Jewellery Made From Breast Milk: ఇంతవరకు తల్లిపాల ప్రాధాన్యత గురించి మాత్రమే తెలుసు. అంతేకాదు పుట్టిన నవజాత శిశువులకు తొలి ఆరునెలల తల్లిపాలు తాగితే వారికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అంతేందుకు తల్లిపాల వారోత్సవాలు లేదా మథర్ బ్రెస్ట్ మిల్క్ డే అని ఒక రోజు కూడా ఏర్పాటు చేశారు. పైగా తల్లిపాలకు నోచుకోని చిన్నారులకు తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో మిల్క్ బ్యాంక్స్ ఏర్పాటు చేద్దాం అంటూ విన్నూతన పద్ధతులు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు నిపుణులు. కొన్ని దేశాల ఇప్పటికే ఆ పద్ధతులను అవలంభించాయి కూడా. అయితే ఇప్పుడు ఈ తల్లిపాలతో విలువైన ఆభరణాలను కూడా తయారుచేస్తున్నారట. అంతేకాదు ఇది తల్లులు తమ పిల్లతో గల విశిష్ట అనుబంధానికి గుర్తుగా రూపొందిస్తున్నారట!.
(చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!)
అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన అల్మా పార్టిడా తన కుమార్తె అలెస్సాకు సుమారు 18 నెలల పాటు పాలిచ్చింది. అయితే అప్పుడే ఆమెకు తాను తన పిల్లలకు ఇస్తున్న పాలను మాృతృత్వపు మాధుర్యానికి గుర్తుగా ఉంచుకునే మార్గం కోసం అన్వేషించింది. అంతేకాదు ఇందుకోసం ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్చ్ చేసింది. అప్పుడే ఆమెకు తల్లిపాలతో తయారు చేసే నగల కంపెనీ కీప్‌సేక్స్ బై గ్రేస్ గురించి తెలుసుకుంది.
ఇక ఆమె వెంటనే తల్లిపాలలో దాదాపు 10 మిల్లీలీటర్లను కీప్‌సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీకి పంపింది. ఈ మేరకు ఒక నెల తర్వాత ఆ కంపెనీ ఆమె చేతికి మిల్కీ-వైట్ గుండె ఆకారంలో లాకెట్టును పంపించింది. దీంతో అల్మా పార్టిడా తన కోరిక ఫలించినందకు సంతోషించడమే కాక తాను తల్లిగా మారిన తర్వాత చివరి మిల్క్ డ్రాప్‌గా తన బిడ్డకు పాలు ఇస్తు సాగిన జీవితపు తీపి గుర్తుగా పదిలంగా ఉంటుందని పేర్కొంది .
ఈ మేరకు కీప్‌సేక్స్ బై గ్రేస్ కంపెనీ యజమాని సారా కాస్టిల్లో మాట్లాడుతూ...తల్లిపాలతో ఆభరణాలా అంటూ ఆశ్యర్యంతోపాటు నన్ను ఒక వెర్రిదాని వలే చూశారు. నేను తయారు చేసిన ఆభరణాలను చూసిన తర్వాతే నాకు చాలా ఆర్డర్‌లు రావడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడూ విపరీతమైన నరకయాతనను అనుభవించిన తల్లుల నుంచే తనకు ఎక్కు ఆర్డర్‌లు వచ్చాయి" అని న్యూయార్క్ టైమ్స్‌కి తెలిపింది. అంతేకాదు సారా తల్లిపాలతో తయారు చేసే స్టోన్‌లు దాదాపు రూ.4 వేల నుంచి 11 వేలు వరకు ధర పలుకుతాయి. అంతేకాదు సదరు మహిళ అల్మా చేతికి జ్యువెలరీని ధరించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆవీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి.
(చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!)
Comments
Please login to add a commentAdd a comment