A Gold Cube Worth $11.7 Million Appeared In New York's Central Park: ఇంతవరకు మనం బంగారానికి సంబంధించిన వస్తువులను, గోల్డ్ బిస్క్‌ట్లు గురించి విన్నాం. గోల్డ్‌తో తయారు చేసే మాస్క్‌ల దగ్గర నుంచి రకరకాల బంగారపు కళాకృతులు గురించి విని ఉన్నా. కానీ ఒక భారి సైజులో ఉండే గోల్డ్ క్యూబ్ గురించి విని ఉండటమే కాదు చూసి కూడా ఉండం. పైగా అంత పెద్ద క్యూబ్‌ని ఒక ఓపెన్ పార్క్‌లో స్వయం భద్రతా నడుమ ఆరు బయట ఉండటం గురించి అసలు విని ఉండరు.
అసలు విషయంలోకెళ్తే...న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో బంగారంతో చేసిన భారీ క్యూబ్ ఉంది. దీనిని దాదాపు 186 కిలోగ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో జర్మన్ కళాకారుడు నిక్లాస్ కాస్టెల్లో రూపొందించారు. ఆ కళాకారుడు కొత్త క్రిప్టోకాయిన్ ప్రచార నిమిత్తం అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ సెంట్రల్ పార్క్‌లో ఉంచాడు.
అంతేకాదు మానవజాతి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇంత భారీ మొత్తంలో బంగారు క్యూబ్‌ని రూపొందించ లేదు. కాస్టెల్లో ఈ క్యూబ్‌ని అన్ని కోణాల్లోని సంభావిత కళాఖండంగా పేర్కొన్నాడు. అయితే కాస్టెల్లో ఈ క్యూబ్‌ని అమ్మకానికి పెట్టడం లేదని తెలిపాడు. ఈ మేరకు ఈ గోల్డ్ క్యూబ్ ధర దాదాపు రూ.87 లక్షలు. అంతేకాదు ఈ క్యూబ్‌ని చేతితో తయారు చేసిన కొలిమి సాయంతోనే రూపొందించగలం అని వివరించాడు. ఈ భౌతిక కళాకృతి క్రిప్టోకరెన్సీలో భాగంగా క్యాస్టెల్లో కాయిన్‌ని ప్రారభించటమే కాక సంబంధించిన ఎన్‌ఎఫ్‌టీల్లో వేలం వేయనున్నట్లు న్యూయర్క్ టైమ్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment