Oscars 2023: Michelle Yeoh Won Best Actress At The 95th Academy Awards - Sakshi
Sakshi News home page

Michelle Yeoh : ఆ ఘనత ఆమెకు సొంతం..విన్నింగ్‌ స్పీచ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా

Published Tue, Mar 14 2023 8:34 AM | Last Updated on Tue, Mar 14 2023 9:41 AM

Michelle Yeoh Makes Oscar History With Best Actress Win - Sakshi

'కలలు కనండి. నిజం అవుతాయనడానికి నేను ఈ అవార్డును ఓ ప్రూఫ్‌గా చూపిస్తున్నాను. మహిళలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మీ ప్రైమ్‌ టైమ్‌ను మీరు దాటిపోయారు అంటే నమ్మొద్దు. ఈ అవార్డుని నేను మా అమ్మకు... ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే వారే నిజమైన సూపర్‌హీరోస్‌. వీరే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండి ఉండేవారు కాదు.మా అమ్మగారికి 84 ఏళ్లు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇప్పుడు మలేసియాలో ఆమె ఈ వేడుకను చూస్తున్నారు.

నేను ఈ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నాను (కుటుంబ సభ్యులను ఉద్దేశించి). అలాగే నా కెరీర్‌ హాంకాంగ్‌లో స్టార్ట్‌ అయ్యింది. అక్కడ నాకు హెల్ప్‌గా ఉన్నవారికి ధన్యవాదాలు. అలాగే నెవర్‌ గివప్‌. డానియల్‌ డ్యూయో, ఏ 24 షూటింగ్‌ స్టూడియో, ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌..’ నటీనటుల సహాయం లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఈ వేదికపై ఉండేదాన్ని కాదు'. – ఉత్తమ నటి, మిషెల్‌ యో(కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్‌ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. అంతేకాదు ఇప్పుడామె వయస్సు 60ఏళ్లు. )

నాకు అవార్డు ఇచ్చిన ఆస్కార్‌ కమిటీకి, ఇలాంటి ఓ బోల్డ్‌ ఫిల్మ్‌లో నటించే అవకాశం కల్పించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ‘ది వేల్‌’ సినిమాలో భాగమైన వారిని గుర్తు చేసుకోకుండా ఉండలేను. బెస్ట్‌ యాక్టర్‌గా నాకు అవార్డు రావడాన్ని చాలా గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను. నటుడిగా నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నాకు గుర్తింపు వస్తుందా? అని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కేవలం తిమింగలాలు మాత్రమే లోలోతుల్లో ఈదగలవు. సినిమా ఇండస్ట్రీలో నేనూ అంతే. నాకు హెల్ప్‌గా ఉన్న నా కుటుంబ సభ్యలకు ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు బ్రెండెన్‌ ఫ్రాజెర్‌ (చెమర్చిన కళ్లతో...) ఈయన కూడా 54 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్నారు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement