వరుణ్‌ తేజ్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ | Varun Tej Stunning Makeover For his Next Movie | Sakshi
Sakshi News home page

న్యూ లుక్‌లో వరుణ్‌ తేజ్‌ అదుర్స్‌

Published Sat, Feb 8 2020 5:22 PM | Last Updated on Sat, Feb 8 2020 5:33 PM

Varun Tej Stunning Makeover For his Next Movie - Sakshi

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ న్యూ లుక్‌తో అలరిస్తున్నాడు. తన తదుపరి చిత్రం కోసం పూర్తిగా మేకోవర్‌ను మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ ‘గ‌ద్దల‌కొండ గ‌ణేశ్’ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను అందుకొన‍్న ఉత్సాహంతో త‌న త‌దుప‌రి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్దా, అల్లు వెంక‌టేశ్ నిర్మాత‌లుగా బాక్సింగ్‌ ప్రధానాంశంగా ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు.  వరుణ్ తేజ్ సరసన నిధి అగర్వాల్, నాభా నటేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. (బాక్సింగ్కి రెడీ)


వరుణ్‌ తేజ్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌
ఇక వరుణ్ తేజ్ కి సూపర్ మేన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూస్తారు. అది గుర్తించే హెచ్‌బీఓ ఇండియా వ‌రుణ్ తేజ్‌కి ఇష్టమైన డీసీ కామిక్  ఆట బొమ్మలను బహుమతిగా ఇచ్చింది. బాట్ మ్యాన్ మాస్క్, వండర్  వుమెన్ మాస్క్‌ల్ని, ఓ కారు బొమ్మను ఈ సంస్థ  పంపించింది. ఈ విషయాన్ని వరుణ్ త‌న సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హెబీఓ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపాడు. (బాక్సర్కు జోడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement