
Gal Gadot: 'వండర్ వుమెన్' హీరోయిన్ గాల్ గాడోట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ఈ హాలీవుడ్ స్టార్ తన గారాలపట్టికి డానియెల్లా అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. ఇక మూడోసారి తల్లైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటో షేర్ చేసింది. ఇందులో భర్త జారన్ వర్సానో, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. "నా కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఇప్పుడు ఐదుకి చేరింది. ఆనందంతో పరవశించిపోతున్నా. డేనియల్లాను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది" అని సదరు పోస్ట్‌కు క్యాప్షన్ జత చేసింది గాల్.
గాల్ గాడోట్ ఇటీవలే 'వండర్ వుమన్ 1984' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2017 వచ్చిన ‘వండర్ ఉమన్’కు ఇది పార్ట్-2గా వస్తోంది. ప్యాటీ జెన్‌కిన్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆమె కెన్నెత్ బ్రనగ్ దర్శకత్వం వహిస్తున్న బ్రిటీష్ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ 'డెత్ ఆన్ ద నైల్' సినిమా చేస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
చదవండి: ప్లీజ్.. సంరక్షకుడిగా నా తండ్రిని తప్పించండి: బ్రిట్నీ స్పియర్స్ వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment