Tinder app
-
'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'!
టెక్నాలజీ! రెండంచుల కత్తి అనేది నూటికి నూరుపాళ్లు నిజం. సవ్యంగా వాడుకోవడం తెలియాలే కానీ అద్భుతాలు చేయోచ్చు. అదే సమయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటే 'కథ వేరేలా ఉంటుంది'. డేటింగ్ యాప్స్ కూడా అంతే! మీటింగ్, డేటింగ్, సింగిల్, మింగిల్ అని మొదలై రియలైజ్ అయ్యేలోపు వీలైనంత సొమ్ము చేసుకుంటాయి. అలా ఓ యువకుడు 'టిండర్' యాప్‌లో 'జెన్నీ'తో చాట్ చేశాడు. చివరికి తాను జీవిత కాలంలో సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. నిజానికి ట్విట్టర్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా నెట్ వర్క్‌లు ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేశాయి. వేల కిలోమీటర్ల దూరం ఉన్నవారిని కూడా ఫ్రెండ్స్‌గా మార్చేస్తున్నాయి. కానీ రెగ్యులర్ సోషల్ మీడియాతో పెద్ద మజా ఏముంది. నచ్చితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. మాట్లాడుతారు. స్నేహితుల్లా కనెక్ట్ అవుతారు. అంతకు మించి ఉండే ఛాన్స్ తక్కువ. ఈ పాయింట్‌తోనే కొత్త కొత్త డేటింగ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిన టిండర్ యాప్‌లో అమెరికాకు చెందిన మైక్ చాట్ చేసి జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్ము రూ.20లక్షలు పోగొట్టుకున్నాడు. అమెరికాకు చెందిన మైక్ సరదాగా గడిపేందుకు టిండర్ యాప్‌లో లాగిన్ అయ్యాడు. అంతే అలా లాగిన్ అయ్యాడో లేదో..వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు..'హలో కమాన్ మైక్ మీరు సింగిలా, అయితే మింగిల్ అవ్వండి' అంటూ మెసేజ్ చేసిన జెన్నీకి అడ్డంగా దొరికి పోయాడు. తాను మలేషియాకు చెందిన జెన్నీ'ని అంటూ ఓ యువతి మైక్‌ను పరిచయం చేసుకుంది. ఆ టిండర్ యాప్ పరిచయం వాట్సాప్‌కు మారింది. నిమిషాలు, గంటలు కాస్తా రోజులయ్యాయి. పలకరింపులు మారిపోయాయి. ఎంతలా అంటే పేరు ఊరు తెలియకుండానే బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టేంతలా. వాస్తవానికి మైక్‌కు బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేదు. కానీ జెన్నీ "మైక్ మా మామయ్య ఎంఎన్సీ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్‌లో పనిచేస్తున్నాడు. బిట్ కాయిన్లో పెట్టుబడులు ఎలా పెట్టాలో సలహా ఇవ్వడంలో దిట్ట.కావాలంటే నువ్వూ పెట్టుబడులు పెట్టు మైక్. భారీగా లాభాలొస్తాయ్" అంటూ కవ్వించే మాటలతో మెల్లగా ముగ్గులోకి దించింది. జెన్నీ మాట విని చట్టబద్దమైన బిట్‌కాయిన్ సంస్థలో 3వేల డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. అవి కాస్త పెరగడంతో..యువతి తన ప్లాన్‌ను మెల్లగా అమలు చేసింది. మైక్ నాకు తెలిసిన సంస్థ ఉంది. అందులో ఆ 3వేల డాలర్లు ట్రాన్స్ఫర్ చేయి. అంతకంతకూ పెరిగిపోతాయి అంటూ నమ్మించింది. అలా జెన్నీ చెప్పిన ఓ ఫేక్ బిట్ కాయిన్ కంపెనీ వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టాడు. అవి కాస్తా డబుల్ అవ్వడంతో జెన్నీ మాటమీద నమ్మకంతో రూ.20లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సీన్ కట్ చేస్తే 4నెలల తరువాత బాధితుడి అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెబ్సైట్ ఫేక్ అని, జెన్నీ మోసం చేసిందని నిర్ధారించారు. దీంతో తాను మోసపోయానని, న్యాయం చేయాలని మైక్ పోలీసులతో మొరపెట్టుకున్నాడు. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రావడం కష్టమని, టెక్నాలజీ పట్ల, ముఖ్యంగా ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
మూడు పెళ్లిళ్లు.. మరికొందరితో చాటింగ్.. ఎలా బయటపడిందంటే..
మైసూరు: టిండర్ యాప్ ద్వారా పురుషులతో పరిచయం ఏర్పర్చుకుని ప్రేమ పేరుతో దగ్గర కావడం, ఆపై పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు విడిపోవడమే పనిగా పెట్టుకుంది. మూడో భర్త ఆమె నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. మైసూరులోని ఉదయగిరికి చెందిన నిధా ఖాన్ గత 2019లో బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసే ఆజామ్ఖాన్తో టిండర్ యాప్‌లో పరిచయం పెంచుకుని పెళ్లాడింది. కొన్నిరోజులకే నిధాఖాన్ ప్రవర్తన తేడాగా ఉండటంతో ఆజామ్‌ఖాన్ ఆరా తీశాడు. ఆమె అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిందని గుర్తించాడు. ఆన్లైన్లో మరికొందరు పురుషులతో చాటింగ్ చేస్తోందని మైసూరులోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..) -
డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలు తెగ వాడేస్తున్న పాపులర్ 10 యాప్స్ ఇవే..!
సోషల్ మీడియా వచ్చేశాక ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఇబ్బడి ముబ్బడిగా కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు యాప్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల జీవితాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలామంది వాటిని వినియోగించుకోవడంతో పాటు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ‘సెన్సార్ టవర్’ నివేదిక ప్రకారం.. డబ్బులు చెల్లించి మరి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న ప్రపంచంలోనే పాపులర్ యాప్‌ల గురించి ఒక నివేదిక విడుదల చేసింది. ”ఆపిల్ యాప్ స్టోర్‌లోని టాప్ 100 నాన్-గేమ్ సబ్స్క్రిప్షన్ యాప్‌లు.. 2021లో 13.5 బిలియన్(లక్ష కోట్లకు పైగా) డాలర్లు ఆర్జించాయి” అని ఈ నివేదిక పేర్కొంది. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ 100 సబ్స్క్రిప్షన్ యాప్‌ల కోసం $4.8 బిలియన్లు ఖర్చు చేశారు. ఈ టాప్ 10 యాప్‌ల జాబితాలో డేటింగ్ యాప్‌లు, ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ యాప్‌లు.. కొన్ని గూగుల్ యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా డబ్బు ఖర్చు చేసి వినియోగించే టాప్ 10 యాప్‌ల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ వన్ టెక్ దిగ్గజం గూగుల్ అపరిమిత క్లౌడ్ స్టోరేజ్ సేవలను అందించేందుకు గూగుల్ వన్(Google One) యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో 10 కోట్ల డౌన్లోడ్ ను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ సేవలను పొందాలంటే వినియోగదారుడు కొత్త మొత్తం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 15 జీబీ స్టోరేజ్ వరకు వినియోగదారుడు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 15జీబీ స్టోరేజి పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిస్నీ+ 2021లో చాలా మంది వ్యక్తులు ఎక్కువగా డబ్బులు చెల్లించి వాడిన యాప్‌గా డిస్నీ+ నిలిచింది. వారి టీవి స్క్రీన్లపై వినోదం కోసం దీన్ని ఎక్కువగా చూశారు. డిస్నీ+ వంటి ఓటీటీ యాప్‌ల కోసం ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. యూట్యూబ్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో యూట్యూబ్ ఒకటిగా నిలిచింది. అయితే, ఇందులో వచ్చే ప్రకటనలు రాకుండా ఉండటానికి యూట్యూబ్ ప్రీమియం కోసం కొత్త మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌బీఓ మాక్స్ హెచ్‌బీఓ.. ప్రీమియం ఓటీటీ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ యాప్‌ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో వచ్చే వీడియోల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. టిండర్ ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన టాప్ 10 యాప్‌ల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. పండోరా పాడ్ కాస్ట్ లు, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి ఇతర ఆడియో కంటెంట్ కోసం ప్రజలు ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. యూరప్, అమెరికాలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే ఒక పాపులర్ యాప్. ట్విచ్ గేమర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ట్విచ్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్ చాలా అభివృద్ధి చెందింది. ఈఎస్పీఎన్ అమెరికాలో ఈఎస్పీఎన్ స్పోర్ట్స్ కంటెంట్‌కు ప్రధాన యాప్‌గా ఉంది. క్రీడల పరంగా ఈ యాప్ ఆధిపత్యం చెలాయిస్తోంది. చాలా మంది క్రీడల కోసం ఈ యాప్‌ను చూస్తున్నారు. బంబుల్ టిండర్ తరువాత డేటింగ్ యాప్‌లలో బంబుల్ అత్యంత ప్రజాదరణ పొందింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన తొమ్మిదవ యాప్‌గా ఇది నిలిచింది. హులు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో వినోదాన్ని కోరుకునే వినియోగదారులు బాగా ఇష్టపడే యాప్ హులు. ఓటీటీ జాబితాలో అందరికంటే ఎక్కువగా చూసే యాప్‌గా ఇది ఉంది. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!) -
డేటింగ్ యాప్‌లో.. బ్లడ్ డోనార్స్!
కరోనాకు ముందు డేటింగ్ యాప్‌లకు మంచి డిమాండ్ ఉండేది. టిండర్ లాంటి డేటింగ్ యాప్ యూజర్లంతా తమ జీవిత భాగస్వామి కోసం తెగ స్వైప్ చేశారు. కరోనా దెబ్బకు డేటింగ్ యాప్‌లు చప్పబడ్డాయి. కానీ ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో టిండర్ మరోసారి యాక్టివేట్ అయ్యింది. అయితే ఈసారి లైఫ్ పార్టనర్ కోసం కాదు. తమ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికోసం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. డేటింగ్ యాప్ ద్వారా ..రక్తదాతలు, పేషంట్లకు మధ్య వారధిగా నిలుస్తూ ఇద్దరి మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తున్నారు చెన్నైకి చెందిన వైద్యవిద్యార్థి రియా గుప్తా డేటింగ్ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఎంతోమందికి రక్తం అందిస్తున్నారు. ఇటీవల రెండునెలల వయసున్న భవన్ కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు రక్తం అవసరమైంది. కరోనా సమయంలోఎక్కడా రక్తదానం చేసేవారు దొరకలేదు. ఈ విషయం అర్ధరాత్రి రెండు గంటల ప్రాతంలో రియాకు తెలియడంతో.. తనకు తెలిసిన వాళ్లు, స్నేహితులకు ఫోన్లు చేయడం, సోషల్ మీడియా, వాట్సాప్‌లలో బ్లడ్ డోనార్స్ కావాలని పోస్టులు పెట్టింది. ఎట్టకేలకు ఆమె పోస్టులకు టిండర్ అకౌంట్లో ఒక దాత అర్ధరాత్రి మూడు గంటలకు స్పందించారు. దీంతో మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటలకు భవన్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలా అవసరంలో ఉన్న వారెందరికో రియా బ్లడ్డోనార్స్ను ఏర్పాటు చేస్తోంది. ప్లాస్మాడోనర్ ప్రేరణతో.. ‘‘మనదేశంలో కరోనా రెండోసారి విజృంభిస్తోన్న ఈ సమయంలో ‘‘ఫలానా గ్రూపు రక్తం కావాలి! సాయం చేయండి ప్లీజ్!’’ అని సోషల్ మీడియాలో కోకొల్లలుగా మెసేజులు వస్తున్నాయి. అలా ఓ నెలరోజులు పాటు నేను నా ఫ్రెండ్స్ వాళ్ల రిక్వెస్ట్‌లు చూసేవాళ్లం. కరోనా సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువే. వ్యాక్సిన్ వేసుకున్న వారు 28 రోజులు గడవందే రక్తదానం చేయకూడదు. దీంతో రక్తదాతలు దొరకడం చాలా కష్టమైంది. ఇలా అనుకుంటున్న సమయంలో ఓరోజు.. ‘‘టిండర్ అకౌంట్ ద్వారా ప్లాస్మా డోనర్ దొరికారు’’ అని ఒకతను చెప్పడం మేము విన్నాం. అప్పుడు అతనిలాగే బ్లడ్ డోనర్స్ కోసం టిండర్ డేటింగ్ యాప్‌ను వాడాలనుకున్నాం. ఈ క్రమంలోనే నా స్నేహితులతో కలసి ‘‘బ్లడ్‌డోనర్స్ కావాలి’’ అని టిండర్‌లో పోస్టులు పెట్టాము. దానికి మంచి స్పందన లభించడంతో..స్లాక్, టిండర్, వాట్సాప్ గ్రూపులను ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, మెటర్నిటి ఆసుపత్రి, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మొదలైన వాటిని సమన్వయపరిచాం. ఈ సంస్థల నుంచి ‘‘బ్లడ్ కావాలని రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్‌ను టిండర్ గ్రూపులో పోస్టు చేస్తాం! రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారికి పేషంట్లు లేదా ఆసుపత్రి సిబ్బందిని నేరుగా కలుసుకునే Ðð సులుబాటు కల్పిస్తాం’’ అని రియా చెప్పింది. ఇప్పటిదాక వందమందికిపైగా డోనర్స్‌తో రక్తదానం చేయించాము. నా ఇన్స్టాగ్రామ్ పేజి బ్లడ్ డోనార్ కనెక్ట్‌కు రక్తం కావాలని ఏదైనా మెస్సేజ్ వచ్చిందంటే అరగంట నుంచి గంటలోపు రక్త దాతను వెదికి రిక్వెస్ట్ పెట్టిన వారికి చేరుస్తాము. త్వరలో మా సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాము’’ అని రియా వివరించింది. రియా చేస్తున్న సాయం గురించి తెలుసుకున్న రెడ్ క్రాస్ ఇండియా, చెన్నై ట్రైకలర్ వంటి ఎన్జీవోలు సైతం రక్తం కోసం రియాను సంప్రదించడం విశేషం. -
టిక్‌టాక్ గురించి ఒక క్రేజీ అప్డేట్
చైనీస్ షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ 2020లో 540 మిలియన్ డాలర్ల లాభంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన యాప్ గా నిలిచింది. భారతదేశంలో నిషేధించబడినా, యునైటెడ్ స్టేట్స్లో న్యాయ పోరాటం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా.. సుమారు 400 కోట్ల లాభాన్ని ఆర్జించింది. యూత్ ఎక్కువగా మాట్లాడే డేటింగ్ యాప్ టిండర్ 513 మిలియన్ల డాలర్ల లాభం పొంది రెండవ అత్యంత లాభదాయక యాప్ గా నిలిచింది. యాప్ అనలిటిక్స్ సంస్థ అప్టోపియా విడుదల చేసిన డేటా ప్రకారం.. 478 మిలియన్ డాలర్ల లాభంతో యూట్యూబ్ మూడవ అత్యంత లాభదాయక యాప్ గా, తరువాత డిస్నీ 314 మిలియన్ డాలర్ల లాభంతో, టెన్సెంట్ వీడియో 300 మిలియన్ డాలర్ల లాభంతో తర్వాత స్థానాలలో నిలిచాయి. నెట్‌ఫ్లిక్స్ యాప్ 209 మిలియన్ల డాలర్ల లాభంతో 10వ స్థానంలో ఉంది.(చదవండి: వన్‌ప్లస్ బ్యాండ్ వచ్చేసింది!) చైనా నుండి వచ్చిన డేటా మినహా అన్ని ఐఓఎస్, గూగుల్ ప్లే డేటాతో కలిపి ప్రకటించినట్లు యాప్ అనలిటిక్స్ సంస్థ అప్టోపియా ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ అనలిటిక్స్ సంస్థ ప్రకారం.. టిక్‌టాక్ 2020 ఏడాదిలో 800 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్ గా నిలిచింది. దీని తర్వాత వాట్సాప్ 600 మిలియన్లు, ఫేస్బుక్ 500 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ 500 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో నాల్గవ స్థానంలో ఉంది. అలాగే జూమ్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లతో ఐదవ స్థానంలో ఉంది. 2020, జూన్ 29న టిక్‌టాక్ తో సహా 59 చైనీస్ అనువర్తనాలను భారత హోం మంత్రిత్వ శాఖ నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. -
‘టిండర్’లో టెండర్ల ముద్దూ ముచ్చట్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కరోనా లాగా ఒకరికి ఒకరం అంటుకు పోదామా!, చేతులు శుభ్రంగా కడుక్కుంటే ఒకరికొకరం చేతులు గట్టిగా పట్టుకోవచ్చు!, మాస్కులతో ముద్దూ ముచ్చట తీరెదెలా....!’ ఇవన్నీ డేటింగ్ యాప్ ‘టిండర్’లో కనిపించిన భారతీయ యువతీ యువకుల కబుర్లు. కొందరు ముదురులు మాస్కులు తీసి మాట్లాడుకున్నారు. అయితే వారు కూడా దొంగ మాస్కులు వేసుకున్నారు. ‘లెట్స్ హావ్ నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్’ అనాల్సి చోట ‘లెట్స్ హావ్ క్వారంటైన్ అండ్ చిల్’ అన్నారు. అంటే లైంగికానుభవం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొందరు మర్యాదస్తులు మాస్క్ ఎమోజీలను కూడా బాగానే వాడుకున్నారు. గత ఏడాది నవంబర్ నెల నుంచే ‘టిండర్’కు భారతీయుల డిమాండ్ పెరిగినప్పటికీ ఆది ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి కరోనా వైరస్లాగా బాగా విస్తరించింది. ఇక టిండర్ ప్రధానంగా జంటలు వెతుక్కోవడానికి, వారి మధ్య డేటింగ్ కోసం ఏర్పాటు చేసినప్పటికీ భారతీయ యువతీ యువకులు సామాజిక దూరాలతో విసిగెత్తినట్లున్నారు, కబుర్ల కోసం, కొత్త పరిచయాల కోసం ఎక్కువగా ఉపయోగించుకున్నారు. కొందరు ‘బోర్డ్ ఇన్ ది హౌస్’ అని టిక్‌టాక్ ఫేమస్ పాటను, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పేరడీ పాట ‘రసోడ్ మే కౌన్ థా’ వీడియో, ప్రతీక్ కుహద్ పాటిన ‘కసూర్’ పాటలతో కొందరు యువతీ యువకులు ఒకరి కొకరు పరిచయాలు చేసుకోగా, మరికొందరు ‘బాబా కా డాబా’లో కలసుకుందామా! పరిచయాలను పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ శివారులో కాంటా ప్రసాద్, బడామి దేవి అనే వృద్ధ దంపతులు పెట్టిన ‘బాబా కా డాబా’ సోషల్ మీడియా ద్వారా ఇటీవల బాగా పాపులర్ అయింది. మరి కొందరు బనానా బ్రెడ్, దాల్గొన కాఫీ అంటూ కోడ్ భాషలో మాట్లాడుకున్నారు. -
3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు..
ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్ నెట్ అనే పదం తెలియని వారు చాలా కొద్దీమంది ఉండవచ్చు. ప్రతి చిన్న దానికి ఏదైనా వెతకాలంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది ఇంటర్ నెట్. అందుకే రోజు రోజుకి నెట్ మీద ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ ఏడాది ఆండ్రాయిడ్ వినియోగదారులు 3.3 ట్రిలియన్ గంటలు తమ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయినట్లు ఒక అనలిటిక్స్ సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇంటర్ నెట్ వినియోగం 25 శాతం పెరిగింది అని పేర్కొంది. (చదవండి: ఆ ఫోన్లు కొనకండి అంటున్న నాగార్జున) ఒక అనలిటిక్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ట్విటర్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌తో పోలిస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ అయిన జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్స్ పై ఎక్కువ సమయం గడపడం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా బిజినెస్ యాప్స్ మీద గత ఏడాది కంటే ఈ ఏడాది రెండు రెట్లు ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. వ్యాక్సిన్లు త్వరలో రానున్నప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చే ఏడాది కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే వచ్చే ఏడాది 2021లో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది. 2020లో వినియోగదారులు ఇంటర్ నెట్లో ఎక్కువ గంటలు గడపడానికి కొన్ని ఇతర అంశాలు కూడా ఉండవచ్చు. ఈ ఏడాది ఆండ్రాయిడ్ డౌన్లోడ్లు 10 శాతం పెరిగి 90 బిలియన్ల మార్కును దాటాయి. వినియోగదారులు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న వాటిలో గేమ్స్ కి సంబందించిన యాప్స్ 45 శాతం వాటాను ఆక్రమించుకున్నాయి. ఆశ్చర్యకరంగా ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్లలో భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా ప్రజలు అధిక మొత్తంలో డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ ను ఎక్కువ సంఖ్యలో డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని దాని మీదే గడిపారు. అందుకే ఇది డౌన్లోడ్ పరంగా మొదటి స్థానంలో నిలిచింది. జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ కూడా డౌన్లోడ్ల పరంగా టాప్ 10లో ఉన్నాయి. యూత్ ఎక్కువ ఇష్ట్టపడే టిండర్ యాప్ కరోనా కారణంగా ఒకరిని ఒకరు కలవడం సాధ్యం కాకున్నా ప్రజలు అన్నింటికంటే దీని మీద ఎక్కువ సమయం గడిపినట్లు తెలుస్తుంది. దీనికి లాక్డౌన్ సమయంలో వర్చువల్ డేట్స్ కోసం గ్లోబల్ స్వైపింగ్, వీడియో కాలింగ్ వంటి ఫీచర్స్ ని తీసుకురావడమే. మల్టిపుల్ ప్లేయర్స్ కలిసి ఆడే గేమ్స్ ‘అమాంగ్ అస్’, ‘లూడో కింగ్’ వంటివి జనాకర్షణ పొందాయి. 2021లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని నిపుణుల అంచనా. ఈ ఏడాది మొబైల్ కంపెనీల ఆదాయం 120 బిలియన్ డాలర్లు దాటాయి. -
టిండర్‌తో పరిచయం... వీచాట్‌తో చాటింగ్
సాక్షి, సిటీబ్యూరో: టిండర్ అప్లికేషన్ ద్వారా అపరిచితులతో పరిచయం పెంచుకొని అనంతరం వీచాట్ అప్లికేషన్‌తో మరింత దగ్గరై అతి తక్కువ కాలంలో ఎక్కువగా లాభాలు సంపాదించవచ్చని అమాయకులను ఫారెక్స్ ట్రేడ్ పేరుతో టోకరా వేస్తున్న సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు చైనాకు చెందిన మైక్, హంకాంగ్‌కు చెందిన మీనా పరారీలో ఉండగా, వీరికి బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన రాజేశ్‌కుమార్‌ను అదుపులోకి . వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌కు చెందిన కె.ఉమాకాంత్‌కు టిండర్ అప్లికేషన్ ద్వారా మీనాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ‘వీచాట్’లో చాటింగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫారెక్స్ ట్రేడ్‌లో పెట్టుబడులు పెట్టామని సూచించింది. దీంతో ఉమాకాంత్ వీ చాట్ అప్లికేషన్లో మైక్‌ను సంప్రదించగా మెటా ట్రేడ్4 ఖాతా ఓపెన్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. జూబ్లీహిల్స్‌లోని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేయాలని చెప్పడంతో అతను రూ.2,30,000లు డిపాజిట్ చేశాడు. అయితే దీనికి తగ్గట్టుగానే మైక్ లాభాలు చూపించాడు. దీంతో ఇర్ఫాన్ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాలో రూ.15,20,000 డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత ఆ డబ్బులను నిందితులు విడతల వారీగా డ్రా చేశారు. చివరకు మోసపోయానని తెలుసుకున్న ఉమాకాంత్ గత నెల 30న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన కొండాపూర్‌కు చెందిన రాజేశ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.కాగా వీరు దేశవ్యాప్తంగా పలువురిని ఫారెక్స్ ట్రేడ్ పేరుతో మోసం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
యువతుల ఫొటోలతో ఏడాదిలో రూ.20 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఇన్‌స్ట్రాగామ్ యాప్ నుంచి యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేయడం... వీటిని వినియోగించి డేటింగ్ యాప్ టిండర్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం... దీని ఆధారంగా చాటింగ్ చేస్తూ సెక్స్ చాట్, న్యూడ్ ఫొటోలంటూ వసూలు చేయడం... ఏడాది కాలంగా ఈ పంథాలో అనేక మందిని మోసం చేసిన సీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి వెన్నెల వెంకటేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇతను ఇప్పటి వరకు అనేక మందితో యువతుల మాదిరిగా చాటింగ్ చేసి రూ.20 లక్షలు వరకు వసూలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన వెన్నెల వెంకటేష్ కొన్నాళ్ళు విజయవాడలో విద్యనభ్యసించాడు. ప్రస్తుతం సీఏ ఫైనల్ ఇయర్‌కు రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఉంటున్న తన బావ వద్ద నివసిస్తున్నాడు. చార్టెడ్ అకౌంటెంట్‌గా మారే లోపే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవాలని భావించిన అతగాడు యువతుల పేరిట ఎరవేసే ప్లాన్ వేశాడు. ఇన్‌స్ట్రాగామ్ నుంచి అందమైన యువతుల ఫొటోలను డౌన్లోడ్ చేసుకునేవాడు. వీటిని వినియోగించి వేర్వేరు పేర్లతో డేటింగ్ యాప్ టిండర్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసేవాడు. తనతో ఎవరైనా చాటింగ్ చేయాలంటూ పింగ్ చేయండి అంటూ తన వాట్సాప్ నెంబర్ ఇచ్చేవాడు. అలా చాటింగ్‌లోకి వచ్చిన వారితో అతడే యువతిగా చాటింగ్ చేసేవాడు. సెక్స్ చాటింగ్ చేయాలంటే రూ.100, న్యూడ్ ఫొటోలు పంపాలంటే రూ.300, న్యూడ్ వీడియో కాలింగ్ చేయాలంటూ రూ.500 తన బ్యాంకు ఖాతాలో పంపాలని కోరేవాడు. అంగీకరించిన వారికి విజయవాడలోని బ్యాంకు ఖాతా వివరాలు అందించేవాడు. ఎవరైనా డబ్బు డిపాజిట్ చేయడానికి ముందు ‘మగా, ఆడా?’ అంటూ సందేశం పెడితే వెంటనే ‘బై’ అంటూ వారిని కట్ చేస్తున్న భావన కలిగించే వాడు. దీంతో పూర్తిగా ఇతడి వల్లోపడిపోయి ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు. డబ్బు బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేసే వారు కాదు. దీంతో దాదాపు ఏడాది కాలంలో ఇతగాడు అనేక మందిని మోసం చేసి నుంచి రూ.20 లక్షల వరకు తన ఖాతాలో వేయించుకోగలిగాడు. వెంకటేష్ రెండు నెలల క్రితం నగరానికి చెందిన ఓ యువతి ఫొటో వినియోగించి టిండర్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఆ యువతికి ఇటీవలే నగరానికి చెందిన మరో యువకుడితో నిశ్చితార్థం అయింది. అయితే ఈమె ఫొటోతో ఓ ప్రొఫైల్ టిండర్‌లో ఉన్నట్లు కాబోయే భర్త తరఫు వారికి తెలియడంతో ఎంగేజ్మెంట్ రద్దయింది. దీంతో ఆమె సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేశారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఆయన వెంకటేష్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో యువతులు తమ ఫొటోలు అప్ లోడ్ చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. -
తోడు కోసం 2వేల కి.మీ నడిచిన పులి
ముంబై: ఓ వయసొచ్చాక తోడు కోరుకోవడం మనుషులకు ఎంత సహజమో జంతువులకు కూడా అంతే సహజం. లేకపోతే ఆ పులి తన జోడీని వెతుక్కుంటూ ఏకంగా రెండు వేల కిలోమీటర్లు తిరగడం అంటే మామూలు విషయమా! కానే కాదు. పర్వీన్ కస్వాన్ అనే అటవీ అధికారి ఓ పులి ప్రేమ ప్రయాణాన్ని ట్విటర్లో పంచుకోగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గమ్యం ఎరుగని బాటసారిలా నడక ప్రారంభించిన పులి గురించి చెప్తూ..‘ అది తనకు తోడును కోరుకుంటూ అన్వేషణ ప్రారంభించింది. కాలువలు, పొలాలు, అడవులు, రోడ్లు, గుట్టలు అడ్డొచ్చిన ప్రతిదాన్ని దాటుకుంటూ వెతుకులాడుతోంది. ఎదురయ్యే ప్రతిప్రాంతాన్ని జల్లెడపడుతోంది. పగటి పూట విశ్రాంతి తీసుకుంటూ రాత్రి పూట మాత్రమే నడక సాగించింది. ప్రస్తుతం అది మహారాష్ట్రలోని ద్యాన్‌గంగాకు చేరింది’ అని పేర్కొన్నారు. పులికి అమర్చిన జీపీఎస్ ద్వారానే అది ప్రయాణించిన దూరాన్ని కనుక్కోగలిగామని పర్వీన్ తెలిపారు. అంతేకాక అది నడిచిన మార్గాన్ని తెలిపే మ్యాప్‌ను సైతం పంచుకున్నారు. ఇందులో మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలు దేరిన పులి ఎన్నో జిల్లాలు దాటుకుంటూ అలుపెరగకుండా ప్రయాణించి చివరాఖరకు ద్యాన్‌గంగా అభయారణ్యానికి చేరింది. పులి తన భాగస్వామికోసం వెతుకలాడిన తీరుపై కొందరు సెటైర్లు వేస్తుండగా మరికొందరు మాత్రం దానికి దక్కే ఆడపులి నిజంగా అదృష్టవంతురాలు అని ప్రశంసిస్తున్నారు. ‘అయ్యో, పులికి టిండర్ యాప్ ఉంటే బాగుండు’ అని కొందరు నెటిజన్లు జోకులు కూడా విసురుతున్నారు. ‘లేదు.. ఆ పులిని దాని బంధువులు వెళ్లగొట్టుంటారు’ అని ఓ నెటిజన్ ఛలోక్తి విసిరాడు. (విమానంలోకి పావురం ఎలా వచ్చిందో!) -
ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు మగాళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఆన్లైన్ డేటింగ్ ఫ్లాట్‌ఫారాలపై ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు మగవాళ్లు పోటీ పడుతున్నారు. అంటే దేశంలో డేటింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో 26 శాతం మందే మహిళలు ఉన్నట్లు ‘వూస్’ అనే దేశీయ డేటింగ్ యాప్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. అమెరికా మహిళలకన్నా ఈ సంఖ్య ఎంతో తక్కువ. అమెరికాలో టిండర్, బంబుల్ డేటింగ్ యాప్స్‌ను 40 శాతం మంది మహిళలను ఉపయోగిస్తున్నారు. డేటింగ్ యాప్స్‌ను పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కబుర్ల కోసం ఉపయోగిస్తుండగా భారత్‌లోనే లక్ష్యం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో భారతీయులను ఇంటర్వ్యూలు చేయగా ఎక్కువ మంది, అంటే 32 శాతం మంది అర్థవంతమైన సంబంధం కోసం అని సమాధానం ఇవ్వగా, కొత్త నగరానికి వెళ్లినప్పుడు అక్కడ కొత్త వారిని పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతోని 28 శాతం మంది సమాధానం ఇవ్వగా, కేవలం సామాజిక సర్కిల్‌ను పెంచుకోవడం కోసమే ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్నామని 17 శాతం మంది తెలిపారు. 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులైన యువకులను ప్రశ్నించగా, కేవలం మిత్రల కోసమేనని, ముఖ్యంగా అమ్మాయిల స్నేహం కోసమని చెప్పారు. వారిలో ఎక్కువ మంది చదువురీత్యనో, ఉద్యోగం రీత్యనో దూరం ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన అమ్మాయిలతో స్నేహం చేయడానికి ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారని ‘ట్రూలీమాడ్లీ’ అనే డేటింగ్ యాప్ సహ వ్యవస్థాపకుడు సచిన్ భాటియా తెలిపారు. కొత్త నగరానికి వచ్చినప్పుడు ప్రజల సోషల్ నెట్‌వర్క్‌లు పరిమితం అవుతాయిగనుక, కొత్త వారిని పరిచయం చేసుకోవడానికి ఎక్కువ మంది డేటింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. యూజర్ల మధ్య ఏదో బంధం ఏర్పడడానికి ఈ యాప్స్ ఎంతో దోహదం చేస్తున్నాయని ఆయన తెలిపారు. సగటు యూజర్లు రోజుకు ఈ యాప్స్‌పై దాదాపు 45 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ‘మహిళలతో పోలిస్తే మగవాళ్లే ఈ యాప్స్‌పై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఒకేసారి పలువురు మహిళలతో మాట్లాడేందుకు మగవారు ఇష్ట పడుతుండగా, మహిళలు మాత్రం ఒకేసారి ఇద్దరు, ముగ్గురు మగాళ్లకు మించి మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు’ అని సర్వే నివేదిక వెల్లడించింది. ఇష్టపడే లేదా నచ్చే మహిళా ప్రొఫైళ్లు ఎక్కువ కనిపించడం లేదని మగ యూజర్లు చెబుతుండగా, ఎక్కువ మంది మగాళ్ల ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నామని మహిళలు చెప్పారు. భారత్ లాంటి దేశంలో మహిళలు సామాజికంగా ఇంకా వెనకబడి ఉండడమే కాకుండా మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు కూడా తక్కువే. మొబైల్ ఇంటర్నెట్ యూజర్లలో 89 శాతం మంది మగవాళ్లే ఉన్నారు. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాపై కూడా ముగ్గురు మగవాళ్లకు ఒక మహిళ ఉన్నారు. డేటింగ్ యాప్స్‌లో కూడా 70 శాతం మహిళలు వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించేందుకు భయపడుతున్నారు. డేటింగ్ యాప్స్‌ను ఉపయోగించే మహిళలకు మరింత భద్రతను కల్పించేందుకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే భద్రత విషయంలో ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాయని మహిళా యూజర్లు అభిప్రాయపడ్డారు. అమెరికాలోని అతిపెద్ద ఆన్‌లైన డేటింగ్ సంస్థ టిండర్ గత సెప్టెంబర్‌లో ‘మై లవ్’ అనే డేటింగ్ యాప్‌ను ప్రవేశపెట్టగా, అమెరికాలోని దాని పోటీ సంస్థ ‘బంబుల్’ ఈనెలలో బాలివుడ్ సినీ తార ప్రియాంక చోప్రాతో కలిసి భారతీయ డేటింగ్ యాప్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్ భారతీయ మహిళలు ప్రొఫైల్స్‌లోగానీ, సంభాషణలోగానీ తమ పూర్తి పేరును వెల్లడించాల్సిన అవసరం లేదని, పేరులోని మొదటి అక్షరాన్ని వెల్లడిస్తే సరిపోతుందని యాప్ నిర్వాహకులు తెలిపారు. -
డేటింగ్‌కు వెళ్లి.. 14 అంతస్తులపై నుంచి పడి..
న్యూజిలాండ్: ఎప్పుడూ మనచుట్టూ ఉండేవాళ్లనే పూర్తిగా నమ్మలేకుండా ఉన్న నేటి పరిస్థితిలో కొంతమంది కొత్త సంబంధాలను చీకట్లో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో దెబ్బతిని అర్ధాంతరంగా ప్రాణాలుకోల్పోతున్నారు. అందుకు ఉదాహరణగా నిలిచింది ఈ న్యూజిలాండ్‌కు చెందిన అమ్మాయి కథనం. ఆమె పేరు వారియెనా రైట్. వయసు 26 ఏళ్లు. అతడేమో ఆస్ట్రేలియాకు చెందినవాడు. పేరు గాబెల్ టోస్టీ(30). ఇద్దరు టిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. వారి మధ్య గంటలకొద్ది గడిచిన చాటింగ్ కాస్త.. డేటింగ్ వరకు దారి తీసింది. అయితే, అతడిని నమ్మి టూర్ పేరుతో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ సిటీకి వచ్చిన రైట్ అక్కడ ఉన్న గాబెల్ ప్లాట్‌కు వెళ్లింది. ఈ సంఘటన 2014 ఆగస్టు 8న జరిగింది. అయితే, ఆరోజు తొలుత బాగానే ఉన్న అతడు ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది కాస్త వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. అతడిని తప్పించుకునేందుకు ఇంట్లో వస్తువులు గాబెల్ పై విసిరింది. ఆమెపై చేయి చేసుకొని తన ఇంటి బాల్కనీలో పెట్టి తాళం వేస్తానని బెదిరించాడు. దీంతో మరింత బయపడిని రైట్ తనను ఇంటికి వెళ్లనివ్వాలని ఎంతో ప్రాధేయపడింది. అనంతరం అతడి నుంచి తప్పించుకునే దారిలేక కిటికీలో నుంచి కిందికి దిగే ప్రయత్నం చేస్తూ ఏకంగా పద్నాలుగు అంతస్తుల మీద నుంచి జారికిందపడి ప్రాణాలుకోల్పోయింది. అప్పుడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజాగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. గాబెల్ ను కోర్టు దోషిగా ప్రకటించే అవకాశం ఉంది. తానేం ఆమెను కిందికి తోసివేయలేదని గాబెల్ న్యాయమూర్తితో చెబుతున్నాడు. సోమవారం తర్వాత జడ్జి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.