
హాలీవుడ్ సూపర్ హీరోయిన్ మూవీ ‘వండర్ ఉమెన్ 1984’ మళ్లీ వాయిదా పడింది. గాళ్ గడోట్ ముఖ్య పాత్రలో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘వండర్ ఉమెన్ 1984’. 2017లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘వండర్ ఉమెన్’ చిత్రానికి ఇది సీక్వెల్. పాటీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 14న విడుదల కావాల్సింది. కరోనా వల్ల వాయిదా వేశారు. థియేటర్స్ తెర్చుకుంటాయని అక్టోబర్ 2కు పోస్ట్‌పోన్ చేశారు. అయితే అప్పటికి థియేటర్ల తాళాలు తెరిచే పరిస్థితి కనిపించకపోవడంతో డిసెంబర్ 25కు విడుదలను వాయిదా చేశారు. మరి ‘వండర్ ఉమెన్’ డిసెంబర్‌లో అయినా థియేటర్స్‌లోకి వస్తుందా? రాదా? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment