అజ్ఞాతవాసిపై వర్మ ట్వీట్‌ | Varma tweet on Agnyaathavaasii Movie | Sakshi
Sakshi News home page

అజ్ఞాతవాసిపై వర్మ ట్వీట్‌

Published Thu, Jan 11 2018 1:12 AM | Last Updated on Thu, Jan 11 2018 7:45 AM

 Varma tweet on Agnyaathavaasii Movie - Sakshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో స్పందించాడు. పవన్‌ కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్‌ చిత్రమైన ‘పులి’  ని చూసినట్లుందని పరోక్షంగా సెటైర్లు వేశాడు. అంతేకాకుండా సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి రివ్యూ బాగుందంటూ కితాబిచ్చాడు.

‘నేను ఓ పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. కానీ  పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంపింగ్‌ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

పవన్‌ కన్నా కత్తి చాలా అందగాడు.!
సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి రివ్యూపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఇప్పుడే కత్తి రివ్యూ వీడియో చూశాను. పవన్‌ కళ్యాణ్‌ కన్నా కత్తి చాలా అందంగా కనిపించాడు’అని ట్వీట్‌ చేశాడు. దీనికి మహేశ్‌ కత్తి థ్యాంక్స్‌ చెప్పగా.. జబర్ధస్త్‌ ఫేమ్‌ హైపర్‌ ఆది మాత్రం ‘అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లుంది విరిద్దర్నీ చూస్తే.....!!!!!’  అని కామెంట్‌ చేశాడు. కొద్దిరోజులుగా మహేశ్‌ కత్తి, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్‌ కత్తిని వర్మ పొగడటం పవన్‌ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లైంది. దీంతో వర్మ ట్వీట్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పడు ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement