Warner Bros
-
భారత్‌లో ఇకపై ఆ రెండు ప్రముఖ ఛానెళ్లు బంద్!
వాషింగ్టన్: మీకు ఇంగ్లీష్ సినిమాలు చూడటమంటే పిచ్చా? ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‌బీఓ, డబ్యూబీ చూస్తూ ఉంటారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్ ఈ ఏడాది చివరి నుంచి భారత్, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది. చాలా ఏళ్లుగా వార్నర్ మీడియా సౌత్ ఆసియాలో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ సుస్థిరమైన మార్కెట్‌ను ఏర్పరుచుకోవడానికి కష్టపడుతూనే ఉంది. హెచ్‌బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్సిప్షన్ పొందటానికి నాలుగు నుంచి ఐదు డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే భారతదేశంలో దీని ధర కేవలం రెండు డాలర్లగా మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఈ ఛానళ్లను వీక్షించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, డిస్నీ హార్ట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఆన్లైన్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి మనుగడ ఇక్కడ కష్టంగా మారడంతో వార్నర్ మీడియా డిసెంబర్ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే భారతదేశంలో కార్టూన్ నెట్వర్క్, పోగో ఛానళ్లలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీఎన్ఎన్ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా యాజమాన్యం పేర్కొంది. చదవండి: ట్రంప్ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్ చేసిన ట్విటర్ -
వండర్ ఉమెన్ మళ్లీ వాయిదా
హాలీవుడ్ సూపర్ హీరోయిన్ మూవీ ‘వండర్ ఉమెన్ 1984’ మళ్లీ వాయిదా పడింది. గాళ్ గడోట్ ముఖ్య పాత్రలో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘వండర్ ఉమెన్ 1984’. 2017లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘వండర్ ఉమెన్’ చిత్రానికి ఇది సీక్వెల్. పాటీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 14న విడుదల కావాల్సింది. కరోనా వల్ల వాయిదా వేశారు. థియేటర్స్ తెర్చుకుంటాయని అక్టోబర్ 2కు పోస్ట్‌పోన్ చేశారు. అయితే అప్పటికి థియేటర్ల తాళాలు తెరిచే పరిస్థితి కనిపించకపోవడంతో డిసెంబర్ 25కు విడుదలను వాయిదా చేశారు. మరి ‘వండర్ ఉమెన్’ డిసెంబర్లో అయినా థియేటర్స్‌లోకి వస్తుందా? రాదా? చూడాలి. -
‘జోకర్’కు చైనా ఫ్యాన్స్ ఫిదా.. సరికొత్త రికార్డులు
జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ 'జోకర్' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను స్థిరంగా కొనసాగిస్తుంది. అక్టోబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'జోకర్' సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉందని కొందరు విమర్శకులు పెదవి విరిచినా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు దాటిన తొలి ఆర్-రేటెడ్ సినిమా(హింసాత్మకంగా భావించినప్పటికీ)గా నిలిచింది. ఆర్- రేటడ్ జాబితాలో ఇంతకుముందు 2018లో వచ్చిన ర్యాన్ రేనాల్డ్స్ నటించిన కామెడి థ్రిల్లర్ 'డెడ్‌పూల్ 2' సినిమా (78.3), 'డెడ్‌పూల్'(75.4) మిలియన్ డాలర్లు వసూలు చేయగా, తాజాగా జోకర్ ఆ సినిమాల రికార్డును అధిగమించింది. అంతేగాక చైనాలో ఆర్-రేటడ్ సినిమాలను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ జోకర్ సినిమాను మాత్రం చైనా ప్రేక్షకులు హిట్ సినిమాగా నిలిపారు. జోకర్‌గా నటించిన జోక్విన్ ఫీనిక్స్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 62.3 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో వార్నర్ బ్రదర్స్, డీసీ ఫిలిమ్స్ సంస్థ జోకర్ సినిమాను తెరకెక్కించగా టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు. డీసీ ఫిలిమ్స్ సంస్థ రూపొందించిన ఆక్వామెన్, ది డార్క్ నైట్ రైజస్, ది డార్క్ నైట్ సినిమాలు 1బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా, తాజాగా ఆ జాబితాలో జోకర్ నాలుగో స్థానాన్ని సంపాందించింది. ది డార్క్ నైట్ సినిమాలో జోకర్ పాత్రలో హెత్ లెడ్జర్ బ్యాట్‌మెన్ సిరీస్ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ది డార్క్‌నైట్ సినిమాలో జోకర్ పాత్ర విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భయంకరమైన జోకర్‌గా నటించిన హెత్ లెడ్జర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ముఖ్యంగా ఇంటరాగేషన్ సీన్లో జోకర్ పాత్రలో హెత్ లెడ్జర్ వెకిలి నవ్వులు ఎవరు అంత తొందరగా మరిచిపోలేరు. దాని నుంచి ప్రేరణగా తీసుకొని ఒక సీరియల్ కిల్లర్ గా జోకర్ ఎందుకు మారాడనే బ్యాక్‌డ్రాఫ్‌లో జోకర్ చిత్రం తెరకెక్కింది. జోకర్ పాత్రకు ప్రాణం పోసిన హెత్ లెడ్జర్ 2008 లో డ్రగ్స్‌కు బానిసై చనిపోవడంతో ఈ సినిమాలో జోక్విన్ ఫీనిక్స్ జోకర్ పాత్రను ధరించారు. -
నెక్ట్స్ ఏంటి?
‘డంకర్క్’ తర్వాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఏ జానర్లో ఉంటుందో అనే ఆసక్తి హాలీవుడ్ ఇండస్ట్రీలో, ఆయన అభిమానుల్లో ఉంది. లేటెస్ట్గా వినిపిస్తున్న వార్తేంటంటే.. నోలన్ ఓ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్టు హాలీవుడ్ సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుందట. ‘బ్లాక్లాన్స్మేన్’ చిత్రంలో హీరోగా నటించిన జాన్ డేవిడ్ వాషింగ్టన్ ఇందులో హీరోగా నటించనున్నారట. ‘ట్విలైట్’ కథానాయిక రోబర్ట్ పాటిసన్ హీరోయిన్గా నటిస్తారట. నోలన్, అతని భార్య ఎమ్మా థామస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు కానీ ఈ చిత్రాన్ని జూలై 17, 2020లో విడుదల చేస్తామని ప్రకటించారు. -
జంగిల్ బుక్‌లో...
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంతో హాలీవుడ్లో పాగా వేసిన భారతీయ అందాల నటి ఫ్రీదా పింటో. ఇప్పటికే పలు క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించిన ఫ్రీదాను మరో అవకాశం వరించింది. వార్నర్ బ్రదర్స్ నిర్మించనున్న ‘జంగిల్ బుక్’ చిత్రం కోసం ఆమెను ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యానిమేటెడ్ రూపంలో చిన్నారులను అలరించిన ఈ చిత్రం వెండితెరపైకి రానుంది. హాలీవుడ్ నటుడు ఆండీ సెర్కిస్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా 2016 అక్టోబర్ 6న విడుదల కానుంది.