మోదీ, అమిత్‌ షా ఇచ్చిన ఆఫర్‌ దెబ్బకు బాబు మంచంపై పడ్డాడు: కొడాలి నాని | Kodali Nani Fires On Chandrababu, Pawan Kalyan And Purandeswari | Sakshi
Sakshi News home page

మోదీ, అమిత్‌ షా ఇచ్చిన ఆఫర్‌ దెబ్బకు బాబు మంచంపై పడ్డాడు: కొడాలి నాని

Published Wed, Feb 14 2024 4:58 PM | Last Updated on Wed, Feb 14 2024 6:37 PM

Kodali Nani Fires On Chandrababu Pawan kalyan Purandeswari - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల, లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని విమర్శించారు మాజీ మంత్రి కొడాలి నాని. అందుకే ఒకపక్క దత్తపుత్రుడు, మరోపక్క ఉత్త పుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మ.. ఇప్పుడు కాంగ్రెస్‌ చెల్లెమ్మను వెనకాల నిబెట్టుకొని ఎన్నికలకు వస్తున్నాడని మండిపడ్డారు.

చెల్లెమ్మ వదినమ్మ, దత్తపుత్రుడు, కలిసి బాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని మండిపడ్డారు. వీళ్లందరూ ఉన్నా ధైర్యం సరిపోక ఢిల్లీ పెద్దలను సైతం మభ్య పెడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా ఇచ్చిన ఆఫర్‌ దెబ్బకు.. బాబు మంచంపై పడ్డాడని, వారం నుంచి ఏపీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. 

ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారిందన్నారు. హెలికాప్టర్‌ లేకపోతే పవన్‌ భీమవరం వెళ్లలేరా అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్య హెలికాప్టర్‌ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో పవన్‌ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారని తెలిపారు. జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. 

ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో పవన్ చెప్పగలడని, మంగళగిరి నుంచి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉందన్నారు. లేకపోతే ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్ళవచ్చని తెలిపారు.. హెలికాప్లర్ కోసమే పవన్ పర్యటన వాయిదా వేసుకోవడంపై భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడని గమనించుకోవాలని చెప్పారు.
చదవండి: Babu : కరకట్టపై పొత్తులు.. బాబు ఏమన్నాడంటే.?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement