15న ఏం జరగబోతోంది? | Kona Venkat request to Mahesh Kathi | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 8 2018 9:32 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Kona Venkat request to Mahesh Kathi - Sakshi

టాలీవుడ్‌ విశ్లేషకుడు మహేష్‌ కత్తి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ఆయన భావిస్తున్న ఆయన ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్‌ చేశారు.

‘‘ మౌనం ఎప్పటికీ మోసం చేయదు. జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. కత్తి మహేష్‌కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్‌కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది’’ అని కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? లేదా వెంకట్ ద్వారా ఏదైనా సందేశం పంపించనున్నారా? అసలు ఆ రోజున ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ వివాదానికి ఎంత త్వరగా ముగింపు పడితే అంత మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

పూనమ్‌ కూల్‌ రియాక్షన్‌

ఇక తనపై మహేష్‌ కత్తి చేసిన విమర్శలపై నటి పూనమ్‌ కౌర్‌ నేరుగా స్పందించలేదు. కాకపోతే ట్విట్టర్‌లో మహేష్‌పై అనుచిత ట్వీట్‌ చేసిన ఓ వ్యక్తిని ఆమె రీ ట్వీట్‌తో సున్నితంగా మందలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement