ష్యాలను నిర్ధేశించుకుని ఎన్నికల సమరాంగణంలోకి దూకుతున్నారు. ఈసారి యువ ఓటర్లూ ఎక్కువే.. ఈ ఎన్నికల్లో యువత పెద్దసంఖ్యలో పోటీలో ఉంటే, ఓటర్లగానూ యువత అధిక సంఖ్యలో నమోదయ్యారు. గా ఉన్నారు. రాష్ట్రంలో 18–19 ఏళ్ల మధ్య వయసున్న 7,96,174 మంది కొత్త యువ ఓటర్లు త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 4,56,470 మంది యువకులు, 3,39,560 మంది యువతులు, 2,695 మంది ఇతరులున్నారు. ఇక, 20–29 ఏళ్ల మధ్య గల ఓటర్లూ పెద్దసంఖ్యలోనే ఉన్నారు. చాలాచోట్ల వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయని అంచనా. నోటా గెలిస్తే.. సీటు గల్లంతే! ఓటు వేస్తున్న క్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటరు నోటాకే జై కొడుతున్న సంగతి తెలిసిందే. 2013లో నోటాను ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో ఈ నోటా చాలాసార్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది. చాలా సందర్భాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల ఓట్ల మధ్య తేడా.. నోటాకు వచ్చిన ఓట్లతో సమానం. ఇది నోటాకున్న శక్తి. కానీ బరిలో ఉన్న అభ్యర్థులందరికన్నా నోటాకే ఎక్కువ సీట్లు వచ్చినా.. పెద్దగా ప్రభావం ఉండదు. ఇలాంటి సమయాల్లో.. అందరికంటే ఓట్లు సంపాదించిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తున్నారు. కానీ ఈ పరిస్థితులను మార్చేందుకు హరియానా ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా.. నోటాను కూడా అభ్యర్థిగా గుర్తించనున్నారు. అందరికన్నా ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే.. మళ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న హరియాణాలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు హరియాణా ఎన్నికల ప్రధానాధికారి దలీప్ సింగ్ పేర్కొన్నారు. ‘నోటాకన్నా అభ్యర్థులకు తక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే.. ఎక్కువ సీట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తాం’ అని దలీప్ వెల్లడించారు. డిసెంబర్16న హిసార్, రోహ్తక్, యమునానగర్, పానిపట్, కర్నాల్ మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సార్.. చిల్లరే ఇవ్వగలను! మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్‌లో ఓ అభ్యర్థి నామినేషన్ ధరావతుగా నాణేలను చెల్లించిన సంగతి మరువకముందే.. రాజస్తాన్‌లో ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. రాజస్తాన్‌లోని పచ్పద్రా నియోజక వర్గంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సమర్థ రామ్ అనే 35 ఏళ్ల యువకుడు.. నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతోపాటుగా రూ.10వేల విలువైన నాణాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. ‘ఈ చిల్లరమొత్తాన్ని లెక్కపెట్టలేను. నాకొద్దు’ అని ఆ అధికారి సమర్థ రామ్‌కు చెప్పేశారు. అయితే తన వద్ద నోట్లు లేవని.. చిల్లరమాత్రమే ఉందని చెప్పడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చింది. -
ఉద్యోగం వదిలి ఉద్యమించినా టికెట్ ఇవ్వలేదు
ములుగు (వరంగల్): ‘తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమంలో తొలి నుంచి భాగస్వామినై పోరాడాను. 2003 నుంచి పరోక్షంగా ఉద్యమంలో పాల్గొన్నా. ఉద్యమ స్ఫూర్తితో 2004లో నా టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పాల్గొన్నా. 2004 ఎన్నికల్లో టికెట్ అడిగినా టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో పొదెం వీరయ్యకు టికెట్ కేటాయించారు. 2009లో టీడీపీతో పొత్తు కారణంగా సీతక్కకు సీటు దక్కింది. అయినా పార్టీ ఉన్నతికి పాటుపడుతూనే ఉన్నా. శ్రమను గుర్తించి ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తారని ఆశించినా ఫలితం దక్కకపోవడం బాధగా ఉంది’ అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్ తన ఆవేదనను వెలిబుచ్చారు. సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ను గ్రామ స్థాయిలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బేతెల్లి గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, జలగం మోహన్‌రావుతో కలిసి బలోపేతం చేశామని, అప్పటి నుంచి రూ.50 లక్షల నుంచి 60 లక్షలను ఖర్చు చేశానన్నారు. ఆ తర్వాత ఆర్థికంగా చతికిలపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కు తగిన గుర్తింపు దక్కలేదని వాపోయారు. 20 14లో టికెట్ ఆశించినా టీఆర్ఎస్ తరఫున అజ్మీ రా చందూలాల్‌కు టికెట్ కేటాయించారని తెలి పారు. అయినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశించినా చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్‌కి ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించినా ఏ ఒక్కరూ సహకరించలేదని వాపోయారు. మళ్లీ చందూలాల్కి టికెట్ కేటాయించ డం బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా అధిష్టానం తన గత పోరాటాలు, త్యాగాన్ని గుర్తిం చి ములుగు టికెట్ విషయంలో తన అభ్యర్థనను పరిశీలించాలని కోరారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
రామన్నపేట : కేంద్రరాష్ట్ర, ప్రభుత్వాల వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎండగట్టాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జనంపల్లి గ్రామంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి నాయకులు పదవులను సైతం త్యాగంచేసి అధిష్టానంపై ఒత్తిడి తేవడం వల్లనే సోనియాగాంధీ తెలంగాణరాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో ధర్మారెడ్డిపల్లి కాలువ ద్వారా నార్కట్‌పల్లి చెరువులను నింపామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రసన్న రత్నాకర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్‌పంతులు, యూత్‌కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి నాయకులు నీల దయాకర్, మందడి రవిందర్‌రెడ్డి, నక్క యాదయ్య, బండ ఉపేందర్‌రెడ్డి, బద్దుల రమేష్,సంగిశెట్టి సుదర్శన్, కైరంకొండ చక్రపాణి, చలమల్ల లింగారెడ్డి, ఆగు మల్లయ్య, బైరు హరిక్రిష్ణ, నక్క ప్రవీన్, వంగాల సంపత్‌కుమార్, గట్టు గోపాల్, వంగాల గోపాల్, మారయ్య, గట్టు నరేష్,వంగాల రవి, గట్టు క్రిష్ణ, వంగాల గోవర్దన్, గట్టు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
భోజ్యానాయక్ త్యాగం మరువలేనిది
రఘునాథపల్లి: తెలంగాణా అమరవీరుడు లునావత్ భోజ్యానాయక్ త్యాగం మరువలేనిదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని అశ్వరావుపల్లి శివారు వీరారెడ్డి తండాలో భోజ్యానాయక్ ఆరో వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై భోజ్యానాయక్ సమాది వద్ద పార్టీ నాయకులతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నామాల బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. గండ్ర తీరుతోనే భోజ్యా నాయక్ ఆత్మహత్య.. హన్మకొండ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని రహదారిపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని భోజ్యానాయక్ నిప్పంటించుకున్నాడని ఎమ్మెల్యే గుర్తు చేశారు. 92 శాతం గాయాలతో ఎంజీఎం అస్పత్రిలో చికిత్స పొందుతున్న భోజ్యానాయక్‌ను తాను కలిసినప్పుడు ‘రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే తెలంగాణ వస్తదా ..? రాదే రాదు’ అని గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అమరవీరుని తల్లిదండ్రులు మంక్తి, నామాల కడుపు కోత తీర్చలేనిదన్నారు. భోజ్యానాయక్ నగర్ పేరిట వీరారెడ్డి తండాలో డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా హామి ఇచ్చారు. వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ కోసం అమరుడైన భోజ్యానాయక్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గాంధీనాయక్ కోరారు. అమరుడు భోజ్యానాయక్ తల్లిదండ్రులు మంక్తి, నామాలకు గాంధీనాయక్ పాదాభివందనం చేశారు. వర్ధంతి సభలో ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, ఎంపీటీసీ దొనికల రమాదేవి, సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు గుడి వంశీధర్‌రెడ్డి, మారుజోడు రాంబాబు, చెంచు రమేష్, గొరిగ రవి, మడ్లపల్లి సునిత, మాలోతు నర్సింహ్మా, కుర్ర కమలాకర్, నీల ఆగయ్య, రాజేందర్‌నాయక్, అంజనేయులు, వెంకటేష్‌యాదవ్, గైని రాంచందర్ పాల్గొన్నారు. -
ప్రజల వేదనలోంచే తెలంగాణ ఉద్యమం
-సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ, -ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న వనపర్తి టౌన్ : కోట్లాది మంది ప్రజల వేదన, ఆత్మఘోష, ఆరణ్యరోదన, అంతులేని వివక్షలోంచి తెలంగాణ ఉద్యమం ఉద్భవించిందని సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం రాత్రి వనపర్తి పట్టణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి నేతత్వంలో ‘పుడమి తల్లికి కష్ణ పుష్కర శోభ’పై జరిగిన జిల్లాస్థాయి కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో రతనాలు ఉన్నాయని, దాని ఫలాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం కషి చేయాలన్నారు. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు రైతులకు వరంగా మారనున్నాయన్నారు. అనంతరం వారిద్దరికీ మూడు తులాల బంగారు గండపిండేరంతో వనపట్ల సుబ్బయ్య, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డిలను బంగారు ఉంగరాలు, మాజీ ఎమ్మెల్యే స్వర్థసుధాకర్‌రెడ్డి సహా కవితగానం చేసిన వందమంది కవులను ఘనంగా సన్మానించారు.