
మాట్లాడుతున్న మార్క్‌ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి
సాక్షి, కథలాపూర్(వేములవాడ): ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, వచ్చే ఎన్నికల్లో ప్రశ్నించే నేతలను కాదు.. పరిష్కరించే నేతలకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి కోరారు. శనివారం కథలాపూర్ మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆదివారం కరీంనగర్‌లో జరిగే సీఎం కేసీఆర్ సభకు వేములవాడ నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానానికి చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సుధాకర్‌రెడ్డికి ఓటర్లు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎం. జీ రెడ్డి, నాయకులు నాగేశ్వర్‌రావు, ధర్మపురి జలేందర్, జెల్ల వేణు, కల్లెడ శంకర్, దొప్పల జలేందర్, ఆకుల రాజేశ్, కిరణ్‌రావు, మహేందర్, గోపు శ్రీనివాస్, ఎం.డీ రఫీక్, సంబ నవీన్, శీలం మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సీతరామ్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment