
మైసూరు: టిండర్ యాప్ ద్వారా పురుషులతో పరిచయం ఏర్పర్చుకుని ప్రేమ పేరుతో దగ్గర కావడం, ఆపై పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు విడిపోవడమే పనిగా పెట్టుకుంది. మూడో భర్త ఆమె నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. మైసూరులోని ఉదయగిరికి చెందిన నిధా ఖాన్ గత 2019లో బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసే ఆజామ్‌ఖాన్‌తో టిండర్ యాప్‌లో పరిచయం పెంచుకుని పెళ్లాడింది.
కొన్నిరోజులకే నిధాఖాన్ ప్రవర్తన తేడాగా ఉండటంతో ఆజామ్‌ఖాన్ ఆరా తీశాడు. ఆమె అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిందని గుర్తించాడు. ఆన్‌లైన్లో మరికొందరు పురుషులతో చాటింగ్ చేస్తోందని మైసూరులోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..)
Comments
Please login to add a commentAdd a comment