Trolls On Actress Gal Gadot Pumping Breast Milk Photos: See Her Reaction - Sakshi
Sakshi News home page

Viral: బిడ్డకు పాలిస్తే.. బిల్డప్‌ ఎలా అవుతుంది: హీరోయిన్‌

Published Thu, Aug 19 2021 12:07 PM | Last Updated on Thu, Aug 19 2021 4:23 PM

Gal Gadot Slams Critics Over Pumping Breast Milk Photos - Sakshi

బోల్డ్‌ స్టేట్‌మెంట్లు, యాక్షన్లు తరచూ సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అందుకే నొప్పింపక.. తానొవ్వక అనే రీతిలో వ్యవహరిస్తుంటారు కొందరు. ఆ కొందరిలో ఒకరు నటి గాల్‌ గాడోట్‌(36). వండర్‌ ఉమెన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న హాలీవుడ్‌ నటి గాడోట్‌.. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సున్నితంగా ఆడియెన్స్‌కు చేరవేస్తుంటుంది కూడా. 

అలాంటిది తాజాగా ఆమె చేసిన ఓ పని.. ఇంటర్నెట్‌లో విమర్శలకు దారితీసింది. షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న తరుణంలో.. టచప్‌ సందర్భంగా చనుబాలను పంపింగ్‌ చేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో కొందరు పనిగట్టుకుని ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. అతి చేష్టల్లో భాగంగా ఆమె ఆ పని చేసిందంటూ మండిపడ్డారు. దీంతో గాడోట్‌ ఓ మీడియా హౌజ్‌ ద్వారా స్పందించింది. తల్లి పాల విలువేంటో చెప్పేందుకు తాను ఆ పని చేశానని క్లారిటీ ఇచ్చింది. తల్లయ్యాక తిరిగి పనుల్లోకి వెళ్లడం ఎంత కష్టమో ఆ విమర్శించే వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. అది తెలియాలనే నా ఈ ప్రయత్నం. పైకి నవ్వుతూ ఉన్నా.. ఎల్లప్పుడూ బిడ్డల ఆకలి గురించి ఆలోచించే తల్లుళ్లకు జోహార్లు అంటూ చెంపపెట్టు సమాధానమిచ్చింది గాల్‌ గాడోట్‌. 

కాగా, ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన గాడోట్‌.. రెండు నెలల క్రితమే మూడో బిడ్డకు జన్మనిచ్చింది. గాడోట్‌ మాత్రమే కాదు.. గతంలో క్రిస్సి టెయిగెన్‌, లోకి నటి సోఫియా డి మార్టినో కూడా ఇలా సెట్స్‌ నుంచే పంపింగ్‌ ఫొటోలతో వార్తల్లో చర్చకు దారితీశారు.

చదవండి: పూజా హెగ్డే.. ఇది మంచి పద్ధతి కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement