పోర్న్ సైట్ నుంచి ఆ దృశ్యాలను తొలగించండి!
లాస్ఏంజిలెస్: తమ చానెల్లో ప్రసారమయ్యే పాపులర్ షో 'గేమ్ ఆఫ్ థోర్న్స్' దృశ్యాలను పోర్న్‌హబ్ వెబ్సైట్లో ప్రముఖ చానెల్ హెచ్‌బీవో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి ఈ షోలోని దృశ్యాలను పోర్న్‌హబ్‌లో పెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందని, వీటిని వెబ్సైట్ నుంచి తొలగించేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని హెచ్‌బీవో ఓ ప్రకటనలో తెలిపింది.
శృంగారం, నగ్నత్వం, హింస ప్రధానాంశాలుగా ఫ్యాంటసీ డ్రామా సిరీస్‌గా తెరకెక్కిన 'గేమ్ ఆఫ్ థోర్న్స్' షోలోని అనేక దృశ్యాలు పోర్న్సైట్లో దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఈ షోలోని లార్డ్ వరిస్, సెర్సీ, డెనెరిస్ తార్గరిన్ పాత్రలను పేరడీగా పోర్న్ స్టార్స్ డూప్లికేట్ దృశ్యాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. తమ వెబ్సైట్లో 'గేమ్ ఆఫ్ థోర్న్స్'కు సంబంధించిన దృశ్యాలే అత్యధికంగా చూస్తున్నారని పోర్న్‌హబ్ ఇటీవల వెల్లడించడంతో ఆ దృశ్యాలను వెంటనే తొలగించాలంటూ హెచ్‌బీవో అల్టిమేటం జారీ చేసింది.