సోషల్ మీడియా వచ్చేశాక ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఇబ్బడి ముబ్బడిగా కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు యాప్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల జీవితాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలామంది వాటిని వినియోగించుకోవడంతో పాటు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ‘సెన్సార్ టవర్’ నివేదిక ప్రకారం.. డబ్బులు చెల్లించి మరి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న ప్రపంచంలోనే పాపులర్ యాప్‌ల గురించి ఒక నివేదిక విడుదల చేసింది.
”ఆపిల్ యాప్ స్టోర్‌లోని టాప్ 100 నాన్-గేమ్ సబ్‌స్క్రిప్షన్ యాప్‌లు.. 2021లో 13.5 బిలియన్(లక్ష కోట్లకు పైగా) డాలర్లు ఆర్జించాయి” అని ఈ నివేదిక పేర్కొంది. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ 100 సబ్‌స్క్రిప్షన్ యాప్‌ల కోసం $4.8 బిలియన్లు ఖర్చు చేశారు. ఈ టాప్ 10 యాప్‌ల జాబితాలో డేటింగ్ యాప్‌లు, ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ యాప్‌లు.. కొన్ని గూగుల్ యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా డబ్బు ఖర్చు చేసి వినియోగించే టాప్ 10 యాప్‌ల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ వన్
టెక్ దిగ్గజం గూగుల్ అపరిమిత క్లౌడ్ స్టోరేజ్ సేవలను అందించేందుకు గూగుల్ వన్(Google One) యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్లో 10 కోట్ల డౌన్లోడ్ ను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ సేవలను పొందాలంటే వినియోగదారుడు కొత్త మొత్తం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 15 జీబీ స్టోరేజ్ వరకు వినియోగదారుడు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 15జీబీ స్టోరేజి పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
డిస్నీ+
2021లో చాలా మంది వ్యక్తులు ఎక్కువగా డబ్బులు చెల్లించి వాడిన యాప్‌గా డిస్నీ+ నిలిచింది. వారి టీవి స్క్రీన్‌లపై వినోదం కోసం దీన్ని ఎక్కువగా చూశారు. డిస్నీ+ వంటి ఓటీటీ యాప్‌ల కోసం ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
యూట్యూబ్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో యూట్యూబ్ ఒకటిగా నిలిచింది. అయితే, ఇందులో వచ్చే ప్రకటనలు రాకుండా ఉండటానికి యూట్యూబ్ ప్రీమియం కోసం కొత్త మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
హెచ్‌బీఓ మాక్స్
హెచ్‌బీఓ.. ప్రీమియం ఓటీటీ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ యాప్‌ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో వచ్చే వీడియోల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
టిండర్
ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన టాప్ 10 యాప్‌ల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది.
పండోరా
పాడ్ కాస్ట్ లు, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి ఇతర ఆడియో కంటెంట్ కోసం ప్రజలు ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. యూరప్, అమెరికాలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే ఒక పాపులర్ యాప్.
ట్విచ్
గేమర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ట్విచ్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్ చాలా అభివృద్ధి చెందింది.
ఈఎస్‌పీఎన్
అమెరికాలో ఈఎస్‌పీఎన్ స్పోర్ట్స్ కంటెంట్‌కు ప్రధాన యాప్‌గా ఉంది. క్రీడల పరంగా ఈ యాప్ ఆధిపత్యం చెలాయిస్తోంది. చాలా మంది క్రీడల కోసం ఈ యాప్‌ను చూస్తున్నారు.
బంబుల్
టిండర్ తరువాత డేటింగ్ యాప్‌లలో బంబుల్ అత్యంత ప్రజాదరణ పొందింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన తొమ్మిదవ యాప్‌గా ఇది నిలిచింది.
హులు
ఈ ప్లాట్‌ఫారమ్‌లలో వినోదాన్ని కోరుకునే వినియోగదారులు బాగా ఇష్టపడే యాప్ హులు. ఓటీటీ జాబితాలో అందరికంటే ఎక్కువగా చూసే యాప్‌గా ఇది ఉంది.
(చదవండి: రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!)
Comments
Please login to add a commentAdd a comment