FriendsReunion: ఆర్టిస్టులతో పాటు ఫ్యాన్స్​ కంటతడి | Friends Reunion Episode Make Fans Emotional | Sakshi
Sakshi News home page

FriendsReunion: ఆర్టిస్టులతో పాటు ఫ్యాన్స్​ కంటతడి

Published Thu, May 27 2021 2:42 PM | Last Updated on Thu, May 27 2021 2:42 PM

Friends Reunion Episode Make Fans Emotional - Sakshi

ఆరు మెయిన్​ క్యారెక్టర్లు, పది సీజన్లు, 236 ఎపిసోడ్​లు​.. పదేళ్లపాటు స్నేహంలోని రకరకాల భావోద్వేగాలను అందించి నవ్వించింది ఫ్రెండ్స్ టీవీ సిరీస్​.  ఇప్పుడు మళ్లీ రీయూనియన్​ ఎపిసోడ్​తో సంచలనాలకు తెరతీసింది. ఫ్రెండ్స్​ : ది రీయూనియన్​ పేరుతో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్​కి గ్లోబల్ వైడ్​గా భారీ స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్​ పాత అల్లర్లను గుర్తు చేసుకుంటూ చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు.

1994 నుంచి 2014 దాకా అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుల్లితెర ప్రేక్షకులను అలరించింది ఫ్రెండ్స్​ సిట్​కామ్​(సిచ్యుయేషనల్​ కామెడీ). ఆరుగురు స్నేహితులు, వాళ్ల మధ్య లవ్‌‌ బ్రేకప్​, అల్లరి, గొడవలు.. అంతిమంగా స్నేహాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలతో సరదాగా సాగుతుంది ఫ్రెండ్స్​. ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్​ టీం మళ్లీ ఆడియెన్స్​ ముందుకు వచ్చింది. జెన్నిఫర్​ అనిస్టన్​, కోర్టెనె కాక్స్​, లీసా కుడ్రో, మాట్​ లెబ్లాంక్​, మాథ్యు పెర్రీ, డేవిడ్​ ష్విమ్మర్.. అదే ఆర్టిస్టులు, అదే టెక్నికల్ టీం.. ఈ రీయూనియన్​ కోసం పనిచేశారు కూడా. గెట్​ టు గెదర్​గా వచ్చిన ఈ ఎపిసోడ్​ను ​బెన్​ విన్​స్టన్​ డైరెక్ట్​ చేశారు. మన దగ్గర జీ5 ఈ రీయూనియన్​ను టెలికాస్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియా అకౌంట్లలో #FriendsReunion రికార్డు స్థాయి ట్వీట్లతో దూసుకుపోతోంది. ఆరుగురు లీడ్ క్యారెక్టర్లు ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. సెట్​లో ఆనాటి జ్ఞాపకాలన్నింటిని ఉంచారు. బిహైండ్ సీన్స్​తో నవ్వులు విరిశాయి. అభిమానుల ప్రశ్నలకు సరదా జవాబులు ఇచ్చింది ఫ్రెండ్స్ టీం. ఇక  రీయూనియన్​ పట్ల ఆ ఆర్టిస్టులు భావోద్వేగానికి లోనుగాక.. అది చూసి అభిమానులు ఫీలవుతున్నారు.

కళ్లు చెదిరే డీల్​
ఫ్రెండ్స్​ రీయూనియన్ ఎపిసోడ్​లో ఆరుగురు మెయిన్​ క్యారెక్టర్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కనిపించారు. లేడీ గాగా, బీటీఎస్​, జస్టిన్ బీబర్​, డేవిడ్ బెక్​హమ్​, జేమ్స్​ కార్డన్​.. ఇలా కొందరు కనిపించారు. ఫ్రెండ్స్ టీంతో సరదాగా అల్లరి చేశారు. ఇక ఈ ఎపిసోడ్​ కోసం భారీగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 1996లో ఫ్రెండ్స్​ ఆర్టిస్టుల ఒక్కొక్కరి రెమ్యునరేషన్​ 22,500 డాలర్లు ఉండేది. ఇప్పుడు రీయూనియన్ కోసం ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు మిలియన్ల డాలర్లు తీసుకున్నట్లు హాలీవుడ్​ వెబ్​సైట్స్​ కథనాలు ప్రచురించాయి. అలాగే మొన్నటిదాకా నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్​ అయిన ఫ్రెండ్స్​ ఎపిసోడ్స్​ను 425 మిలియన్​ డాలర్ల చెల్లించి హెచ్​బీవో కొనుక్కుంది. ఈ రీయూనియన్ స్ట్రీమింగ్​లో మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement