సాక్షి, కృష్ణా: ప్రాజెక్టుల పరిశీలన పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చాక ఎక్కువ కాలం ఏపీలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, టీడీపీలేనని.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ అడ్డమైన పనులు చేశాడని, చివరకు ఎన్టీఆర్ కాళ్లు ప్టటుకుని టీడీపీలో చేరాడని చంద్రబాబుపై మండిపడ్డారాయన. చంద్రబాబు నుంచి వెన్నుపోటు తప్పదంటూ జనసేనాని పవన్‌కల్యాణ్‌ను హెచ్చరించారు కొడాలి నాని.
1978 నుంచి అంటే.. 40 ఏళ్లపాటు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. అన్నేళ్లు అధికారం అనుభవించి ఎందుకు ప్రాజెక్టులు కట్టలేకపోయాడని కొడాలి నాని నిలదీశారు. ‘‘పులిచింతల , గాలేరు-నగరి , తెలుగు గంగ , వెలుగొండను ఎందుకు పూర్తిచేయలేకపోయారు. పోలవరానికి జాతీయ హోదా తెచ్చిన ఘనత వైఎస్సార్‌ది. కానీ, చంద్రబాబు తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో గ్రాఫిక్స్ లో పోలవరం కట్టారు. రూ.55 వేల కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారు. పోలవరానికి కనీసం రూ. 100 కోట్ల రూపాయల పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు?.
కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు చేతుల్లోకి తీసుకున్నారు. పైగా పోలవరం కాలువలు తవ్వుతుంటే దేవినేని ఉమా లాంటి వాళ్లతో కోర్టుల్లో కేసులు వేయించాడు ఇదే చంద్రబాబు. ఇప్పుడేమో పోలవం ఎందుకు కట్టలేదని జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మరి గతంలో ఎందుకు పూర్తి చేయలేదు కొడాలి నాని మండిపడ్డారు.
‘‘పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు 420 పనులు చేసి.. ఇప్పుడు అధికారం ఇస్తే ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తిచేస్తానంటున్నారు. చంద్రబాబు వేసే మెతుకుల కోసం ఆశపడేవాళ్లు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ , బీఆర్ నాయుడు. పది కిలోమీటర్లు నడిచి జారుడుబల్లలా జారిపోతున్నాడు పప్పు లోకేష్. చంద్రబాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. లెగిస్తే మనిషిని కాదనే చంద్రబాబు చేసేదేమీ లేదు. సీఎం జగన్‌పైనా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా అడ్డగోలుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించకతప్పదు. కుప్పంలో చంద్రబాబు గెలిచేది లేదు.. చావు దెబ్బ ఖాయం. 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు’’
వాళ్లంతా చంద్రబాబు బ్యాచ్
చంద్రబాబు వెల్ విషర్స్ అంతా ఇప్పుడు పవన్‌కు సపోర్టర్స్‌గా ఉన్నారు. రామోజీరావు, బీఆర్ నాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణ, లింగమనేని, నాందెండ్ల మనోహర్.. అంతా చంద్రబాబు వల్ల లబ్ధిపొందినవాళ్లే. చంద్రబాబు ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు వీళ్లు. అలాంటి వాళ్లు పవన్ పక్కన చేరారు. ఎన్టీఆర్ లేకపోతే ఈ బఫూన్ చంద్రబాబు ఎక్కడ ఉండేవాడు?. జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచాడు. బాబును నమ్ముకుంటే నీకు కూడా అదే గతి పట్టిస్తారు అంటూ పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. చంద్రబాబులో అణువణువునా వెన్నుపోటు ఉంది. అవసరానికి వాడుకోవడం ఉంది. ఇదే విషయాన్ని పవన్‌ను నేరుగా కలిసి చెప్పాలనుకున్నా. కానీ, కుదరలేదు. ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కాబట్టి, చంద్రబాబు ఎలాంటివాడో ఇప్పటికైనా తనంతట తానుగా తెలుసుకోవాలి అని పవన్‌కు కొడాలి నాని సూచించారు.
ఊరుకోం
పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహియాత్ర చేయడం వల్ల ఎవరికీ అభ్యంతరం లేదు. ఎన్నికలయ్యే వరకూ పవన్ ఈ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగితే అభ్యంతరం లేదు. పవన్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తప్పులు ఎత్తిచూపినా.. సీఎం జగన్ పై విమర్శలు చేసినా అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు 420 బ్యాచ్‌తో కలిసి రాజకీయ దాడికి దిగితే మాత్రం ఊరుకునేది లేదు. చంద్రబాబును సపోర్ట్ చేసే ఎవరినైనా రాజకీయంగా బట్టలూడదీసి రోడ్డుమీద నిలబెడతాం. ఒకవేళ చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ అమలు చేయాలనుకుంటే.. మాత్రం ఎదుర్కొంటాం అని కొడాలి నాని స్పష్టం చేశారు.
గద్దర్‌తో మంచి అనుబంధం
గద్దర్ మరణం విప్లవ కారులకు, ఉద్యమకారులకు , మాకు తీరని లోటని కొడాలి నాని అన్నారు. ‘‘గద్దర్‌తో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. ఎమ్మెల్యే వంశీతో కలిసి చాలాసార్లు గద్దర్ ను కలిశా. 2009లో గద్దర్ చేతుల మీదుగా ఉంగుటూరులో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశాం. గద్దర్ తన పాటలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అట్టడుగు వర్గాలను , యువతను కదిలించారు. గద్దర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment