వాషింగ్టన్: మీకు ఇంగ్లీష్ సినిమాలు చూడటమంటే పిచ్చా? ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‌బీఓ, డబ్యూబీ చూస్తూ ఉంటారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్ ఈ ఏడాది చివరి నుంచి భారత్, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో ఈ రెండు ఛానళ్లను వార్నర్‌మీడియా నిలిపివేయనుంది. చాలా ఏళ్లుగా వార్నర్ మీడియా సౌత్ ఆసియాలో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ సుస్థిరమైన మార్కెట్‌ను ఏర్పరుచుకోవడానికి కష్టపడుతూనే ఉంది.
హెచ్‌బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్‌సిప్షన్ పొందటానికి నాలుగు నుంచి ఐదు డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే భారతదేశంలో దీని ధర కేవలం రెండు డాలర్లగా మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఈ ఛానళ్లను వీక్షించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, డిస్నీ హార్ట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఆన్‌లైన్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి మనుగడ ఇక్కడ కష్టంగా మారడంతో వార్నర్ మీడియా డిసెంబర్ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే భారతదేశంలో కార్టూన్ నెట్‌వర్క్, పోగో ఛానళ్లలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీఎన్‌ఎన్‌ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా యాజమాన్యం పేర్కొంది.
భారత్‌లో ఇకపై ఆ రెండు ప్రముఖ ఛానెళ్లు బంద్!
Published Fri, Oct 16 2020 11:33 AM | Last Updated on Fri, Oct 16 2020 12:53 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment