స్క్రిప్ట్‌లను హ్యాక్ చేస్తే.. భారీ రివార్డు
స్క్రిప్ట్‌లను హ్యాక్ చేస్తే.. భారీ రివార్డు
Published Sat, Aug 12 2017 11:40 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM
వాషింగ్టన్ : హ్యాకర్లకు హెచ్‌బీఓ భారీ రివార్డు ప్రకటించింది. తను నిర్మిస్తున్న టీవీ షో స్క్రిప్ట్‌లను దొంగలించిన వారికి భారీగా బౌంటీ పేమెంట్‌ను చెల్లించనున్నట్టు పేర్కొంది. కంపెనీలు తమ నెట్‌వర్క్స్‌లో హాని కలిగించే లోపాలను గుర్తించిన వారికి ఆఫర్ చేసే రివార్డు మాదిరి, హెచ్‌బీఓ కూడా తన టీవీ షో స్క్రిప్ట్‌లు దొంగతనం చేసే వారికి 2,50,000 డాలర్లు అంటే కోటిన్నరకు పైగా బౌంటీ పేమెంట్‌ను అందించనున్నట్టు తెలిపింది. గతవారమే హెచ్‌బీఓ తమ డేటాలో ఉల్లంఘన జరిగినట్టు గుర్తించింది. తన టీవీలో వస్తున్న ఫేమస్ షో గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ఆదివారం ఎపిసోడ్ షోకి ముందే ఆన్‌లైన్‌లో లీకైంది. దీనికి స్పందనగా తమ టీవీ స్ట్రిప్ట్‌లను దొంగతనం చేసే హ్యాకర్లకు భారీ బౌంటీ పేమెంట్‌ను హెచ్‌బీఓ ప్రకటించింది.
''మిస్టర్ స్మిత్'' అనే హ్యాకర్ లేదా హ్యాకింగ్ గ్రూప్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు వెల్లడైంది. ఈ స్క్రిప్ట్‌లు మాత్రమే కాక, హెచ్‌బీఓ నుంచి 1.5 టెర్రాబైట్స్‌ల డేటాను పొందినట్టు ఆ హ్యాకర్ గ్రూప్ తెలిపింది. డేటాను దొంగతనం చేసిన హ్యాకర్లు కంపెనీ నుంచి ఆరునెలల వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే 6 మిలియన్ డాలర్లకు పైగా వారు కోరుతున్నారు. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఎక్కువ మొత్తంలో ఫైల్స్‌ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. హెచ్‌బీఓలో జరిగిన ఈ భారీ డేటా దాడిపై ఫోరెన్సిక్ నిపుణులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement