అద్భుత మహిళ రాబోతోంది | Wonder Woman 1984 Will Be Released Directly to HBO Max | Sakshi
Sakshi News home page

అద్భుత మహిళ రాబోతోంది

Published Fri, Nov 20 2020 3:31 AM | Last Updated on Fri, Nov 20 2020 4:02 AM

Wonder Woman 1984 Will Be Released Directly to HBO Max - Sakshi

స్పైడర్‌ మేన్, సూపర్‌ మేన్, హీ మేన్, బ్యాట్‌ మేన్‌... ఏం మగవాళ్లకే అతీత శక్తులుంటాయా? ఆడవాళ్లకు ఉండవా అంటే.. ‘నేనున్నాను’ అంటూ ‘వండర్‌ ఉమన్‌’ తెరపైకి దూసుకొచ్చింది. ఈ అద్భుత మహిళ సృష్టికర్త ఎవరంటే దర్శకురాలు ప్యాటీ జెన్‌కిన్స్‌. స్పైడర్‌ మేన్, హీ మేన్‌.. ఇంకా వేరే పవర్‌ ఫుల్‌ మేన్లకు దీటుగా వసూళ్ల వర్షం కురిపించింది ‘వండర్‌ ఉమన్‌’. 2017లో వచ్చిన ఈ చిత్రంలో గాల్‌ గాడోట్‌ కథానాయికగా నటించారు.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ ‘వండర్‌ ఉమన్‌ 1984’లో గాల్‌ గాడోట్‌నే కథానాయికగా ఎంపిక చేసి, ప్యాటీ జెన్‌ కిన్స్‌ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జూన్‌ 5న విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇంకా ఆగడం సరికాదని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ థియేటర్లు రీఓపెన్‌ అయ్యాయో అక్కడ వచ్చే నెల 16న, హెచ్‌ఓబీ మ్యాక్స్‌లో 25న విడుదల చేయాలని చిత్రనిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ నిర్ణయించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement