కుత్బుల్లాపూర్: కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 2 లక్షలు తీసుకొని మోసం చేసిందో మహిళ. పేట్‌బషీరాబాద్ ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం... దూలపల్లి గంగాస్థాన్‌కు చెందిన రాథో డ్ నరేష్ (26) కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఇతనికి జీడిమెట్లకు చెందిన స్నేహితుడు సతీష్ ద్వారా ఎల్బీనగర్‌కు చెందిన మహ్మద్ ముని (40) అనే మహిళ పరిచయమైంది. తాను తెలంగాణ సెక్రటేరియట్‌లో పని చేస్తున్నానని నరేష్‌కు చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెప్పి రూ. 1 లక్ష , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మరో రూ.30 వేలు తీసుకుంది. అదే విధంగా పవన్ అనే మరో యువకుడి వద్ద కూడా రూ. 1 లక్ష వసూలు చేసింది. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులిద్దరూ బుధవారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.లక్షకే కానిస్టేబుల్ ఉద్యోగం..
Published Wed, Jul 20 2016 9:29 PM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM
Advertisement
Advertisement