నివాళులర్పిస్తున్న చిరుమర్తి లింగయ్య
రామన్నపేట : కేంద్రరాష్ట్ర, ప్రభుత్వాల వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎండగట్టాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జనంపల్లి గ్రామంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి నాయకులు పదవులను సైతం త్యాగంచేసి అధిష్టానంపై ఒత్తిడి తేవడం వల్లనే సోనియాగాంధీ తెలంగాణరాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో ధర్మారెడ్డిపల్లి కాలువ ద్వారా నార్కట్‌పల్లి చెరువులను నింపామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రసన్న రత్నాకర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్‌పంతులు, యూత్‌కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి నాయకులు నీల దయాకర్, మందడి రవిందర్‌రెడ్డి, నక్క యాదయ్య, బండ ఉపేందర్‌రెడ్డి, బద్దుల రమేష్,సంగిశెట్టి సుదర్శన్, కైరంకొండ చక్రపాణి, చలమల్ల లింగారెడ్డి, ఆగు మల్లయ్య, బైరు హరిక్రిష్ణ, నక్క ప్రవీన్, వంగాల సంపత్‌కుమార్, గట్టు గోపాల్, వంగాల గోపాల్, మారయ్య, గట్టు నరేష్,వంగాల రవి, గట్టు క్రిష్ణ, వంగాల గోవర్దన్, గట్టు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment