ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హిమాయత్‌నగర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగర వాసిని నిండా ముంచిందో సైబర్ నేరస్తురాలు. ఢిల్లీలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారని, విలువైన వస్తువులు ఇవ్వట్లేదు డబ్బులు కట్టాలంటూ అమాయకుడైన నగర వాసి నుంచి పలు దఫాలుగా రూ.17 లక్షల 89 వేలు దోచుకుంది. పదే పదే డబ్బులు కావాలంటూ హింసించడంతో బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. బోయినపల్లికి చెందిన ఓ యువకుడు రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్‌ని షాదీడాట్‌కామ్‌లో పెట్టాడు. మీ ప్రొఫైల్ నచ్చిందంటూ, తాను యూకేలో ఉంటానంటూ ఓ యువతి వాట్సప్ ద్వారా పరిచయమైంది.
చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు..
కొద్దిరోజుల పాటు వాట్సాప్, స్కైప్, టెలిగ్రామ్‌ల ద్వారా చాటింగ్, వీడియో కాల్స్ జరిగాయి. ఎక్కువ రోజుల ఉండలేనంటూ ఇండియా వచ్చేస్తానంటూ యువకుడికి ఆశ చూపించింది. యూకే కోడ్ ఉన్న ఫోన్ నంబర్‌లతోనే వాట్సప్‌లో చాటింగ్, కాల్స్ మాట్లాతుండేంది. తాను యూకే నుంచి ఢిల్లీ వచ్చి..ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు వస్తానని యువకుడికి సమచారం ఇచ్చింది. కట్ చేస్తే మరుసటి రోజు తనని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, విలువైన వస్తువులు, కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఫోన్‌లు చేసి బోరున విలపించింది.
చదవండి: జమ్మికుంటలో విషాదం: పోలీస్ సైరన్ విని.. పరిగెత్తి
అక్కడున్న కొందరితో ఫోన్‌లో కూడా ఆఫీసర్ల మాదిరిగా మాట్లాడించింది. దీంతో యువతిని విడిపించేందుకు ఆమె చెప్పిన విధంగా పలు అకౌంట్‌లకు పలు దఫాలుగా రెండు రోజుల వ్యవధితో రూ.17లక్షల 89 వేలు పంపాడు. ఇంత పంపినా ఆమె రాకపోగా.. మరిన్ని డబ్బులు కావాలని పదే పదే అడుగుతుండటతో బాధితుడుకు అనుమానం వచ్చింది. వెంటనే మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment