HBO
-
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యూజర్లకు షాక్: ఏప్రిల్ ఫూల్ కాదు నిజం!
సాక్షి, ముంబై: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్. డిస్నీ+హాట్‌స్టార్ హెచ్బీవోతో డీల్‌ను ముగించుకుంది. ఫలితంగా హెచ్‌బీవో కంటెంట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఇకపై అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ కంపెనీలో ఖర్చుల తగ్గింపు పునర్నిర్మాణాన్ని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజా నిర్ణయంతో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ,'ది సక్సెషన్' వంటి షోలను ఏప్రిల్ ఒకటి తరువాత అభిమానులు చూడలేరు. మార్చి 31 తరువాతనుంచి బడిస్నీ+ హాట్‌స్టార్‌లో హెచ్‌బీవో కంటెంట్ అందుబాటులో ఉండదు. కానీ ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలతోపాటు కంటెంట్ లైబ్రరీలో 100,000 గంటల టీవీ షోలు, సినిమాలను 10 భాషల్లో ఆస్వాదించవచ్చు అని ప్రకటించింది. మరోవైపు ఈ ప్రకటన తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ చందాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సబ్స్క్రిప్షన్ డబ్బును రీఫండ్ చేయమని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ లేదు, ఎఫ్1 లేదు. ఇపుడు హెచ్‌బీవో లేదు. ఇక వార్షిక చందా కోసం ఎందుకు చెల్లించినట్టు అంటూ ఒక యూజర్ మండిపడ్డారు. Hi! Starting 31st March, HBO content will be unavailable on Disney+ Hotstar. You can continue enjoying Disney+ Hotstar’s vast library of content spanning over 100,000 hours of TV Shows and Movies in 10 languages and coverage of major global sporting events. — Disney+HS_helps (@hotstar_helps) March 7, 2023 ఏప్రిల్ 1 నుండి కనిపించని షోల జాబితా బాలర్స్ బ్రదర్స్ బ్యాండ్ క్యాచ్ అండ్ కిల్ కర్బ్ యువర్ ఎంత్ ఆంట్రేజ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మార్ ఆఫ్ ఈస్ట్‌టౌన్ మైండ్ ఓవర్ మర్డర్ ఒబామా సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ షాక్ సక్సెషన్ ద బేబీ ది నెవర్స్ ది సోప్రానోస్ ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ అండర్ కరెంట్ వాచ్ మెన్ వీ వోన్ దిస్ సిటీ కాగాహెచ్బీవో పలు బ్లాక్‌బస్టర్ షోలను నిర్మించింది. దశాబ్దాల తర్వాత కూడా వాటికి ఆదరణ తగ్గలేదు. 'ది ఫ్లైట్ అటెండెంట్', 'ప్రెట్టీ లిటిల్ లియర్స్: ఒరిజినల్ సిన్'తో సహా అనేక హెచ్‌బీవో మాక్స్ ఒరిజినల్లు ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో హెచ్‌బీవో కంటెంట్‌ను ప్రసారం చేసే అవకాశం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు. 2015లోహెచ్బీవ కంటెంట్ కోసం స్టార్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏప్రిల్, 2020లో, వాల్ట్ డిస్నీ కంపెనీ 20 సెంచరీ స్టూడియోస్‌ను కొనుగోలు అనంతరం దానిపేరును డిస్నీ+ హాట్‌స్టార్‌గా మార్చిన సంగతి తెలిసిందే. -
గుడ్ న్యూస్.. త్వరలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' 9వ సీజన్ !
గేమ్ ఆఫ్ థ్రోన్స్.. వరల్డ్‌వైడ్‌గా అత్యధిక పాపులారిటీ పొందిన టీవీ షో. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ షోకు అభిమానులు అనేకం. ఇందులోని నటినటుల యాక్టింగ్, పోరాట ఘట్టాలు, ఎమోషన్స్, రిలేషన్స్, విజువల్స్, డ్రాగెన్స్, వైట్ వాకర్స్ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అద్భుతమే. హెచ్‌బీవో నిర్మించిన ఈ టీవీ షో 8 సీజన్లతో ముగించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అందులోను సూపర్బ్‌గా అలరించిన 7 సీజన్లతో పోల్చుకుంటే 8వ సీజన్ ఫ్యాన్స్‌ను అసంతృప్తికి గురిచేసింది. దీంతో చాలా మంది హర్ట్ అయి.. తమకు సీక్వెల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్‌కు హెచ్‌బీవో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. డేనెరియస్ టార్గారియస్ (ఎమిలీ క్లార్క్)ను హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్) హత్య చేసిన తర్వాత వెస్టెరోస్ను వదిలి నార్త్ ఆఫ్ ది వాల్‌కు ప్రయాణంచడంతో 8వ సీజన్ ముగుస్తుంది. ఈ ముగింపు ప్రేక్షకులకు ఎవరికీ అంతగా రుచించలేదు. దీంతో తన అసలు పేరు ఏగాన్ చటార్గారియస్ అని తెలుసుకున్న జాన్ స్నో పాత్రతో సీక్వెల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా కిట్ హరింగ్టన్ను హెచ్‌బీవో సంస్థ సంపద్రించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై హెచ్‌బీవో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు ఇదంతా నిజమై వచ్చే 9వ సీజన్లో డేనెరియస్ టార్గారియస్/మదర్ ఆఫ్ డ్రాగెన్ ప్రాణాలతో తిరిగి వస్తుందా? లేదా చూడాలి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌కు ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ డ్రాగెన్ తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో టార్గారియన్లోని అంతర్యుద్ధం చుట్టూ కథ ఉంటుందట. సుమారు 200 ఏళ్ల కిందట సింహాసనం కోసం జరిగిన యుద్ధాలను, వైట్ వాకర్స్ ఆవిర్భావం తదితర అంశాలకను చూపించే అవకాశం ఉందని సమాచారం. -
డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలు తెగ వాడేస్తున్న పాపులర్ 10 యాప్స్ ఇవే..!
సోషల్ మీడియా వచ్చేశాక ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఇబ్బడి ముబ్బడిగా కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు యాప్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల జీవితాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలామంది వాటిని వినియోగించుకోవడంతో పాటు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ‘సెన్సార్ టవర్’ నివేదిక ప్రకారం.. డబ్బులు చెల్లించి మరి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న ప్రపంచంలోనే పాపులర్ యాప్‌ల గురించి ఒక నివేదిక విడుదల చేసింది. ”ఆపిల్ యాప్ స్టోర్‌లోని టాప్ 100 నాన్-గేమ్ సబ్స్క్రిప్షన్ యాప్‌లు.. 2021లో 13.5 బిలియన్(లక్ష కోట్లకు పైగా) డాలర్లు ఆర్జించాయి” అని ఈ నివేదిక పేర్కొంది. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ 100 సబ్స్క్రిప్షన్ యాప్‌ల కోసం $4.8 బిలియన్లు ఖర్చు చేశారు. ఈ టాప్ 10 యాప్‌ల జాబితాలో డేటింగ్ యాప్‌లు, ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ యాప్‌లు.. కొన్ని గూగుల్ యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా డబ్బు ఖర్చు చేసి వినియోగించే టాప్ 10 యాప్‌ల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ వన్ టెక్ దిగ్గజం గూగుల్ అపరిమిత క్లౌడ్ స్టోరేజ్ సేవలను అందించేందుకు గూగుల్ వన్(Google One) యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో 10 కోట్ల డౌన్లోడ్ ను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ సేవలను పొందాలంటే వినియోగదారుడు కొత్త మొత్తం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 15 జీబీ స్టోరేజ్ వరకు వినియోగదారుడు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 15జీబీ స్టోరేజి పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిస్నీ+ 2021లో చాలా మంది వ్యక్తులు ఎక్కువగా డబ్బులు చెల్లించి వాడిన యాప్‌గా డిస్నీ+ నిలిచింది. వారి టీవి స్క్రీన్లపై వినోదం కోసం దీన్ని ఎక్కువగా చూశారు. డిస్నీ+ వంటి ఓటీటీ యాప్‌ల కోసం ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. యూట్యూబ్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో యూట్యూబ్ ఒకటిగా నిలిచింది. అయితే, ఇందులో వచ్చే ప్రకటనలు రాకుండా ఉండటానికి యూట్యూబ్ ప్రీమియం కోసం కొత్త మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌బీఓ మాక్స్ హెచ్‌బీఓ.. ప్రీమియం ఓటీటీ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ యాప్‌ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో వచ్చే వీడియోల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. టిండర్ ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన టాప్ 10 యాప్‌ల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. పండోరా పాడ్ కాస్ట్ లు, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి ఇతర ఆడియో కంటెంట్ కోసం ప్రజలు ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. యూరప్, అమెరికాలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే ఒక పాపులర్ యాప్. ట్విచ్ గేమర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ట్విచ్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్ చాలా అభివృద్ధి చెందింది. ఈఎస్పీఎన్ అమెరికాలో ఈఎస్పీఎన్ స్పోర్ట్స్ కంటెంట్‌కు ప్రధాన యాప్‌గా ఉంది. క్రీడల పరంగా ఈ యాప్ ఆధిపత్యం చెలాయిస్తోంది. చాలా మంది క్రీడల కోసం ఈ యాప్‌ను చూస్తున్నారు. బంబుల్ టిండర్ తరువాత డేటింగ్ యాప్‌లలో బంబుల్ అత్యంత ప్రజాదరణ పొందింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన తొమ్మిదవ యాప్‌గా ఇది నిలిచింది. హులు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో వినోదాన్ని కోరుకునే వినియోగదారులు బాగా ఇష్టపడే యాప్ హులు. ఓటీటీ జాబితాలో అందరికంటే ఎక్కువగా చూసే యాప్‌గా ఇది ఉంది. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!) -
నిర్వాహకుల పొరపాటుపై హీరోయిన్ స్పందన.. అది నేను కాదు కానీ
Emma Watson Reacts To Mistake Of Harry Potter Hogwarts Reunion: అప్పుడప్పుడూ సినీ సెలబ్రిటీలు, చిత్ర యూనిట్ సభ్యులు తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి గమనించిన నెటిజన్లు మాత్రం కావాలనే ట్రోల్ చేస్తుంటారు. సెటైర్లు వేస్తుంటారు. నెటిజన్ల క్రియేటివిటీని చూసి తారలు, చిత్ర బృంద తమదైన శైలీలో స్పందిస్తారు. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి కామెంట్ చేసిన ఒక యూజర్‌కు 'నువ్ యాక్ట్ చేస్తావా' అని ఆ ఆర్ఆర్ఆర్ ట్విటర్ గ్రూప్ అడ్మిన్ స్పందించిన తీరు ఎంతోమందికి నవ్వు తెప్పిచ్చింది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) హెచ్‌బీవో మ్యాక్స్ నిర్వహించింది. ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' (Hogwarts Reunion) పేరుతో టెలీకాస్ట్ చేసిన స్పెషల్ ఎపిసోడ్లో ఎమ్మా వాట్సన్‌కు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి ఫొటో పెట్టి పొరపాటు చేశారు నిర్వాహకులు. దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పొరపాటుపై స్పందించింది ఎమ్మా వాట్సన్. మీక్కీ మౌస్ చెవులను ధరించిన ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి పిక్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'ఈ క్యూట్‌గా ఉన్నది నేను కాదు' అని క్యాప్షన్ ఇచ్చింది. అలాగే #వాట్సన్సిస్టర్స్ఫరెవర్ అని హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేసింది. View this post on Instagram A post shared by Emma Watson (@emmawatson) ఇదీ చదవండి: స్పానిష్ నటి ఇంట్లో వినాయకుడి చిత్రపటం.. వైరల్ -
FriendsReunion: ఆర్టిస్టులతో పాటు ఫ్యాన్స్ కంటతడి
ఆరు మెయిన్ క్యారెక్టర్లు, పది సీజన్లు, 236 ఎపిసోడ్లు.. పదేళ్లపాటు స్నేహంలోని రకరకాల భావోద్వేగాలను అందించి నవ్వించింది ఫ్రెండ్స్ టీవీ సిరీస్. ఇప్పుడు మళ్లీ రీయూనియన్ ఎపిసోడ్‌తో సంచలనాలకు తెరతీసింది. ఫ్రెండ్స్ : ది రీయూనియన్ పేరుతో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌కి గ్లోబల్ వైడ్‌గా భారీ స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్ పాత అల్లర్లను గుర్తు చేసుకుంటూ చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు. 1994 నుంచి 2014 దాకా అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుల్లితెర ప్రేక్షకులను అలరించింది ఫ్రెండ్స్ సిట్కామ్(సిచ్యుయేషనల్ కామెడీ). ఆరుగురు స్నేహితులు, వాళ్ల మధ్య లవ్ బ్రేకప్, అల్లరి, గొడవలు.. అంతిమంగా స్నేహాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలతో సరదాగా సాగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ టీం మళ్లీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జెన్నిఫర్ అనిస్టన్, కోర్టెనె కాక్స్, లీసా కుడ్రో, మాట్ లెబ్లాంక్, మాథ్యు పెర్రీ, డేవిడ్ ష్విమ్మర్.. అదే ఆర్టిస్టులు, అదే టెక్నికల్ టీం.. ఈ రీయూనియన్ కోసం పనిచేశారు కూడా. గెట్ టు గెదర్గా వచ్చిన ఈ ఎపిసోడ్‌ను బెన్ విన్స్టన్ డైరెక్ట్ చేశారు. మన దగ్గర జీ5 ఈ రీయూనియన్‌ను టెలికాస్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియా అకౌంట్లలో #FriendsReunion రికార్డు స్థాయి ట్వీట్లతో దూసుకుపోతోంది. ఆరుగురు లీడ్ క్యారెక్టర్లు ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. సెట్లో ఆనాటి జ్ఞాపకాలన్నింటిని ఉంచారు. బిహైండ్ సీన్స్‌తో నవ్వులు విరిశాయి. అభిమానుల ప్రశ్నలకు సరదా జవాబులు ఇచ్చింది ఫ్రెండ్స్ టీం. ఇక రీయూనియన్ పట్ల ఆ ఆర్టిస్టులు భావోద్వేగానికి లోనుగాక.. అది చూసి అభిమానులు ఫీలవుతున్నారు. VIDEO: Lady Gaga performs “Smelly Cat” with “Phoebe” #FriendsReunionpic.twitter.com/Rf3pQkfNPU — GAGAIMAGES (@gagaimages) May 27, 2021 కళ్లు చెదిరే డీల్ ఫ్రెండ్స్ రీయూనియన్ ఎపిసోడ్లో ఆరుగురు మెయిన్ క్యారెక్టర్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కనిపించారు. లేడీ గాగా, బీటీఎస్, జస్టిన్ బీబర్, డేవిడ్ బెక్‌హమ్, జేమ్స్ కార్డన్.. ఇలా కొందరు కనిపించారు. ఫ్రెండ్స్ టీంతో సరదాగా అల్లరి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం భారీగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 1996లో ఫ్రెండ్స్ ఆర్టిస్టుల ఒక్కొక్కరి రెమ్యునరేషన్ 22,500 డాలర్లు ఉండేది. ఇప్పుడు రీయూనియన్ కోసం ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు మిలియన్ల డాలర్లు తీసుకున్నట్లు హాలీవుడ్ వెబ్‌సైట్స్ కథనాలు ప్రచురించాయి. అలాగే మొన్నటిదాకా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఫ్రెండ్స్ ఎపిసోడ్స్‌ను 425 మిలియన్ డాలర్ల చెల్లించి హెచ్‌బీవో కొనుక్కుంది. ఈ రీయూనియన్ స్ట్రీమింగ్‌లో మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. -
రేపటి నుంచి ఆ ఛానళ్లు బంద్
తెలుగు సినిమాలు బోర్ కొడితే హిందీవి చూస్తాం. అవీ బోర్ కొడితే హాలీవుడ్ సినిమాలను ఆశ్రయిస్తాం. కొందరైతే సినిమాలు చూడటం తప్ప మరో పనే లేదన్నట్లుగా టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి సినీ ప్రియులకు ఓ విషాదకర వార్త. ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‌బీఓ, డబ్యూబీ.. ఇండియాలో కనిపించకుండా పోనున్నాయి. రేపటి (డిసెంబర్ 15) నుంచి భారత్‌తో సహా పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది. (చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం) అయితే దక్షిణాసియాలో పిల్లలు ఎక్కువగా ఆదరించే కార్టూన్ నెట్వర్క్, పోగో ఛానళ్లను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీఎన్ఎన్ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు డిస్నీ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఆన్లైన్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ కంపెనీ ఇతర ఓటీటీ యాప్‌లకు పోటీగా హెచ్‌బీఓ మాక్స్ అనే కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ విడుదల) -
థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ విడుదల
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదిలో తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడంతోపాటు అదే రోజు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ‘వండర్ ఉమెన్’ థియేటర్స్‌లోనూ, హెచ్‌బీఓ మ్యాక్స్‌లోనూ ఒకేరోజు విడుదల కానుంది. అదే పద్ధతిని వచ్చే ఏడాది సినిమాలకు కూడా పాటించనున్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సినిమాను థియేటర్స్‌లోనే ప్రదర్శించాలని అందరికీ ఉంటుంది. కానీ వచ్చే ఏడాది మొత్తం సగం సీటింగ్ కెపాసిటీతోనే థియేటర్స్ నడుస్తాయి. సో... ఏ విధంగా వీలుంటే ఆ విధంగా (ఇంట్లోనో, థియేటర్లోనో) సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది వార్నర్ బ్రదర్స్ విడుదల చేసే సినిమాల్లో ‘డ్యూన్, మ్యాట్రిక్స్ 4, టామ్ అండ్ జెర్రీ, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్, ది కంజ్యూరింగ్, ది సూసైడ్ స్క్వాడ్’ వంటి సినిమాలు ఉన్నాయి. -
భారత్‌లో ఇకపై ఆ రెండు ప్రముఖ ఛానెళ్లు బంద్!
వాషింగ్టన్: మీకు ఇంగ్లీష్ సినిమాలు చూడటమంటే పిచ్చా? ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‌బీఓ, డబ్యూబీ చూస్తూ ఉంటారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్ ఈ ఏడాది చివరి నుంచి భారత్, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది. చాలా ఏళ్లుగా వార్నర్ మీడియా సౌత్ ఆసియాలో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ సుస్థిరమైన మార్కెట్‌ను ఏర్పరుచుకోవడానికి కష్టపడుతూనే ఉంది. హెచ్‌బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్సిప్షన్ పొందటానికి నాలుగు నుంచి ఐదు డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే భారతదేశంలో దీని ధర కేవలం రెండు డాలర్లగా మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఈ ఛానళ్లను వీక్షించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, డిస్నీ హార్ట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఆన్లైన్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి మనుగడ ఇక్కడ కష్టంగా మారడంతో వార్నర్ మీడియా డిసెంబర్ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే భారతదేశంలో కార్టూన్ నెట్వర్క్, పోగో ఛానళ్లలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీఎన్ఎన్ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా యాజమాన్యం పేర్కొంది. చదవండి: ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్ చేసిన ట్విటర్ -
వరుణ్ తేజ్‌కు స్పెషల్ సర్ప్రైజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న్యూ లుక్‌తో అలరిస్తున్నాడు. తన తదుపరి చిత్రం కోసం పూర్తిగా మేకోవర్‌ను మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవలే వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేశ్’ బ్లాక్ బస్టర్‌ను అందుకొన్న ఉత్సాహంతో తన తదుపరి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్ నిర్మాతలుగా బాక్సింగ్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. వరుణ్ తేజ్ సరసన నిధి అగర్వాల్, నాభా నటేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. (బాక్సింగ్‌కి రెడీ) వరుణ్ తేజ్‌కు స్పెషల్ సర్ప్రైజ్ ఇక వరుణ్ తేజ్ కి సూపర్ మేన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూస్తారు. అది గుర్తించే హెచ్‌బీఓ ఇండియా వరుణ్ తేజ్‌కి ఇష్టమైన డీసీ కామిక్ ఆట బొమ్మలను బహుమతిగా ఇచ్చింది. బాట్ మ్యాన్ మాస్క్, వండర్ వుమెన్ మాస్క్‌ల్ని, ఓ కారు బొమ్మను ఈ సంస్థ పంపించింది. ఈ విషయాన్ని వరుణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హెబీఓ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపాడు. (బాక్సర్‌కు జోడీ) -
హెచ్బీఓలో బన్నీ నా పేరు సూర్య
-
అమెరికన్ ఛానల్లో బన్నీ ప్రమోషన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తం నిర్మిస్తున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అమెరికన్ టీవీ ఛానల్ హెచ్బీఓలో ప్రారంభించారు చిత్రయూనిట్. హాలీవుడ్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో కనిపించిన బన్నీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో పాటు మే 4న రిలీజ్ అవుతున్న నా పేరు సూర్య చూడాలంటూ కోరారు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా అర్జున్, శరత్ కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
స్క్రిప్ట్‌లను హ్యాక్ చేస్తే.. భారీ రివార్డు
వాషింగ్టన్ : హ్యాకర్లకు హెచ్‌బీఓ భారీ రివార్డు ప్రకటించింది. తను నిర్మిస్తున్న టీవీ షో స్క్రిప్ట్‌లను దొంగలించిన వారికి భారీగా బౌంటీ పేమెంట్‌ను చెల్లించనున్నట్టు పేర్కొంది. కంపెనీలు తమ నెట్‌వర్క్స్‌లో హాని కలిగించే లోపాలను గుర్తించిన వారికి ఆఫర్ చేసే రివార్డు మాదిరి, హెచ్‌బీఓ కూడా తన టీవీ షో స్క్రిప్ట్‌లు దొంగతనం చేసే వారికి 2,50,000 డాలర్లు అంటే కోటిన్నరకు పైగా బౌంటీ పేమెంట్‌ను అందించనున్నట్టు తెలిపింది. గతవారమే హెచ్‌బీఓ తమ డేటాలో ఉల్లంఘన జరిగినట్టు గుర్తించింది. తన టీవీలో వస్తున్న ఫేమస్ షో గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ఆదివారం ఎపిసోడ్ షోకి ముందే ఆన్లైన్లో లీకైంది. దీనికి స్పందనగా తమ టీవీ స్ట్రిప్ట్లను దొంగతనం చేసే హ్యాకర్లకు భారీ బౌంటీ పేమెంట్‌ను హెచ్‌బీఓ ప్రకటించింది. ''మిస్టర్ స్మిత్'' అనే హ్యాకర్ లేదా హ్యాకింగ్ గ్రూప్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు వెల్లడైంది. ఈ స్క్రిప్ట్‌లు మాత్రమే కాక, హెచ్‌బీఓ నుంచి 1.5 టెర్రాబైట్స్ల డేటాను పొందినట్టు ఆ హ్యాకర్ గ్రూప్ తెలిపింది. డేటాను దొంగతనం చేసిన హ్యాకర్లు కంపెనీ నుంచి ఆరునెలల వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే 6 మిలియన్ డాలర్లకు పైగా వారు కోరుతున్నారు. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఎక్కువ మొత్తంలో ఫైల్స్‌ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. హెచ్బీఓలో జరిగిన ఈ భారీ డేటా దాడిపై ఫోరెన్సిక్ నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. -
పోర్న్ సైట్ నుంచి ఆ దృశ్యాలను తొలగించండి!
లాస్ఏంజిలెస్: తమ చానెల్లో ప్రసారమయ్యే పాపులర్ షో 'గేమ్ ఆఫ్ థోర్న్స్' దృశ్యాలను పోర్న్‌హబ్ వెబ్సైట్లో ప్రముఖ చానెల్ హెచ్‌బీవో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి ఈ షోలోని దృశ్యాలను పోర్న్‌హబ్‌లో పెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందని, వీటిని వెబ్సైట్ నుంచి తొలగించేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని హెచ్‌బీవో ఓ ప్రకటనలో తెలిపింది. శృంగారం, నగ్నత్వం, హింస ప్రధానాంశాలుగా ఫ్యాంటసీ డ్రామా సిరీస్‌గా తెరకెక్కిన 'గేమ్ ఆఫ్ థోర్న్స్' షోలోని అనేక దృశ్యాలు పోర్న్సైట్లో దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఈ షోలోని లార్డ్ వరిస్, సెర్సీ, డెనెరిస్ తార్గరిన్ పాత్రలను పేరడీగా పోర్న్ స్టార్స్ డూప్లికేట్ దృశ్యాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. తమ వెబ్సైట్లో 'గేమ్ ఆఫ్ థోర్న్స్'కు సంబంధించిన దృశ్యాలే అత్యధికంగా చూస్తున్నారని పోర్న్‌హబ్ ఇటీవల వెల్లడించడంతో ఆ దృశ్యాలను వెంటనే తొలగించాలంటూ హెచ్‌బీవో అల్టిమేటం జారీ చేసింది.