woman Cheating
-
చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి
బనశంకరి: బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న గూగుల్ టెక్కీ, ఓ యువతితో స్నేహం చేసి ఆమె కుటుంబ సభ్యుల చేతిలో బందీ అయిన ఘటన చోటు చేసుకుంది. గూగుల్ ఇండియా సీనియర్ మేనేజర్, మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన గణేశ్ శంకర్, షిల్లాంగ్ ఐఐఎంలో ఎంబీఏ చదువుతున్న సమయంలో భోపాల్‌కు చెందిన సుజాత అనే యువతి పరిచయమైంది. ఐదేళ్లు ప్రేమించుకున్నారు. ఇదిలా ఉంటే ఆ యువతిని కలవడానికి భోపాల్ వెళ్లిన గణేశ్ శంకర్‌కు ఆ యువతి కుటుంబ సభ్యులు బాగా మర్యాదలు చేశారు. అనంతరం మత్తు కలిగించే ఔషధం ఇచ్చి ఓ చీకటి గదిలో బంధించారు. ఆ తరువాత గణేశ్‌ను బెదిరించి ఆ యువతితో పెళ్లి చేసి ఫొటోలు తీశారు. బ్లాక్‌మెయిలింగ్ రూ. 40 లక్షలు ఇవ్వాలని, లేదంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. ఎలాగో గణేశ్, భోపాల్‌లోని కమలానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతి, కుటుంబ సభ్యులు ముగ్గురిపై (యువతి సుజాత, తండ్రి కమలేశ్‌సింగ్, సోదరుడు శైవేశ్‌సింగ్, విజేంద్రకుమార్)పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గణేశ్ కూడా వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు సుజాత కుటుంబ సభ్యులు తమకు తెలిపారని, గణేశ్ ద్వారా తాము మోసపోయామని వారు బెంగళూరులో ఫిర్యాదు చేశారని భోపాల్ కమలానగర పోలీస్ అధికారి అనిల్‌కుమార్ వాజ్‌పేయి తెలిపారు. -
'ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది'
సాక్షి, మీర్‌పేట (రంగారెడ్డి): అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఇచ్చిన డబ్బుకు పదింతలు అధికంగా ఇస్తానని నమ్మించి రూ.11 లక్షలతో ఓ మహిళ, కొందరు వ్యక్తులు ఉడాయించిన సంఘటన మీర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం కస్తూరికాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (43) వృత్తిరీత్యా వ్యాపారి. నందిహిల్స్‌లో నివాసముండే ఇతని స్నేహితుడు మహేశ్.. రాజు అనే ఓ వ్యక్తిని శ్రీనివాస్‌రెడ్డికి పరిచయం చేశాడు. రాజుకు తెలిసిన నగరంలోని ఓ మహిళకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుందని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని స్నేహితులైన మరో ఏడుగురు కలిసి రూ.11 లక్షలు పోగు చేశారు. మధ్యవర్తులుగా ఉన్న రాజు, వినోద్, మహమ్మద్‌ఖాన్‌ల ద్వారా ఈ నెల 1వ తేదీన రాత్రి సదరు మహిళను హస్తినాపురం విశ్వేశ్వరయ్య కాలనీలోని శ్రీనివాస్‌రెడ్డి సోదరుడి షెడ్డుకు పిలిపించి పూజలు చేయించారు. ముందుగా రూ.5 వేలు పూజలో పెడితే రూ.50 వేలుగా మారుస్తానని మహిళ చెప్పగా.. వారు ఆ నగదు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత వాటిని రూ.50 వేలుగా చేసి చూపించింది. చదవండి: (వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్) నమ్మకం కలిగించిన తర్వాత మిగతా డబ్బును కూడా పూజలో పెట్టాలని చెప్పగా శ్రీనివాస్‌రెడ్డి, అతని స్నేహితులు రూ.11 లక్షలు పూజలో పెట్టారు. పథకం ప్రకారం సదరు మహిళ అందరం కలిసి భోజనం చేద్దామని వారికి చెప్పింది. భోజనం చేస్తుండగా 15 మంది వ్యక్తులు రెండు కార్లలో అక్కడికి వచ్చి పోలీసులమని బెదిరించి శ్రీనివాస్‌రెడ్డి, అతని స్నేహితులపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం సదరు మహిళ పూజలో ఉంచిన రూ.11 లక్షలు తీసుకుని కారులో వచ్చిన వారితో పాటే పారిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. -
మూడు పెళ్లిళ్లు.. మరికొందరితో చాటింగ్.. ఎలా బయటపడిందంటే..
మైసూరు: టిండర్ యాప్ ద్వారా పురుషులతో పరిచయం ఏర్పర్చుకుని ప్రేమ పేరుతో దగ్గర కావడం, ఆపై పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు విడిపోవడమే పనిగా పెట్టుకుంది. మూడో భర్త ఆమె నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. మైసూరులోని ఉదయగిరికి చెందిన నిధా ఖాన్ గత 2019లో బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసే ఆజామ్ఖాన్తో టిండర్ యాప్‌లో పరిచయం పెంచుకుని పెళ్లాడింది. కొన్నిరోజులకే నిధాఖాన్ ప్రవర్తన తేడాగా ఉండటంతో ఆజామ్‌ఖాన్ ఆరా తీశాడు. ఆమె అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిందని గుర్తించాడు. ఆన్లైన్లో మరికొందరు పురుషులతో చాటింగ్ చేస్తోందని మైసూరులోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..) -
యువతి ఫ్రం యూకే.. వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్.. కట్ చేస్తే!
సాక్షి, హిమాయత్‌నగర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగర వాసిని నిండా ముంచిందో సైబర్ నేరస్తురాలు. ఢిల్లీలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారని, విలువైన వస్తువులు ఇవ్వట్లేదు డబ్బులు కట్టాలంటూ అమాయకుడైన నగర వాసి నుంచి పలు దఫాలుగా రూ.17 లక్షల 89 వేలు దోచుకుంది. పదే పదే డబ్బులు కావాలంటూ హింసించడంతో బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. బోయినపల్లికి చెందిన ఓ యువకుడు రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్‌ని షాదీడాట్కామ్లో పెట్టాడు. మీ ప్రొఫైల్ నచ్చిందంటూ, తాను యూకేలో ఉంటానంటూ ఓ యువతి వాట్సప్ ద్వారా పరిచయమైంది. చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు.. కొద్దిరోజుల పాటు వాట్సాప్, స్కైప్, టెలిగ్రామ్‌ల ద్వారా చాటింగ్, వీడియో కాల్స్ జరిగాయి. ఎక్కువ రోజుల ఉండలేనంటూ ఇండియా వచ్చేస్తానంటూ యువకుడికి ఆశ చూపించింది. యూకే కోడ్ ఉన్న ఫోన్ నంబర్లతోనే వాట్సప్‌లో చాటింగ్, కాల్స్ మాట్లాతుండేంది. తాను యూకే నుంచి ఢిల్లీ వచ్చి..ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు వస్తానని యువకుడికి సమచారం ఇచ్చింది. కట్ చేస్తే మరుసటి రోజు తనని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, విలువైన వస్తువులు, కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఫోన్లు చేసి బోరున విలపించింది. చదవండి: జమ్మికుంటలో విషాదం: పోలీస్ సైరన్ విని.. పరిగెత్తి అక్కడున్న కొందరితో ఫోన్లో కూడా ఆఫీసర్ల మాదిరిగా మాట్లాడించింది. దీంతో యువతిని విడిపించేందుకు ఆమె చెప్పిన విధంగా పలు అకౌంట్లకు పలు దఫాలుగా రెండు రోజుల వ్యవధితో రూ.17లక్షల 89 వేలు పంపాడు. ఇంత పంపినా ఆమె రాకపోగా.. మరిన్ని డబ్బులు కావాలని పదే పదే అడుగుతుండటతో బాధితుడుకు అనుమానం వచ్చింది. వెంటనే మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చదివింది ఏడు.. రూ. 20 కోట్లకు కుచ్చుటోపి
సాక్షి, ఒడిశా (రణస్థలం): రెండు వందల మంది మహిళలను మోసం చేసి రూ.20 కోట్లతో ఓ మోసగత్తె ఉడాయించింది. ఏడో తరగతి మాత్రమే చదివిన మహిళ చిట్టీలు, వడ్డీల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేసి ఆఖరికి బిచాణా ఎత్తేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పైడిభీమవరం గ్రామానికి చెందిన లింగం నీలవేణి అనే మహిళ అదే గ్రామంలో కొంతమంది మహిళలను చేరదీసి చిట్టీలు ఎత్తడం మొదలుపెట్టింది. ఇలా 2015లో ఒకటి, రెండో చీటీలతో మొదలైన ప్రయాణం 2017కు అధిక వడ్డీలు ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేయడం వరకు వెళ్లింది. చెప్పిన వడ్డీలు రెండేళ్లపాటు సక్రమంగా చెల్లిస్తుండడంతో మహిళలంతా అకర్షితులై ఒక్కొక్కరుగా రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.70 లక్షలకుపైగా వడ్డీలకు, చిట్టీలు కట్టడానికి ఇచ్చేశారు. సగరం నాగమణి అనే మహిళ అయితే నీలవేణిని నమ్మి కోటి రూపాయలకు పైగా తనకు తెలిసిన మహిళలతో చిట్టీలు కట్టించి, వడ్డీలకు ఇప్పించారు. ఇలా పైడిభీమవరంతో పాటు చుట్టు పక్కల గ్రామాల మహిళలైన కొమ్ములూరు తవిటమ్మ రూ.70 లక్షలు, జి.అనురాధ రూ.52 లక్షలు, జి.పార్వతి రూ.18 లక్షలు, ఇనపకూర్తి ఆదిలక్ష్మి రూ.8 లక్షలు, ఎం.ఆదిలక్ష్మి రూ.6 లక్షలు, మరి కొందరు మహిళలు రూ.44 లక్షలు, రూ.61 లక్షలు ఇలా వడ్డీలకు, చిట్టీల రూపంలో నీలవేణికి అప్పగించేశారు. తాను యలమంచిలిలో ఫైనాన్స్ నడుపుతున్నానని, మీ సొమ్ములకు నాది హామీ అని చెప్పిందే గానీ ఒక్కరితోనూ ప్రామిసరీ నోటు, రిజిస్ట్రేషన్ బాండ్లు కూడా రాయించలేదు. నెలవారీ వడ్డీలతో సహా డబ్బులు చక్కగా వచ్చేస్తున్నాయని మహిళలంతా ఆమెను నమ్మి కోట్లాది రూపాయలను ఆమె చేతుల్లో పెట్టేశారు. (వివాహేతర సంబంధం.. నీవు లేక నేను లేనంటూ) అప్పుడప్పుడు ఆ మహిళ గోనె సంచులతో డబ్బులు తీసుకురావడం, ఆ సొమ్ములు తోటి మహిళలకు చూపడంతో నీలవేణికి వడ్డీకి డబ్బులు ఇస్తే అధిక వడ్డీ వస్తుందనే ఆశతో తండోపతండాలుగా ఆమె ఇంటికి క్యూ కట్టేవారు. అయితే ఇటీవల కరోనాకు ముందు విజయనగరం నుంచి వస్తుండగా రూ.2.60 కోట్ల సోమ్ము దొంగలు పట్టుకుని వెళ్లిపోయారని నమ్మించింది. మరో రూ.6 కోట్లు యలమంచిలి ఫైనాన్స్‌లో ఉన్నాయని కథలు చెప్పడం మొదలు పెట్టింది. చిట్టీలు పాడిన డబ్బులు ఇదిగో ఇచ్చేస్తుŠాన్ననని, వడ్డీలకు వాడిన సొమ్ములు అదిగో ఇచ్చేస్తున్నాని డ్రామాలు ఆడుతూ రోజులు గడపడంతో మహిళలందరికీ అనుమానం పెరిగింది. సోమవారం ఉదయం కొంతమంది మహిళలు ఇంటికి వెళ్లి నిలదీసే సరికి, వెనక నుంచి మెల్లగా పరారైంది. ఆమె భర్త రెడ్డీస్ లేబరేటరీలో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ బాధిత మహిళలు మా డబ్బులు ఎవరిస్తారని ప్రశ్నిస్తే మాకేంటి సంబంధం అంటూ తప్పించుకుంటున్నారు. దీంతో మోసం చేసి పరారైన మహిళ ఇంటి ముందు బాధితలు టెంటు వేసి నిరసన చేపట్టారు. సంఘటన తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో బాధిత మహిళలు జరిగిన సంఘటన గురించి వివరించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని జె.ఆర్.పురం ఎస్ఐ ఈ.శ్రీనివాస్ తెలిపారు. -
అప్పన్న బంగారం కేసులో కీలక మలుపు
సాక్షి, నెల్లూరు: అప్పన్న బంగారం పేరిట మహిళను మోసగించిన ఘటనలో ప్రధాన నిందితురాలు కె.హైమావతి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా కేసు పూర్వాపరాలను వెల్లడించారు. విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన కె.హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. సూళ్లూరుపేటకు చెందిన ఎం.శ్రావణితో పరిచయం ఏర్పడింది. ఆలయంలో బంగారం వేలం వేస్తున్నారంటూ మాయమాటలు చెప్పి హైమావతి ఆమెను నమ్మించి రూ. 38 లక్షలు ఖాతాలో జమ చేయించుకుంది. శ్రావణి బిల్లులు కోరగా నిందితురాలు సింహాచలం ఆలయ ఈవో ఫోర్జరీ సంతకాలతో బిల్లులను పంపింది. నగదు తీసుకున్న నిందితురాలు బంగారం ఇవ్వకుండా ఆమెను మోసగించడంతో బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు, సింహాచలం ఆలయ అధికారులకు ఈ–మెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేసింది. మెయిల్లో పంపిన బిల్లులు నకిలీవని ఆలయ అధికారులు గుర్తించి గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితురాలు విశాఖపట్నం జైలులో ఉంది. నగదు స్వాధీనం : పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. హైమావతిని పిటీ వారెంట్‌పై నెల్లూరుకు తీసుకువచ్చారు. సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆమె వద్ద నుంచి రూ.11.35 లక్షల నగదు, 280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్స్పెక్టర్ బాజీజాన్‌సైదా తెలిపారు. -
కొలువు పేరిట టోకరా..
సాక్షి, కడప : కడపకు చెందిన ఓ మహిళ గత ప్రభుత్వంలో సర్వశిక్ష అభియాన్‌తోపాటు సాఫ్ట్వేర్, బ్యాంకుఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆశచూపి జిల్లా వ్యాప్తంగా పలువురి వద్ద కోట్లలో వసూళ్లకు పాల్పడింది. ఎస్ఎస్ఏలో సీఆర్పీ ఉద్యోగానికి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకుంది. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అడ్వాన్సులు తీసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పలువురి నుంచి రూ.3 లక్షలకు తక్కువ లేకుండా వసూలు చేసింది. బ్యాంకు ఉద్యోగాలంటూ కొందరి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసింది. కడప నగరంతోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజుపాలెం, బద్వేలు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో పలువురు నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసింది. ఈ మొత్తం కోట్లలోనే ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అప్పట్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు ఉద్యోగాల కోసం సదరు మహిళకు సిఫార్సు చేస్తూ పలువురిని పంపారు. వారంతా ఆ మహిళకు డబ్బులు ముట్టజెప్పారు. టీడీపీ నేతల అండతోనే సదరు మహిళ వసూళ్ల దందాకు దిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య అధికారుల పేర్లను సైతం వాడి ఆ మహిళ నిరుద్యోగులను మోసగించినట్లు తెలుస్తోంది. బాధితుల సొమ్ముతో సదరు మహిళ కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేసి దర్పం వెలగబెడుతోంది. కడప నగరంలో ధనిక వర్గం ఉండే ప్రాంతంలో విలాసవంతమైన జీవితాన్ని వెలగబెడుతోంది. డామిట్ కథ అడ్డం తిరిగింది ప్రభుత్వం మారడంతో సదరు మహిళ బండారం బయటకు పొక్కింది. ఉద్యోగం ఇప్పించక, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు కొందరు నిలదీశారు. డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆమె కొత్త ఎత్తుగడకు తెరలేపింది. వారిని వంచించేందుకు ఐపీని ఆయుధంగా వాడింది. బాధితుల్లో 16 మంది వద్ద పలు వ్యాపారాల పేరుతో అప్పులు చేసినట్లు చూపించి ఐపీ నోటీసులు పంపింది. దీంతో బిత్తర పోయిన బాధితులు ఆ మహిళను సంప్రదించారు. తాను డబ్బులిచ్చేది లేదంటూ సదరు మహిళ ఎదురు బెదిరింపులకు దిగింది. చేసేది లేక బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఉద్యోగం కోసం ఆమెకు డబ్బులు ఇచ్చిన కొందరు ముఖ్యులకు మాత్రం కొంతలో కొంత డబ్బులు చెల్లిస్తానని, గొడవ చేయవద్దని సర్దుబాటు ప్రయత్నానికి దిగింది. చాలాకాలంగా ఇదే చెబుతున్నా డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదని ముఖ్యులైన బాధితులు కొందరు ‘సాక్షి’కి తెలిపారు. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు కొందరు బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. జిల్లా ఎస్పీకి సైతం రాత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు వారు సిద్దమయ్యారు. ఈ సందర్బంగా పలువురు పాత్రికేయులను కలిసి మహిళ దోపిడీని వివరించారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతోనే డబ్బులు ఇచ్చామని వారు వాపోయారు. సీఎం రమేష్ పీఏ సూచనతోనే ఆలూరి అశ్విని ఉద్యోగం కోసం డబ్బులు ముట్టజెప్పినట్లు ఆమె బావ ఏఎం కొండయ్య ‘సాక్షి’ ముందు వాపోయారు. సమీప బంధువులు సీఎం రమేష్ ఇంటిలో పనిచేస్తారని, వారి సూచన మేరకే మహిళకు డబ్బులు ముట్టజెప్పినట్లు చెప్పారు. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సిఫార్సు చేయడంతోనే ఉద్యోగం కోసం రూ. లక్ష మహిళకు ముట్టజెప్పినట్లు బాధితుడు వివరించారు. టీడీపీ నేతల అండతోనే మహిళ కోట్లలో వసూలు చేసిందని వారంతా వాపోతున్నారు. అధికారులు స్పందించి ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లకు పాల్పడిన మహిళపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ⇔ ప్రొద్దుటూరుకు చెందిన జి.రాజశేఖర్, రాజుపాలెంకు చెం దిన సురేష్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఓ మహిళకు ఉద్యోగాల కోసం అడ్వాన్సుల కింద లక్షలు చెల్లించారు. కోటి రూపాయలకుపైనే వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం లేదు. ఒక్కపైసా తిరిగి ఇవ్వలేదు ⇔ పులివెందులకు చెందిన ప్రదీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం రూ.3 లక్షలు ముట్టజెప్పాడు. కడపలోని ఆయనకు తెలిసిన మురళీకృష్ణ ఆచారి ద్వారా ఈ మొత్తాన్ని ఉద్యోగం ఇప్పిస్తానన్న మహిళకు అందజేశాడు. ఏడాది అవుతున్నా అతనికి జాబు రాలేదు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి ద్వారా జాబు విషయమై పలుమార్లు మహిళతో మాట్లాడారు. జాబు ఇప్పించలేదు..డబ్బు ఇవ్వలేదు.. చివరకు ఐపీ నోటీసు అందింది. ⇔ ప్రొద్దుటూరుకు చెందిన సుధాకర్ సర్వశిక్ష అభియాన్‌లో సీఆర్పీ ఉద్యోగం కోసం సదరు మహిళకు రూ. 50 వేలు ముట్టజెప్పారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన రూ. 2 లక్షల మొత్తాన్ని చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అతనికి ఉద్యోగం ఇవ్వలేదు..డబ్బులూ ఇవ్వలేదు.. తీరా చూస్తే ఐపీ నోటీసు వచ్చింది. ⇔ మండల కేంద్రమైన రాజుపాలెంకు చెందిన నాగ సురేంద్ర ఆంధ్రాబ్యాంకులో అటెండర్ ఉద్యోగం కోసం సదరు మహిళకు రూ. లక్ష ముట్టజెప్పారు. ఏడాదైనా జాబు లేదు.. డబ్బులు తిరిగి ఇవ్వలేదు.. ఇప్పుడు ఆయనకు ఐపీ నోటీసు వచ్చింది. ⇔ కడపకు చెందిన ఆరూరు అశ్విని సీఎం రమేష్ పీఏ సుధాకర్ సూచనతో సర్వశిక్ష అభియాన్‌లో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టు కోసం రూ.80 వేలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్ కింద రూ.50 వేలు ముట్టజెప్పారు. జాబు వచ్చిన మరుక్షణమే మిగిలిన రూ.30 వేలు చెల్లించేలా మాట్లాడుకున్నారు. రూ.50 వేల మొత్తాన్ని అశ్విని బావ ఏఎం కొండయ్య ద్వారా సదరు మహిళకు ముట్టజెప్పారు. జాబు లేదు...డబ్బులు ఇవ్వలేదు. చివరకు ఐపీ నోటీసు వచ్చింది. -
పెళ్లి పేరుతో మహిళ మోసం
చిత్తూరు,తిరుపతి కల్చరల్: పెళ్లి చేసుకొని ఇద్దురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసింది. మరో వ్యక్తిని మాయమాటలతో నమ్మించి ఇంట్లో చేరి నగలతో ఉడాయించింది. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధితులు ఇద్దరు ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల ఎదుట వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన గురుప్రసాద్ మాట్లాడుతూ 2005లో చంద్రకళ అనే మహిళతో తనకు వివాహమైందని తెలిపాడు. ఏడేళ్లు సాగిన కాపురంలో తమకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారని పేర్కొన్నాడు. తర్వాత ఒక కుమారున్ని తీసుకొని ఆమె తన నుంచి వెళ్లిపోయి మోసం చేసిందని ఆరోపించాడు. తిరుపతి శివజ్యోతినగర్‌లో కాపురమున్న గిరిబాబు భార్య నాగమణి మాట్లాడుతూ తాము మదనపల్లెలో అంగడి నడుపుకుంటూ జీవనం సాగించే వారమని తెలిపింది. చంద్రకళ అనే మహిళ తనకు ఎవరూ లేరని, బతుకు దెరువు చూపాలని తమను ఆశ్రయించిందని పేర్కొంది. ఇంటిలో పని చేసుకుంటూ బతకమని తమ ఇంటిలోనే ఒక గది ఆమెకు ఇచ్చామని తెలిపింది. ఈ క్రమంలో తన భర్తను వలలో వేసుకుందని, తాము ఇంటిలో లేని సమయంలో ఇంటిలోనున్న రూ.7 లక్షల నగదును తీసుకొని ఉడాయించిందని ఆరోపించింది. తమ బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని బంగారు నగలు తీసుకొని వెళ్లిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం మూడో వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవకోన ప్రాంతంలో ఉందని తెలిపింది. తమ బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని పేర్కొంది. పోలీసు అధికారులు స్పందించి సదరు చంద్రకళపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
అమెరికా నర్సునంటూ తీయని మాటలు
జయనగర: అమెరికాలో నర్సు, ఆర్బీఐ ఆఫీసర్, కస్టమ్స్ అధికారి తదితర పేర్లతో ఒక మాయలేడి నగరానికి చెందిన టెక్కీకి తీయని మాటలు చెప్పి దఫదఫాలుగా రూ.9.02 లక్షల నగదును తన అకౌంట్‌కు జమచేసుకుని మోసగించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అశోకనగర పోలీసుల కథనం ప్రకారం....నెలమంగలకు చెందిన రమేశ్ అనే వ్యక్తి నగరంలో ఓ ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో టెక్కీ. ఇతడికి ఫేస్ బుక్‌లో రచనా కరం అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ మొబైల్ నెంబర్లు మార్చుకుని కబుర్లు చెప్పుకోవడం ఆరంభించారు. బెంగళూరుకు వస్తానని.. తాను అమెరికాలో నర్సుగా పనిచేస్తున్నట్లు, త్వరలో బెంగళూరుకు వస్తానని, పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి తాను బసచేయడానికి ఇంటిని చూడాలని రమేశ్‌కు తెలిపింది. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులేదని రమేశ్ ఆమెతో చెప్పాడు. అమెరికా డాలర్లు, బంగారు ఆభరణాలు పార్శిల్ ద్వారా పంపిస్తానని, డాలర్లను రూపాయిల్లోకి మార్చుకోవాలని రచనా కరం అతణ్ని బుట్టలోకి వేసింది. ఇది నమ్మిన రమేశ్ కొన్నిరోజులకు ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.4లక్షల 70 వేల నగదు జమచేశాడు. అనంతరం అక్టోబరు 2వ తేదీన ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారి నిషా కుమారి పేరుతో రమేశ్‌కు ఫోన్ వచ్చింది. అమెరికా నుంచి పార్శిల్ వచ్చిందని, కస్టమ్స్ సుంకాన్ని విమానాశ్రయ అధికారి సుమన్‌దేవి ఖాతాకు జమ చేస్తే, పార్శిల్‌ను మీకు పంపిస్తానని చెప్పింది. ఈమె మాటలు నమ్మిన రమేశ్ అక్టోబరు 3వ తేదీన నిషా కుమారి ఖాతా కు రూ.1.62 లక్షల నగదు పంపారు. పార్శిల్ బరువు ఎక్కువగా, పన్నులు కట్టాలని రమేష్‌కు మళ్లీ నిషాకుమారి ఫోన్ చేసింది, మాన్సింగ్ ఖరే అనే అధికారి అకౌంట్‌కు రూ.2.70 లక్షల నగదు జమచేయాలని సూచించింది. ఈమె మాటలు నమ్మిన రమేశ్ ఆమె చెప్పిన ఖాతాలోకి ఆ సొమ్మును జమచేశాడు. మరో రూ.4.70 లక్షలు పంపాలని ఫోన్ చివరికి అక్టోబరు 25 తేదీన ఆర్బీఐ ప్రధానాధాకిరాఇ స్వరబ్ జోషిననే పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి అమెరికా పార్శిల్ కోసం మీరు పంపిన డబ్బు ఆ అకౌంట్లలోకి జమ కాలేదని, మళ్లీ రూ.4.70 లక్షల నగదు అకౌంట్‌కు జమచేయాలని తెలిపాడు. దీంతో అప్పటికే నగదు పంపీ పంపీ విసిగిపోయిన రమేశ్‌కు అనుమానం వచ్చి ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి విచారించగా, ఇదంతా ఫ్రాడ్, ఎవరో నిన్ను తెలివిగా మోసగించారని వారు స్పష్టంచేశారు. బాధితుడు రమేశ్ లబోదిబోమంటూ శనివారం అశోకనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైం పోలీసుల సహాయంతో వంచకురాలి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
బాహుబలి నటుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ, పెళ్లి పేరిట ఓ మహిళను మోసం చేసిన వ్యవహారంలో ఐమ్యాక్స్ మేనేజర్ వెంకట ప్రసాద్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఫిర్యాదుతో వెంకట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లో నివాసముండే ఓ యువతి (33) ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం వివాహం అయినప్పటికీ మనస్పర్థల కారణంగా భర్తతో విడిగా ఉంటోంది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా.. ఐమ్యాక్స్ మేనేజర్ వెంకటప్రసాద్ కన్ను ఆమెపై పడింది. ఆమెతో మాటలు కలిపి దగ్గరయి ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. విడాకులు రాగానే ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేశారు. ఏడేళ్ల సహజీవనంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఇంతలో ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె తెలుసుకుంది. దీంతో నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మహిళతోపాటు చాలా మంది యువతులను వెంకట్ మోసం చేసినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, బాహుబలిలో ప్రభాస్ శివుడు పాత్ర పెంపుడు తండ్రి పాత్ర (అశ్వని భర్త) పాత్రలో నటించింది ఇతనే. తాజాగా రాజేశేఖర్ 'గురుడవేగ' సీఎం పీఏ పాత్రలో ఓ చిన్న పాత్రను కూడా వెంకట్ పోషించాడు. -
ఫేస్ బుక్కయ్యాడు
♦ గోవాలో హోటల్ రూమ్ బుకింగ్ కోసం రూ.21వేలు బదిలీ ♦ సైబర్ పోలీసులకు బాధితుని ఫిర్యాదు ♦ మాదాపూర్‌లో యువతి అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకొని వారి అవసరాలను ఆసరగా చేసుకొని డబ్బులు లాగుతూ మోసం చేస్తున్న ఓ యువతిని నగర సైబర్ క్రైమ్స్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సెల్‌ఫోన్, రూ.మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం...మూసాబౌలికి చెందిన శుభమ్ గుప్తాకు ఫేస్బుక్లో వినమ్రత గోమ్స్ అనే యువతితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె గోవాలో ఉన్నట్టుగా చాట్ ద్వారా తెలుసుకున్నాడు. ఏప్రిల్ నెలలో గోవా టూర్‌కు వెళ్లాలనుకున్న శుభమ్ గుప్తా అక్కడ హోటల్లో ఉండేందుకు వినమ్రత సహాయాన్ని అడిగాడు. ఆమె వెంటనే హోటల్ రూమ్ అద్దెకు ఇప్పిస్తానని చెప్పడంతో 21,000లు ఆమె బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత హోటల్ నుంచి రూమ్ బుకింగ్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం అందకపోవడంతో వినమ్రతకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు నగర సైబర్ క్రైమ్ సెల్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫేస్బుక్ ఐడీ, సెల్ నంబర్ల ఆధారంగా నిందితురాలు మాదాపూర్‌లో ఉంటున్నట్లుగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. గతంలో గోవా, పుణేలోని హోటళ్లలో పనిచేసిన వినమ్రత ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ రెస్టారెంట్లో పనిచేస్తోంది. ఫేస్బుక్లో యువకులతో పరిచయాలు పెంచుకొని వారిని నమ్మించి డబ్బులు లాగుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈమెపై ఇప్పటికే మాదాపూర్ పోలీసు స్టేషన్లోనూ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
మాయ లేడీ
► మాట్రిమోనియల్ పేరుతో మోసం ► అందమైన యువతి ఫొటోతో ప్రొఫైల్ ► పెళ్లి పేరుతో సిటీకి చెందిన ఇద్దరికి టోకరా ► అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: అందమైన ఫొటోలు పెట్టడం... లేని విద్యార్హతలు, ఆస్తుల్ని ఆపాదించుకోవడం... వీటి ఆధారంగా మాట్రిమోనియల్ సైట్లలో ప్రొఫైల్స్ క్రియేట్ చెయ్యడం... ఆకర్షితులైన యువతుల్ని నిలువునా ముంచడం... ఇలాంటి మోసాలకు పాల్పడిన అరెస్టైన యువకుల కేసుల్ని ఇప్పటి వరకు చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్సయ్యింది. బెంగళూరుకు చెందిన ఓ యువతి ఇదే పంథాను అనుసరిస్తూ దేశ వ్యాప్తంగా 2600 మందికి గాలం వేసింది. ఈమె చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ మోసపోయారు. దీంతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సదరు యువతిని బుధవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన శ్రీలత అనే యువతి మాట్రిమోనియల్ సైట్ ఆధారంగా భారీ మోసానికి తెరలేపింది. తన పేరును సుస్మితగా పేర్కొంటూ ఇంటర్నెట్ నుంచి అందమైన యువతి ఫొటో డౌన్లోడ్ చేసుకుంది. వీటిని వినియోగించి ఓ మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. 2600 మందికి టోకరా ఆ ప్రొఫైల్‌లో తనను హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల యువతిగా పేర్కొన్న శ్రీలత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తోందని పేర్కొంది. దీంతో ఆమె ప్రొఫైల్‌లో దేశ వ్యాప్తంగా 2600 మంది లైక్ చేయడంతో పాటు వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అలా ఆకర్షితులైన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ ఉన్నారు. సిటీకి చెందిన ఓ యువకుడితో కొన్ని రోజుల పాటు ఫోన్లో మాట్లాడిన ‘సుస్మిత’ తనపై నమ్మకం పెంచుకుంది. హఠాత్తుగా ఓ రోజు తన పర్సు పోగొట్టుకున్నానంటూ రూ.40 వేలు అడిగింది. అప్పటికే ఆమెను పూర్తిగా నమ్మిన సదరు యువకుడు నగదు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశాడు. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు అడగటంతో అనుమానం వచ్చిన అతను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు డబ్బు డిపాజిట్ అయిన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. సోదరుడి ఖాతాతో డబ్బు వసూలు ‘సుస్మిత’ డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తన సోదరుడి ఖాతాను వాడింది. దీన్ని పోలీసులు ఫ్రీజ్ చేయించడంతో కంగుతిన్న అతడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి డీ–ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరాడు. నగర యువకుడితో సంభాషించడానికి సుస్మిత వాడిన ఫోన్ నెంబర్‌ను ఇతడికి చూపించిన అధికారులు ఆరా తీయగా... తన సోదరికి చెందినదిగా పేర్కొంటూ శ్రీలత ఫోటో చూపించాడు. దీన్ని చూసిన బాధితుడు ఒకింత షాక్‌కు లోనయ్యాడు. ఈ దర్యాప్తు సాగుతుండగానే నగరానికి చెందిన మరో ‘సుస్మిత’ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కొంతకాలం మాట్లాడిన ఆమె తన సమీప బంధువు చనిపోయాడంటూ రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసుల్ని నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపారు. బుధవారం శ్రీలతను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈమె మా ట్రిమోనియల్ ప్రొఫైల్‌పై 2600 మంది ఆకర్షితులు కావడంతో వారిలో ఎందరు బాధితులుగా మారారనేదానిపై ఆరా తీస్తున్నారు. -
రూ.లక్షకే కానిస్టేబుల్ ఉద్యోగం..
కుత్బుల్లాపూర్: కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 2 లక్షలు తీసుకొని మోసం చేసిందో మహిళ. పేట్‌బషీరాబాద్ ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం... దూలపల్లి గంగాస్థాన్‌కు చెందిన రాథో డ్ నరేష్ (26) కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఇతనికి జీడిమెట్లకు చెందిన స్నేహితుడు సతీష్ ద్వారా ఎల్బీనగర్కు చెందిన మహ్మద్ ముని (40) అనే మహిళ పరిచయమైంది. తాను తెలంగాణ సెక్రటేరియట్లో పని చేస్తున్నానని నరేష్‌కు చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెప్పి రూ. 1 లక్ష , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మరో రూ.30 వేలు తీసుకుంది. అదే విధంగా పవన్ అనే మరో యువకుడి వద్ద కూడా రూ. 1 లక్ష వసూలు చేసింది. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులిద్దరూ బుధవారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం
ఖమ్మం: జిల్లాలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. ఇల్లందులోని కాకతీయనగర్ లో సుమారు 2 కోట్ల రూపాయల వరకూ ఆ మహిళ వసూలు చేసి పరారైనట్టు తెలుస్తోంది. చిట్టీల పేరుతో కొందరి దగ్గర సొమ్ము తీసుకుని వ్యాపారం చేస్తున్న ఆ మహిళ సోమ్ము అందగానే ఉడాయించింది. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.