WB
-
రేపటి నుంచి ఆ ఛానళ్లు బంద్
తెలుగు సినిమాలు బోర్ కొడితే హిందీవి చూస్తాం. అవీ బోర్ కొడితే హాలీవుడ్ సినిమాలను ఆశ్రయిస్తాం. కొందరైతే సినిమాలు చూడటం తప్ప మరో పనే లేదన్నట్లుగా టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి సినీ ప్రియులకు ఓ విషాదకర వార్త. ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‌బీఓ, డబ్యూబీ.. ఇండియాలో కనిపించకుండా పోనున్నాయి. రేపటి (డిసెంబర్ 15) నుంచి భారత్‌తో సహా పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది. (చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం) అయితే దక్షిణాసియాలో పిల్లలు ఎక్కువగా ఆదరించే కార్టూన్ నెట్వర్క్, పోగో ఛానళ్లను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీఎన్ఎన్ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు డిస్నీ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఆన్లైన్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ కంపెనీ ఇతర ఓటీటీ యాప్‌లకు పోటీగా హెచ్‌బీఓ మాక్స్ అనే కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ విడుదల) -
భారత్‌లో ఇకపై ఆ రెండు ప్రముఖ ఛానెళ్లు బంద్!
వాషింగ్టన్: మీకు ఇంగ్లీష్ సినిమాలు చూడటమంటే పిచ్చా? ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‌బీఓ, డబ్యూబీ చూస్తూ ఉంటారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్ ఈ ఏడాది చివరి నుంచి భారత్, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది. చాలా ఏళ్లుగా వార్నర్ మీడియా సౌత్ ఆసియాలో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ సుస్థిరమైన మార్కెట్‌ను ఏర్పరుచుకోవడానికి కష్టపడుతూనే ఉంది. హెచ్‌బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్సిప్షన్ పొందటానికి నాలుగు నుంచి ఐదు డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే భారతదేశంలో దీని ధర కేవలం రెండు డాలర్లగా మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఈ ఛానళ్లను వీక్షించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, డిస్నీ హార్ట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఆన్లైన్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి మనుగడ ఇక్కడ కష్టంగా మారడంతో వార్నర్ మీడియా డిసెంబర్ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే భారతదేశంలో కార్టూన్ నెట్వర్క్, పోగో ఛానళ్లలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీఎన్ఎన్ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా యాజమాన్యం పేర్కొంది. చదవండి: ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్ చేసిన ట్విటర్ -
ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు
కోలకత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టు పట్టి ఈడ్చి పారేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ దుమారం రాజేశారు. పశ్చిమ్ మెద్నిపూర్ జిల్లా జార్గ్రామ్ లో ఆదివారం జరిగిన పార్టీ యువజన విభాగం సమావేశంలో మాట్లాడుతూ ఘోష్ బెనర్జీ ఇలా నోరు పారేసుకున్నారు. పెద్దనోట్ల రద్దుతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేల కోట్ల రూపాయల నష్ట పోయారని, అందుకే ఆమెకు మతి భ్రమించిందని దిలీప్ వ్యాఖ్యానించారు. డిల్లీలో ఆమె ఆందోళన (డ్రామా) చేస్తున్నపుడు జుట్టు పట్టి లాగి విసిరి పారేసి ఉండవచ్చు.. అక్కుడన్న పోలీసులు తమ వాళ్లే...కానీ తాము అలా చేయలేదంటూ దిలీప్ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దుతో పిచ్చి పట్టిన మమత ఢిల్లీ, పట్నా చుట్టూ చక్కర్లు కొడుతోందన్నారు. ఢిల్లీ, రాష్ట్ర సెక్రటేరియట్ ఆందోళనలు ఇందులో భాగమే అన్నారు. ఆమె చివరకు గంగలో దూకుతుందని తాము భావించామన్నారు. తృణమూల్ తప్పులను పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారనీ, ఇకపై మమతా దశ్చర్యలను తాము క్షమించమని ఘోష్ హెచ్చరించారు. కాగా ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. బెనర్జీ వ్యతిరేక పోరాటంలో విఫలమైన బీజీపీ ఇలాంటి వ్యక్తిగత దూషణలకు, బెదింరింపులకు పాల్పడుతోందని విమర్శించింది. ప్రమాదకరమైన బెదిరింపులు, తప్పుడు వ్యక్తిగత ప్రకటనలతో విషం చిమ్ముతూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఎదురు దాడి చేసింది. లక్షలాది సామాన్య జనానికి అండగా నిలిచిన మమతకు ఎదురు నిలవలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని టీఎంసీ విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించింది.