US Actor Amanda Bynes Placed on 72-hour Psychiatric Hold in California - Sakshi
Sakshi News home page

Amanda Bynes : నగ్నంగా రోడ్లపై సంచరించిన నటి... పిచ్చాసుపత్రికి తరలించిన పోలీసులు

Mar 21 2023 5:25 PM | Updated on Mar 21 2023 6:48 PM

Us Actor Amanda Bynes Placed In Psychiatric Care For 72 Hours - Sakshi

అమెరికన్‌ నటి అమాండా బైన్స్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పిచారు. లాస్‌ ఏంజిల్స్‌ వీధుల్లో నగ్నంగా తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. 36ఏళ్ల అమాండా గత కొంతకాలంగా మానసికి సమస్యలతో బాధపడుతుంది. పక్కింటికి నిప్పంటించడం, పెంపుడు కుక్కను చంపాలనుకోవడం వంటివి చేసింది.

తాజాగా కారు నుంచి నగ్నంగా దిగి లాస్‌ డౌట్‌టౌన్‌ సమీపంలో బట్టలు లేకుండా సంచరించింది. దీంతో గుర్తించిన పోలీసులు ఆమెను సైకియాట్రిస్ట్‌ నిపుణుల సూచనతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం 71 గంటల పాటు వైద్యుల పర్యవేక్షనలో అమాండా ఉంది.

ఒకవేళ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఇంకొన్ని రోజుల పాటు ఆమె అక్కడ ఉండనుంది. కాగా అమాండా గతంలో డ్రగ్స్‌కు బానిసై దాన్నుంచి బయటపడ్డానని స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన అమాండా ఈజీ ఎ, షీ ఈజ్ ది మ్యాన్, వాట్ ఏ గర్ల్ వాంట్ వంటి పలు సినిమాల్లో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement