
97వ ఆస్కార్ అవార్డులు ప్రకటించేశారు. ఈసారి 'అనోరా' అనే రొమాంటిక్ కామెడీ మూవీ.. ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీనితో పాటు ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్.. ఇలా ఐదు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. మరి అంత స్పెషల్ ఏముంది ఈ సినిమాలో?
అనోరా అనే రొమాంటిక్ కామెడీ మూవీ.. రష్యాకి చెందిన కోటీశ్వరుడైన కుర్రాడు చదువుకోవడానికి అమెరికా వస్తాడు. ఓ వేశ్యని కలుస్తాడు. దాదాపు వారంపాటు తనతో ఉండమని ఆమెకు డబ్బులిస్తాడు. కానీ కొన్నిరోజులకే ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ ఆ కుర్రాడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి.. అతడిని తిరిగి ఇంటికి పట్టుకెళ్లిపోతారు. దీంతో వేశ్య ఏం చేసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా')

సాధారణంగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ ఎక్కువగా ఇస్తుంటారు. కానీ 18+ కంటెంట్ ఉన్న అనోరా మూవీకి ఈసారి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దాదాపు రెండున్నర గంటలున్న ఈ సినిమా గతేడాది థియేటర్లలో రిలీజైనప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. తొలి గంటలో మసాలా సన్నివేశాలతో సగటు హాలీవుడ్ మూవీని తలపించినా.. ద్వితియార్థం మంచి ఎమోషనల్ గా ఉంటుంది. క్లైమాక్స్ మిమ్మల్ని ఆశ్యర్యపరుస్తుంది.
వేశ్యలు అనగానే మనలో చాలామందికి చిన్నచూపు ఉంటుంది. కానీ వాళ్లు కూడా మనుషులే. వాళ్లని నీచంగా చూడకూడదు అనే పాయింట్ తో తీసిన 'అనోరా' ఇప్పుడు ఆస్కార్ అందుకుంది. ఇకపోతే అనోరా అనేది లాటిన్ పదం. దీనికి తెలుగులో అర్థమేంటో తెలుసా 'గౌరవం'.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
Comments
Please login to add a commentAdd a comment