Wonder Woman
-
Gal Gadot: నాలుగోసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన వండర్ ఉమెన్.. పేరేంటో తెలుసా? (ఫోటోలు)
-
ఆ డైరెక్టర్ నన్ను బెదిరించాడు: నటి
డీసీ సినిమాటిక్ యూనివర్స్ మూవీ ‘వండర్ వుమెన్’తో హాలీవుడ్ నటి గాల్ గాడెట్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆ సినిమా సమయంలో ఈ బ్యూటీకి ఎదురైన చేదు అనుభవాలన తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది. డీసీ సూపర్ హీరో మూవీ ‘జస్టిస్ లీగ్’కి మొదట హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ దర్శకత్వం వహించాడు. అనంతరం వివిధ కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన ప్లేస్‌లో ఫిల్మ్ మేకర్ జాస్ వెడాన్ దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన ఈ దర్శకుడు సినిమా షూటింగ్లో ఉండగా తన కెరీర్ గురించి బెదిరించాడని నటి గాల్ గాడెట్ తెలిపింది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదని, అయితే మూవీ ప్రొడ్యూసర్స్ అయితే వార్నర్ బ్రదర్స్ నాకు అభయం ఇచ్చారని చెప్పింది. గాల్ గాడెట్ డైరెక్టర్ వెడాన్పై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అతను ఎంతో మందితో డిఫరెంట్‌గా బిహేవ్ చేసేవాడని.. గతంలో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టులు పెట్టింది. కాగా ఈ బ్యూటీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్, జస్టిస్ లీగ్, క్రిమినల్, కీపింగ్ అప్ విత్ ది జోన్స్, బాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్ వంటి చిత్రాల్లో నటించింది. చదవండి: పిక్‌ని పోస్ట్ చేసిన ‘స్పైడర్ మ్యాన్’.. ఎమోషనల్ అయిన ప్రియురాలు Joss Wheadon’s on-set treatment of the cast and crew of Justice League was gross, abusive, unprofessional, and completely unacceptable. He was enabled, in many ways, by Geoff Johns and Jon Berg. Accountability>Entertainment — Ray Fisher (@ray8fisher) July 1, 2020 -
బిడ్డకు పాలిస్తే.. బిల్డప్ ఎలా అవుతుంది?: హీరోయిన్
బోల్డ్ స్టేట్మెంట్లు, యాక్షన్లు తరచూ సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అందుకే నొప్పింపక.. తానొవ్వక అనే రీతిలో వ్యవహరిస్తుంటారు కొందరు. ఆ కొందరిలో ఒకరు నటి గాల్ గాడోట్(36). వండర్ ఉమెన్‌గా క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ నటి గాడోట్.. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సున్నితంగా ఆడియెన్స్‌కు చేరవేస్తుంటుంది కూడా. అలాంటిది తాజాగా ఆమె చేసిన ఓ పని.. ఇంటర్నెట్లో విమర్శలకు దారితీసింది. షూటింగ్ కోసం రెడీ అవుతున్న తరుణంలో.. టచప్ సందర్భంగా చనుబాలను పంపింగ్ చేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో కొందరు పనిగట్టుకుని ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. అతి చేష్టల్లో భాగంగా ఆమె ఆ పని చేసిందంటూ మండిపడ్డారు. దీంతో గాడోట్ ఓ మీడియా హౌజ్ ద్వారా స్పందించింది. తల్లి పాల విలువేంటో చెప్పేందుకు తాను ఆ పని చేశానని క్లారిటీ ఇచ్చింది. తల్లయ్యాక తిరిగి పనుల్లోకి వెళ్లడం ఎంత కష్టమో ఆ విమర్శించే వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. అది తెలియాలనే నా ఈ ప్రయత్నం. పైకి నవ్వుతూ ఉన్నా.. ఎల్లప్పుడూ బిడ్డల ఆకలి గురించి ఆలోచించే తల్లుళ్లకు జోహార్లు అంటూ చెంపపెట్టు సమాధానమిచ్చింది గాల్ గాడోట్. కాగా, ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన గాడోట్.. రెండు నెలల క్రితమే మూడో బిడ్డకు జన్మనిచ్చింది. గాడోట్ మాత్రమే కాదు.. గతంలో క్రిస్సి టెయిగెన్, లోకి నటి సోఫియా డి మార్టినో కూడా ఇలా సెట్స్ నుంచే పంపింగ్ ఫొటోలతో వార్తల్లో చర్చకు దారితీశారు. చదవండి: పూజా హెగ్డే.. ఇది మంచి పద్ధతి కాదు! -
మూడోసారి తల్లైన 'వండర్ వుమెన్'
Gal Gadot: 'వండర్ వుమెన్' హీరోయిన్ గాల్ గాడోట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ఈ హాలీవుడ్ స్టార్ తన గారాలపట్టికి డానియెల్లా అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. ఇక మూడోసారి తల్లైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటో షేర్ చేసింది. ఇందులో భర్త జారన్ వర్సానో, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. "నా కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఇప్పుడు ఐదుకి చేరింది. ఆనందంతో పరవశించిపోతున్నా. డేనియల్లాను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది" అని సదరు పోస్ట్‌కు క్యాప్షన్ జత చేసింది గాల్. గాల్ గాడోట్ ఇటీవలే 'వండర్ వుమన్ 1984' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2017 వచ్చిన ‘వండర్ ఉమన్’కు ఇది పార్ట్-2గా వస్తోంది. ప్యాటీ జెన్కిన్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆమె కెన్నెత్ బ్రనగ్ దర్శకత్వం వహిస్తున్న బ్రిటీష్ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ 'డెత్ ఆన్ ద నైల్' సినిమా చేస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram A post shared by Gal Gadot (@gal_gadot) చదవండి: ప్లీజ్.. సంరక్షకుడిగా నా తండ్రిని తప్పించండి: బ్రిట్నీ స్పియర్స్ వేడుకోలు -
ఫుల్లుగా తాగి వేలు కత్తిరించుకున్న స్టార్ హీరోయిన్!
తాగిన మత్తులో కూరగాయలు కట్ చేయబోయి ఏకంగా చేతి వేలినే కత్తిరించేసుకుందో హాలీవుడ్ స్టార్. వండర్ వుమెన్‌లో ప్రధాన పాత్ర పోషించిన గాల్ గ్యాడట్ ఈ విషయాన్ని తనే స్వయంగా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో జరిగింది. అసలు ఎవరైనా ఉదయం 11 గంటలకు మిమోసా లేదా సంగ్రియా తాగుతారా? కానీ నేను మాత్రం తాగాను. సరిగ్గా అప్పుడే క్యాబేజీ సలాడ్ చేయమని నా భర్త చెప్పడంతోని వంటింట్లోకి వెళ్లాను" "పదునైన కత్తి తీసుకుని చకచకా కట్ చేయడం మొదలుపెట్టాను. ఇంతలో నా వేలు తెగింది. అదేదో చిన్న గాయం కూడా కాదు. వేలు పై భాగం తెగిపడింది. వెంటనే నా భర్త యారన్ వార్సనో పరుపరుగున వచ్చి ఆ తెగిపడిన వేలి పై భాగాన్ని తీసుకుని చూశాడు. దాన్ని తీసి చెత్తబుట్టలోకి విసిరేశాడు. దాన్ని ఎలాగో అతికించడానికి వీలుకాదు కాబట్టి ఆస్పత్రికి కూడా వెళ్లలేదు" అని చెప్పుకొచ్చింది. ఇదిలా వుంటే గాల్ గ్యాడ్ త్వరలో మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ మధ్యే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. చదవండి: ఓ ఇంటివాడైన క్రాక్ సినిమాటోగ్రాఫర్ -
మూడోసారి తల్లి కాబోతున్న హాలీవుడ్ నటి
వండర్ వుమన్ హీరోయిన్ గాల్ గాడోట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను మూడోసారి తల్లి కాబోతున్నానని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. భర్త యారన్ వర్సానో, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ శుభావార్తను పేర్కొంది. 50 మిలియన్లకు పైగానే ఫాలోవర్లు ఉన్న గాల్ షేర్ చేసిన పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా గాల్ దంపతులకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 35 ఏళ్ల ఈ నటి ఇటీవలె వండర్ వుమన్ 1984 అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2017 వచ్చిన ‘వండర్ ఉమన్’కు ఇది పార్ట్-2 వచ్చింది ఈ చిత్రం. ప్యాటీ జెన్కిన్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో క్రిస్టెన్ విగ్, క్రిస్ పైన్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బాట్మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమాలో నటించిన తర్వాత గాల్‌గడోత్ దేశ చిత్రపరిశ్రమలో బాగా ప్రాచూర్యం పొందారు. దీంతో డెత్ ఆన్ ది నైలు చిత్రంలో అలీ ఫజల్‌తో నటించే అవకాశం వచ్చింది. చదవండి : (ప్రియాంకకు చేదు అనుభవం: జమీలా, నిక్ విడాకులు?) (భజ్జీ సినిమా టీజర్ విడుదల, విషెస్ చెప్పిన రైనా) View this post on Instagram A post shared by Gal Gadot (@gal_gadot) -
ఈ సినిమా టిక్కెట్లు ఇవాళే కొనండి: హీరోయిన్
హాలీవుడ్ హీరోయిన్ గాల్ గడోట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వండర్ ఉమన్ 1984’. 2017 వచ్చిన ‘వండర్ ఉమన్’కు ఇది కొనసాగింపు. ప్యాటీ జెన్కిన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్ల తలుపు తట్టనుంది. సినిమా టిక్కెట్లు బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని గాల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. ( ‘టెనెట్’ చూసి ఆనందించండి: క్రిస్టోఫర్ నోలాన్) ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారామె. ‘‘ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవటం ఎంతో ఉత్సాహంగా ఉంది. ‘వండర్ ఉమెన్ 1984’ సినిమా అతి త్వరలో విడుదల కాబోతోంది. మీ దగ్గరలో థియేటర్ ఉంటే గనుక మీరు మీ టిక్కెట్లను ఈ రోజే కొనుగోలు చేయండి. ఈ స్పెషల్ సినిమాను ఆనందించండి’’ అని పేర్కొన్నారు. -
వండర్ ఉమెన్ 1984 వచ్చేస్తోంది..
ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా వండర్ వుమెన్ 1984 భారత్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. గాల్‌గడోత్ నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. డిసెంబర్16 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ సినిమా విడుదలయ్యే తేదీలను వార్నర్ బ్రోస్ ప్రకటించారు. క్రిస్టోపస్ నోలన్స్ దర్శకత్వం వహించిన టెనెట్ సినిమా డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉండటంతో వండర్ వుమెన్ సినిమాను భారత్‌లో కొంత ఆలస్యంగా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌లో విడుదల.. డిసెంబర్ 25 న, భారతదేశంలోని గాల్‌గడోత్ అభిమానులు వండర్ ఉమెన్ 1984ను థియేటర్లలో చూడగలరు. పాటీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రిస్టెన్ విగ్, క్రిస్ పైన్లు కీలక పాత్ర పోషించారు. బాట్మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమాలో నటించిన తర్వాత గాల్‌గడోత్ దేశ చిత్రపరిశ్రమలో బాగా ప్రాచూర్యం పొందారు. దీంతో డెత్ ఆన్ ది నైలు చిత్రంలో అలీ ఫజల్‌తో నటించే అవకాశం వచ్చింది. -
అద్భుత మహిళ రాబోతోంది
స్పైడర్ మేన్, సూపర్ మేన్, హీ మేన్, బ్యాట్ మేన్... ఏం మగవాళ్లకే అతీత శక్తులుంటాయా? ఆడవాళ్లకు ఉండవా అంటే.. ‘నేనున్నాను’ అంటూ ‘వండర్ ఉమన్’ తెరపైకి దూసుకొచ్చింది. ఈ అద్భుత మహిళ సృష్టికర్త ఎవరంటే దర్శకురాలు ప్యాటీ జెన్కిన్స్. స్పైడర్ మేన్, హీ మేన్.. ఇంకా వేరే పవర్ ఫుల్ మేన్లకు దీటుగా వసూళ్ల వర్షం కురిపించింది ‘వండర్ ఉమన్’. 2017లో వచ్చిన ఈ చిత్రంలో గాల్ గాడోట్ కథానాయికగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘వండర్ ఉమన్ 1984’లో గాల్ గాడోట్నే కథానాయికగా ఎంపిక చేసి, ప్యాటీ జెన్ కిన్స్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇంకా ఆగడం సరికాదని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ థియేటర్లు రీఓపెన్ అయ్యాయో అక్కడ వచ్చే నెల 16న, హెచ్ఓబీ మ్యాక్స్‌లో 25న విడుదల చేయాలని చిత్రనిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్ణయించుకుంది. -
వండర్ ఉమెన్ మళ్లీ వాయిదా
హాలీవుడ్ సూపర్ హీరోయిన్ మూవీ ‘వండర్ ఉమెన్ 1984’ మళ్లీ వాయిదా పడింది. గాళ్ గడోట్ ముఖ్య పాత్రలో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘వండర్ ఉమెన్ 1984’. 2017లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘వండర్ ఉమెన్’ చిత్రానికి ఇది సీక్వెల్. పాటీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 14న విడుదల కావాల్సింది. కరోనా వల్ల వాయిదా వేశారు. థియేటర్స్ తెర్చుకుంటాయని అక్టోబర్ 2కు పోస్ట్‌పోన్ చేశారు. అయితే అప్పటికి థియేటర్ల తాళాలు తెరిచే పరిస్థితి కనిపించకపోవడంతో డిసెంబర్ 25కు విడుదలను వాయిదా చేశారు. మరి ‘వండర్ ఉమెన్’ డిసెంబర్లో అయినా థియేటర్స్‌లోకి వస్తుందా? రాదా? చూడాలి. -
వండర్ ఉమెన్
దీపికా పదుకోన్ ‘పద్మావతి’గా థియేటర్స్‌లోకి వచ్చి దాదాపు ఐదు నెలలు కంప్లీట్ అయ్యాయి. నెక్ట్స్ ఆమె చేయబోయే సినిమా ఏంటి? అనుకుంటున్న టైమ్‌లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో నటించనున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇందులో హీరోగా నటించాల్సిన ఇర్ఫాన్‌ఖాన్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. దీంతో దీపికా నెక్ట్స్ సినిమాపై మళ్లీ డౌట్స్ మొదలయ్యాయి. అయితే.. ఇప్పుడు ఆమె సూపర్ హీరోస్ మాదిరి వండర్ ఉమెన్‌లా ఓ సినిమాలో నటించబోతున్నారని బీటౌన్ లేటెస్ట్ ఖబర్. అంతేకాదు.. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టు పార్ట్స్‌గా రాబోతుందట. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళితే.. వండర్ ఉమెన్ బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్లో నటించబోయే తొలి హీరోయిన్ దీపికానే అవుతుందని టాక్. మరి.. వండర్ ఉమెన్‌లా దీపికా చేయబోయే వండర్స్ ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడాలంటే మాత్రం చాలా టైమ్ ఉంది. ఇక.. రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్ ఈ ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
‘వండర్ విమెన్’ ఎందుకు ఆపారు?
-
‘వండర్ విమెన్’ ఎందుకు ఆపారు?
న్యూఢిల్లీ: భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ‘వండర్ విమెన్’ అనే హాలీవుడ్ చిత్రం లెబనాన్‌లో మాత్రం విడుదల కాలేదు. భారత్‌లో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లెబనాన్ ఆర్థిక, వాణిజ్య శాఖ ఈ సినిమా విడుదలను తమ దేశంలో అడ్డుకోవడం వార్నర్ బ్రదర్స్ నిర్మాతలను నిరాశ పరిచింది. ఈ సినిమాలో సూపర్ హీరోగా నటించిన హీరోయిన్ గాల్ గాడెట్ ఇజ్రాయెల్ దేశస్థురాలవడమే కాకుండా ఇజ్రాయెల్ సైన్యంలో కూడా పనిచేయడమే ‘వండర్ విమెన్’ సినిమాను నిషేధించడానికి కారణం. లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా యుద్ధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. 2006లో జరిగిన యుద్ధంలో రక్తపాతం ఎక్కువగా జరిగింది. ఇద్దరు తమ సైనికులను సరిహద్దు కాల్పుల్లో చంపేశారని, మరో ముగ్గురు సైనికులను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో 2006లో లెబనాన్‌పైకి ఇజ్రాయెల్ పదాతి దళాలతోపాటు వైమానిక దాడులు జరిపాయి. ఈ యుద్ధంలో దాదాపు 1000 మంది లెబనీయులు మరణించారు. ఆ యుద్ధం నుంచి ఇజ్రాయెల్‌ను లెబనాన్ శత్రుదేశంగా పరిగణిస్తూ వస్తోంది. వాండర్ విమెన్ సినిమాను అనుమతించాలని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. పూర్తి ఫాంటసీ చిత్రమైన వాండర్ విమెన్‌ను అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రక్తికట్టించడంతో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. సమ్మర్ సంప్ కారణంగా ద్వేన్ జాన్సన్ నటించిన బేవాచ్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సీక్వెల్, ఏలియన్:కోవనెంట్, కింగ్ ఆర్థర్ లాంటి హాలివుడ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన మేరకు రాణించక పోవడంతో ఈ సినిమాపైనే నిర్మాతలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. మంచి, న్యాయం, సమానత్వం, సాహసం, యుద్ధం, శాంతి అంశాలను ప్రతిబింబిస్తూ సాగే ఈ సినిమా ఆధ్యంతం ఆసక్తి దాయకంగా ఉందని జాతీయ మీడియా ప్రశంసించడంతోపాటు ఐదు స్టార్లకుగాను నాలుగు స్టార్ల రేటింగ్‌ను ఇచ్చారు. ‘వీర నారి వర్సెస్ మొదటి ప్రపంచ యుద్ధం’ చందంగా సినిమా ఉందని కితాబిచ్చారు. 3 డీ వర్షన్లో కూడా విడుదలైన ఈ సినిమాకు పాటీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. ఓ మహిళ దర్శకత్వం వహించడం వల్ల కూడా ఈ సినిమాకు న్యాయం జరిగిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. -
ఈ యుట్యూబ్ వారం హిట్స్
వండర్ ఉమన్ : అఫిషియల్ ట్రైలర్ డయానా.. అమెజాన్‌ల యువరాణి. ఓ దీవిలో ఉంటుంది. యుద్ధవిద్యలో ఆరితేరి యోధురాలు అవుతుంది. దీవికి రక్షకురాలిగా ఉంటుంది. ఆ దీవిలో ఒక విమానం కుప్పకూలుతుంది. ప్రాణాలతో బయటపడిన ఆ విమానం పెలైట్‌కు డయానాతో పరిచయం అవుతుంది. త్వరలో ప్రపంచ యుద్ధం రాబోతోందని అతడు ఆమెకు చెబుతాడు. ఆ యుద్ధాన్ని నివారించేందుకు డయానా బయల్దేరుతుంది. ఆ ప్రయత్నంలో ఈ వండర్ ఉమన్‌కు డాక్టర్ పాయిజన్ అనే శత్రువు తారసపడతాడు. అతడితో తలపడుతుంది. ఈ కథ అంతటికీ దృశ్యరూపమే వండర్ ఉమన్ తాజా ట్రైలర్. డిసి కామిక్స్ క్యారెక్టర్ ఆధారంగా అదే పేరుతో వస్తున్న ఈ హాలీవుడ్ సూపర్‌హీరో మూవీ (‘వండర్ ఉమెన్’) ట్రైలర్ మూడు రోజుల క్రితమే విడుదలైంది. నిమిష నిమిషానికీ హిట్స్ పెరిగిపోతున్నాయి. ప్యాటీ జెన్కిన్స్ డెరైక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. వచ్చే ఏడాది జూన్ 2న ఐమ్యాక్స్ త్రీడీలో మనం వండర్ ఉమన్‌ని చూడొచ్చు. టి2: ట్రైన్ స్పాటింగ్ : అఫిషియల్ ట్రైలర్ నిడివి : 1 ని. 55 సె., హిట్స్ : 32,35,654 మొదట అవకాశం. తర్వాత నమ్మక ద్రోహం! పాతికేళ్లు గడిచిపోయాయి. అంతా మారిపోయింది. అసలేమీ మారకుండానూ ఉంది. మార్క్ రెంటన్ ఇంటికి చేరుకున్నాడు. ఈ భూమండలంపై తను ఇల్లు అని పిలుచుకునే ఏకైక ప్రదేశం అది. అక్కడ అతడి కోసం స్పడ్, సిక్ బాయ్, బెగ్బీ ఎదురుచూస్తూ ఉన్నారు. వారితో పాటు తక్కిన ప్రియ నేస్తాలు కూడా మార్క్ రెంటన్ కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి. దుఃఖం, సంతోషం, ప్రతీకారం, ద్వేషం, ప్రేమ, భయం, పశ్చాత్తాపం, స్వీయపతనం.. ఇవన్నీ! మార్క్ జీవితం మళ్లీ ఫ్రెష్‌గా మొదలైంది. అతడు ఈ స్నేహితులు కాని స్నేహితులతో, శత్రువులు కాని శత్రువులతో కలిసి జీవించాలి. ఇదీ టి2 : ట్రైన్‌స్పాటింగ్ కథ. ఈ బ్రిటిష్ బ్లాక్ కామెడీ క్రైమ్ డ్రామా జనవరి 27న విడుదలవుతోంది. 1996లో వచ్చిన ‘ట్రైన్ స్పాటింగ్’కి ఇది సీక్వెల్. కాస్త గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ సినిమాను చూడగలరని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. అన్నట్టు... ట్రైలర్ చూడ్డానికి కూడా కొంచెం గుండెబలం కావాలి. ప్రాణాల్ని బాగా పైకి తీసుకెళ్లి, కిందికి వదిలేసే సన్నివేశాలు రెండుమూడు ఉన్నాయి మరి. బాబా సాంగ్ : ప్రియాంక చోప్రా నిడివి : 4 ని. 12 సె., హిట్స్ : 5,61,578 ప్రియాంక చోప్రా పాడుతున్నారు. ‘‘నాన్నా నీ మనసులోని బాధను నేనెప్పుడూ అర్థం చేసుకోలేదు. నేనెలా జీవించాలి? చెప్పు.. నేను ఎటువైపు వెళ్లాలి? నాకేమీ తెలియడం లేదు. నిన్నిలా అడుగుతోంది... నీకెంతో ప్రియమైన నీ కూతురు. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థం ఇచ్చావు. నాన్నా... దయచేసి ఆగు. నన్నొదిలి వెళ్లిపోకు’ అంటూ పాట సాగుతుంది. ‘నాన్నా ఏదైనా మాట్లాడు... ఏదో ఒకటి చెప్పు. ఏదైనా. వెళ్లిపోకు నాన్నా... వెళ్లిపోకు’ అంటూ పాట ఎండ్ అవుతుంది. తండ్రి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూతురు పాడే పాట ఇది. ‘వెంటిలేటర్’ అనే మరాఠీ సినిమా కోసం ప్రియాంకా చోప్రా స్వయంగా ‘బాబా’ అనే ఈ పాటను ఆలపించారు. మంద్రస్థాయిలో మైక్ ముందు నిలబడి ఆమె పాడుతున్నప్పుడు మదిని ఉద్వేగపరిచే దృశ్యాలు నేపథ్యంగా కనిపించి కనుమరుగైపోతుంటాయి. గుండెలో మాత్రం అలా మిగిలిపోతాయి. సాహిత్యం మనోజ్ యాదవ్. సంగీతం రోహన్. చిత్రం రెండు రోజుల క్రితమే విడుదలైంది. సినిమాలో ప్రియాంక పాట మాత్రమే ఉంటుంది. ప్రియాంక ఉండరు. బై ది వే ఈ చిత్ర నిర్మాత ఎవరో కాదు, ప్రియాంకే! స్వీట్ గాళ్ వీడియో సాంగ్: రోచ్ కిల్లా నిడివి : 5 ని., హిట్స్ : 15,29,557 రోచ్ కిల్లా... అవార్డు విన్నింగ్ పంజాబీ ర్యాపర్. కెనడాలో పెరిగిన ఈ పాకిస్థానీ సంతతి భారతీయుడు తాజాగా ‘స్వీట్గాళ్’ అనే సాంగ్‌ని రిలీజ్ చేశాడు. మ్యూజిక్ ఉల్లూ మనాటి. స్వరం బ్రౌన్ గర్ల్, రోచ్ కిల్లా. ఈ అమ్మాయి, అబ్బాయి కలిసి ఇంగ్లిష్‌ని, పంజాబీని కలిపి కొట్టారు. ‘స్వీట్ స్వీట్ గాళ్... ఇన్ బ్యాడ్ బ్యాడ్ వరల్డ్’ అనే అర్థం వచ్చే ఈ గీతం... ‘గర్ల్ ఐ నో.. ఐ వాంట్ యు’ అని పల్లవితో స్టార్ట్ అవుతుంది. పొట్టి జాకెట్లు, అంతకన్నా కురచ నిక్కర్లు ధరించిన అమ్మాయిలు పాట పాడుతూ డాన్స్ చేస్తారు. హాఫ్ నేకెడ్ అబ్బాయిలు వారిని అనుసరిస్తూ ఉంటారు. అంతా కలిసి ఇలాతలంలో నేలపై, నీళ్లపై స్వేచ్ఛగా విహరిస్తున్నప్పుడు వీక్షించడం మనోహరంగా ఉంటుంది. -
శక్తిమంతమైన కార్టూన్ మహిళను సృష్టించండి
ఆపిల్ ఐ-ప్యాడ్ గెలుచుకోండి ‘వండర్ ఉమెన్’, ‘ఎక్స్ మెన్ స్టార్మ్’, ‘కమలాఖాన్’, ‘మిస్ మార్వెల్’ల వంటి అత్యంత శక్తిమంతమైన మహిళా కార్టూన్ సూపర్ హీరోను సృష్టించే సృజనాత్మకత మీలో ఉందా? అయితే సాక్షి ‘ఫ్యామిలీ’, యు.ఎస్.కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీ మీ కోసమే. నిబంధనలు పోటీలో పాల్గొనేవారు 14-21 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థినీ విద్యార్థులై, భారత పౌరులై ఉండాలి.ఒక మహిళా కార్టూన్ సూపర్ హీరోయిన్ని సృష్టించి, ఆమెకో పేరు ఇవ్వాలి. మామాలు మనుషులకు లేని అద్భుత శక్తి ఆమెకు ఉండి, ఆ శక్తితో ఆమె తన చుట్టూ ఉండే వ్యక్తులను లేదా సమాజాన్ని కాపాడగలగాలి. మీరు సృష్టించిన ఆ మహిళా కార్టూన్ సూపర్‌హీరో పాత్రకు ప్రేరణ ఏమిటి? ఆ సూపర్ హీరోకి ఉన్న అద్భుత శక్తి ఏమిటి? ఆ శక్తి ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది? సమాజం కోసం ఆ శక్తిని మీ సూపర్ హీరో ఎలా ఉపయోగిస్తుంది అనే వాటిని మీరు కథలా రాసి పంపించాలి. ఆ సూపర్‌హీరో బొమ్మను కూడా గీసి, కథకు జతపరచాలి. కథను చిన్న కార్టూన్ స్ట్రిప్‌లా నడిపించి పంపితే మరీ మంచిది. బహుమతి విజేతగా నిలిచినవారి సూపర్ హీరో కథను లేదా కామిక్ స్ట్రిప్‌ను ‘సాక్షి’ ఫ్యామిలీ ప్రచురిస్తుంది. విజేత ఇంటర్వ్యూ కూడా సాక్షి ఫ్యామిలీలో వస్తుంది. వీటితో పాటు యు.ఎస్.కాన్సులేట్ తరఫున విజేత ఆపిల్ ఐ ప్యాడ్ మినీని కూడా సొంతం చేసుకుంటారు. మీ మహిళా కార్టూన్ సూపర్ హీరో కథను, బొమ్మను పంపవలసిన మెయిల్ ఐడి: hyderabadpa@gmail.com. గడువు తేదీ: 25 మార్చి 2015. మరింత సమాచారం కోసం యు.ఎస్.కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ ఫేస్బుక్ పేజీని చూడండి. -
ఇలియానా