బ్లాక్‌ అండ్‌ వైట్‌ డేస్‌... ఎంత బంగారమో! | Hema Malini played the role of a goddess in a popular TV show | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ అండ్‌ వైట్‌ డేస్‌... ఎంత బంగారమో!

Published Sun, Apr 30 2023 12:20 AM | Last Updated on Sun, Apr 30 2023 12:20 AM

Hema Malini played the role of a goddess in a popular TV show - Sakshi

కేబుల్‌ ఛానల్స్, ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సర్వీసులకు ముందు వినోదానికి దూరదర్శన్‌ పెద్ద దిక్కు. దూరదర్శన్‌కు, ప్రేక్షకులకు మధ్య  దూరం పెరిగినా ఆ నాస్టాల్జియాకు మాత్రం దూరం కాలేదు. దీనికి ఉదాహరణ వైరల్‌ అయిన ఈ వీడియో. ‘అల్బెల’ సినిమాలోని ‘షోల జో బడ్కే’ పాటను హార్మోనియం వాయిస్తూ సి.రామచంద్ర, కవితా కృష్ణమూర్తితో కలిసి పాడుతున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌కు సంబంధించిన వీడియోను నటి హేమమాలిని పరిచయం చేస్తున్న దూరదర్శన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఒకరకంగా చెప్పాలంటే ఈ వీడియో నెటిజనులను టైమ్‌మిషన్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ జమానాలోకి తీసుకువెళ్లింది. ఆరోజుల్లో దూరదర్శన్‌లో తమకు నచ్చిన కార్యక్రమాలతోపాటు ‘మహా... భారత్‌’ అనే టైటిల్‌ సాంగ్‌ వినిపించగానే తాము రెక్కలు కట్టుకొని టీవీల ముందు వాలిన దృశ్యాలను కూడా నెటిజనులు గుర్తుతెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘గోల్డ్‌’ అండ్‌ ‘ప్యూర్‌’ అని ఆకాశానికెత్తారు నెటిజనులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement