గోరటి వెంకన్నకు బంగారు గండపిండేరం తొడుగుతున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
ప్రజల వేదనలోంచే తెలంగాణ ఉద్యమం
Published Mon, Aug 15 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
-సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ,
-ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న
వనపర్తి టౌన్ : కోట్లాది మంది ప్రజల వేదన, ఆత్మఘోష, ఆరణ్యరోదన, అంతులేని వివక్షలోంచి తెలంగాణ ఉద్యమం ఉద్భవించిందని సినీగేయ రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం రాత్రి వనపర్తి పట్టణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి నేతత్వంలో ‘పుడమి తల్లికి కష్ణ పుష్కర శోభ’పై జరిగిన జిల్లాస్థాయి కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో రతనాలు ఉన్నాయని, దాని ఫలాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం కషి చేయాలన్నారు. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు రైతులకు వరంగా మారనున్నాయన్నారు. అనంతరం వారిద్దరికీ మూడు తులాల బంగారు గండపిండేరంతో వనపట్ల సుబ్బయ్య, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డిలను బంగారు ఉంగరాలు, మాజీ ఎమ్మెల్యే స్వర్థసుధాకర్‌రెడ్డి సహా కవితగానం చేసిన వందమంది కవులను ఘనంగా సన్మానించారు.
Advertisement