సాక్షి, కృష్ణా జిల్లా: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాడు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది’’ అని ధ్వజమెత్తారు.
‘‘ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు.. భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2 వేల కోట్లు దాటింది. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ.35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు?. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా?’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు.
చంద్రబాబు కోసమే పవన్ జన సున్నా పార్టీ..
‘‘2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెర వెనుక టీడీపీకి మద్దతుగా ఉన్నాడని ఇప్పుడు ముసుగు తొలగింది అంతేనని కొడాలి నాని అన్నారు. ‘‘చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జన సున్నా పార్టీ పెట్టారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైంది. ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడు’’ అని కొడాలి వ్యాఖ్యానించారు.
చదవండి: నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు
Comments
Please login to add a commentAdd a comment