Central Park
-
ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!
A Gold Cube Worth $11.7 Million Appeared In New York's Central Park: ఇంతవరకు మనం బంగారానికి సంబంధించిన వస్తువులను, గోల్డ్ బిస్క్ట్లు గురించి విన్నాం. గోల్డ్‌తో తయారు చేసే మాస్క్‌ల దగ్గర నుంచి రకరకాల బంగారపు కళాకృతులు గురించి విని ఉన్నా. కానీ ఒక భారి సైజులో ఉండే గోల్డ్ క్యూబ్ గురించి విని ఉండటమే కాదు చూసి కూడా ఉండం. పైగా అంత పెద్ద క్యూబ్‌ని ఒక ఓపెన్ పార్క్‌లో స్వయం భద్రతా నడుమ ఆరు బయట ఉండటం గురించి అసలు విని ఉండరు. అసలు విషయంలోకెళ్తే...న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో బంగారంతో చేసిన భారీ క్యూబ్ ఉంది. దీనిని దాదాపు 186 కిలోగ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో జర్మన్ కళాకారుడు నిక్లాస్ కాస్టెల్లో రూపొందించారు. ఆ కళాకారుడు కొత్త క్రిప్టోకాయిన్ ప్రచార నిమిత్తం అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ సెంట్రల్ పార్క్‌లో ఉంచాడు. అంతేకాదు మానవజాతి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇంత భారీ మొత్తంలో బంగారు క్యూబ్‌ని రూపొందించ లేదు. కాస్టెల్లో ఈ క్యూబ్‌ని అన్ని కోణాల్లోని సంభావిత కళాఖండంగా పేర్కొన్నాడు. అయితే కాస్టెల్లో ఈ క్యూబ్‌ని అమ్మకానికి పెట్టడం లేదని తెలిపాడు. ఈ మేరకు ఈ గోల్డ్ క్యూబ్ ధర దాదాపు రూ.87 లక్షలు. అంతేకాదు ఈ క్యూబ్‌ని చేతితో తయారు చేసిన కొలిమి సాయంతోనే రూపొందించగలం అని వివరించాడు. ఈ భౌతిక కళాకృతి క్రిప్టోకరెన్సీలో భాగంగా క్యాస్టెల్లో కాయిన్ని ప్రారభించటమే కాక సంబంధించిన ఎన్‌ఎఫ్‌టీల్లో వేలం వేయనున్నట్లు న్యూయర్క్ టైమ్స్ పేర్కొంది. View this post on Instagram A post shared by Niclas Castello (@niclas.castello) (చదవండి: మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి) -
ఆనంద్ మహీంద్రా ట్వీట్: ‘న్యూయార్క్ సెంట్రల్ పార్క్.. డబ్బా వాలీ’
భారతీయుల రోజువారీ జీవితంలో స్టీల్ టిఫిన్ బాక్స్‌తో ఉన్న సంబంధం ఎనలేనిది. స్కూల్, కాలేజ్, జాబ్లకు వెళ్లే వారందరూ టిఫిన్ డబ్బా తీసుకెళ్లడం అందరికి తెలిసిందే. ఒకప్పుడు స్టీల్ డబ్బాను టిఫిన్ బాక్స్‌గా ఉపయోగించే వారంతా ఇటీవల ప్లాస్టిక్ డబ్బాలకు అలవాటు పడ్డారు. కానీ ప్లాస్టిక్‌తో అనారోగ్య సమస్యలు ఉండటంతో దృష్ట్యా మళ్లీ స్టీల్ వాటికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. భారతీయులకు బాగా తెలిసిన స్టీల్ టిఫిన్ బాక్సు నేపథ్యం ఉన్న ఓ ఫోటోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్లో షేర్ చేశారు. ఒక మహిళ స్టీల్ టిఫిన్ పట్టుకుని దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు.. "న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బా వాలీ” అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను ఆగష్టు 19న షేర్ చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్తూ స్టీల్ డబ్బాను తీసుకెళ్తున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ముంబైలో పేరుమోసిన ‘డబ్బావాలా’ సేవలను గుర్తుచేసేలా ఈ ఫోటోకు డబ్బావాలి అని కామెంట్ పెట్టడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టీల్ టిఫిన్ బాక్స్‌లతో బలమైన అనుబంధం ఉన్న భారతీయులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. చదవండి: Anand Mahindra: రోబో కంటే వేగంగా దోశలు వేస్తున్నాడే..! స్టీల్ టిఫిన్ బాక్స్‌ను తీసుకెళ్లడం మన దగ్గర సాధారణ విషయమే కానీ న్యూయార్క్‌లో కూడా ఒక మహిళ స్టీల్ డబ్బాను ఇలా తీసుకెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ. ‘స్టీల్ డబ్బాస్.. చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపాయి’ అని భావేద్వాగానికి లోనవుతున్నారు. మరొకరు స్టీల్ డబ్బానే ఓ "భావోద్వేగం" అని కామెంట్ చేస్తున్నారు. New York, Central Park. Dabba walli pic.twitter.com/vMZmToLbOH — anand mahindra (@anandmahindra) August 19, 2021 -
అమెరికాలో గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: అమెరికాకు బహుమానంగా ఇచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించింది. ఇది హేయమైన చర్య అని తెలిపింది. బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అమెరికాలో డేవిస్ పట్టణంలో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. అంతర్జాతీయంగా శాంతి, సమానత్వానికి ప్రతీకగా ఉన్న గాంధీ విగ్రహం కూల్చివేత హేయమైనదని భారత్ పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం కూడా స్పందించింది. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని డేవిస్ మేయర్ ప్రకటించారు. కాగా, 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలోని సెంట్రల్ పార్క్‌లో దీనిని ప్రతిష్టించారు. ఇక నేడు మహాత్మాగాంధీ వర్ధంతి అని తెలిసిందే. On 28 Jan'21, Mahatma Gandhi statue at Central Park in City of Davis, California was vandalised by unknown persons. Statue was a gift by Govt of India in '16. The Govt strongly condemns this malicious & despicable act against a universally respected icon of peace & justice: MEA pic.twitter.com/vEy0I33gpV — ANI (@ANI) January 30, 2021 -
ఎనిమిదేళ్ల క్రితం ఎక్కడ మొదలైందో..!
న్యూయార్క్ : మధుర క్షణాలు అందించిన ప్రాంతాలకు మరల వెళ్లి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత చేస్తున్నది అదే. పెళ్లి చేసుకున్న తర్వాత షూటింగులతో బిజీగా ఉండటంతో చేతూసామ్లు కలిసి ఎక్కడికీ వెళ్లలేకపోయారు. ప్రస్తుతం షూటింగ్‌లకు కాస్త విరామమిచ్చి ఎంజాయ్ చేయడానికై వారి ప్రేమ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్లారు. ‘ఏ మాయ చేసావే’ సినిమా షూటింగ్ సమయంలో న్యూయర్క్ లోని సెంట్రల్ పార్క్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కట్ చేస్తే ఎనిమిది సంత్సరాల తర్వాత వీరు భార్యభర్తలుగా ఆ ప్రాంతాన్ని సందర్శించి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. సెంట్రల్‌పార్క్ దగ్గర దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సమంత.. ‘‘సాధారణంగా సెల్ఫీలు దిగటం అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి మధుర క్షణాలు ఫోటోలో బంధిస్తేనే బాగుంటుంది. ఎనిమిదేళ్ల క్రితం మా ప్రేమ ఇక్కడే మొదలైంది.. థ్యాంక్యూ సెంట్రల్ పార్క్ అని’’ సమంత పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. రంగస్థలం భారీ హిట్ కావడం, తన నటనతో విమర్శకులతో సైతం మెప్పించుకోవడంతో సమంత ఫుల్ హ్యపీగా ఉంది. ఇక సవ్యసాచి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న నాగచైతన్య కాస్త విరామం దొరకడంతో సమంతతో కలిసి న్యూయార్క్‌లో విహరిస్తున్నాడు. Usually hate selfies but this had to be done .. 💕 Central Park .. where it all began . 8 years ago.. Thankyou for the magic ..just had to come back and say Thankyouuu❤️ #whatsmeanttobewillbe #lovewillfindaway #NewyorkNewyork💕 #familyiseverything #chaylove #happilyeverafter #YMC A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Mar 31, 2018 at 3:52pm PDT -
గత స్మృతుల్లో ఆ పార్క్‌లో అధ్యక్షుడిగా..
న్యూయార్క్: మరో పద్దెనిమిది నెలలు పదవి కాలం. ఇలోగా చేయాల్సిన పనులు ఎన్నో. ఒక దేశ అధ్యక్షుడికి ప్రజల సంక్షేమం కోసం తానేం చేయగలనని నిత్యం ఆలోచన. దేశ వ్యవహారాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు... పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం ఆయా దేశాల ప్రతినిధులతో సమావేశాలు. సమస్యలను ఛేదించేందుకు వ్యూహాలు. మరోపక్క, కుటుంబం, పిల్లలతో గడిపే కార్యక్రమాలు. ఇవన్నీ ఒకే పదవిలో ఉండి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. గత కొద్ది రోజులుగా తన అధికారిక కార్యాలయంలో నిత్యం బిజీగా ఉంటున్న ఆయన శనివారం ఎందుకో సేదతీరాలనుకున్నారు. అది కూడా పక్కన రక్షణ సిబ్బంది లేకుండా. స్వేచ్ఛగా విహరించాలన్న ఆలోచన సాధారణ వ్యక్తిగా ఒబామాకు ఉండొచ్చుగానీ, నియమ నిబంధనల ప్రకారం ఓ అగ్రరాజ్య నేత ఒంటరిగా వెళ్లేందుకు ఎవరైనా ఒప్పుకుంటారా.. అందుకే ఆయన నడుస్తుంటే గగన తలంలో రక్షణగా హెలికాప్టర్లు.. ఆయనకు కొంచెం దూరంలో రక్షణ వలయంగా స్కూటర్లపై సీక్రెట్‌గా సెక్యూరిటీ సిబ్బంది.. పక్కన ఆయన కూతురు. ఇదంతా శనివారం సెంట్రల్ పార్క్‌లో దృశ్యం. సెక్యూరిటీని పక్కకు పెట్టి సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలనకోవడం ఒబామాకు ఇదే తొలిసారి కాదు. కానీ సెంట్రల్ పార్క్‌లో విహరించడం మాత్రం అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి. ఎందుకంటే, ఆయన 1980లో కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివినప్పుడు మాత్రం విహరించారట. నాడు విద్యార్థిగా ఉండి ఆ పార్క్‌లో సరదాగా గడిపిన ఆయన అధ్యక్ష స్థానంలో ఉండి విహరిస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచనతో తన కూతురుని వెంటబెట్టుకుని పార్క్‌లో కలియదిరుగుతూ సందడి చేశారు. పదవి కాలం పూర్తయ్యాక ఏమేం చేయాలన్న ఆలోచన కూడా అప్పుడే చేశారంట. ఆ ఆలోచనల్లోనే వీలైనన్నీ ప్రాంతాల్లో ఎలాంటి సెక్యూరిటీ పక్కన లేకుండా స్వేచ్ఛగా విహరించాలని ఉందంట. -
సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధిద్దాం
న్యూఢిల్లీ: సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడమే ధ్యేయంగా మరుగుదొడ్లను నిర్మించుకోవాలని, బహిరంగ విసర్జనకు స్వస్తిపలకాలని ప్రతినిధులు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ‘ప్రపంచ మరుగుదొడ్ల దినం’ సందర్భంగా సులభ్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరుగనున్న ‘ఇంటర్నేషనల్ టాయ్‌లెట్ ఫెస్ట్’ను మంగళవారం నగరంలోని సెంట్రల్ పార్కులో ప్రారంభించారు. 2019 వరకు ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే ప్రధాని మోదీ ఆకాంక్షను నెరవేర్చాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పథక్ అన్నారు. ప్రధానంగా గాంధీ కలలుగన్న సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం కోసం ప్రజలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఫ్ఘనిస్తాన్,ర భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు, విముక్తి పొందిన పారిశుధ్యకార్మికులు, 100 మంది వితంతువులు, నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
యువశక్తికి జోహార్లు
రాక్ కాన్సర్ట్‌లో మోదీ 60 వేల మంది హాజరు న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించి విలక్షణతను చాటుకున్న మోదీ తాజాగా ప్రపంచయువతకు సందేశమిచ్చేందుకు అసాధారణ వేదికను ఎంచుకున్నారు. ఆదివారం న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో 60 వేలమంది హాజరైన ఓ రాక్‌స్టార్ కాన్సర్ట్‌లో జే జెడ్, బియాన్స్, కేరీ అండర్వుడ్, స్టింగ్, అలీసియా కీస్ వంటి ప్రఖ్యాత మ్యూజిక్ స్టార్లతో వేదికను పంచుకుంటూ పలు సామాజిక అంశాల పై మాట్లాడారు. ప్రపంచ శాంతి, పారిశుద్ధ్యం, యువశక్తి గురించి ఆంగ్లంలో ఏడు నిమిషాలు ప్రసంగించి ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, అందరికీ విద్య, పారిశుద్ధ్యం కోసం కృషి చేస్తున్న గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా నటుడు హ్యూ జాక్మాన్ మోదీని తొలుత సభకు పరిచయం చేశారు. ‘చాయ్‌వాలా’ నుంచి గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా మోదీ ఎన్నికైన వైనాన్ని వివరించారు. న్యూయార్క్ వాసులారా ఎలా ఉన్నారంటూ మోదీ పలకరించడంతో సభికులంతా హర్షాతిరేకాలను తెలియజేశారు. ప్రపంచంలో తమకు ఏదైనా సాధ్యమేనన్న దృక్పథం ఉన్న యువతకు భారత్ సహా యావత్ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని మోదీ ప్రశంసించారు. యువతే ప్రపంచ భవిష్యత్తు అని పేర్కొన్నారు. భారత్‌ను మార్చడంలో 80 కోట్ల మంది యువతీయువకులు కూడా చేతులు కలుతున్నారని చెప్పారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నందుకు యువతను చూసి గర్వపడుతున్నానన్నారు. ‘‘మీకు నా జోహార్లు. మీలో ఒక్కొక్కరినీ చూసి గర్విస్తున్నా. మిమ్మల్ని చూసి మీ కుటుంబాలు, స్నేహితులు, దేశం కూడా ఇలాగే గర్విస్తుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ప్రసంగాన్ని ముగించే ముందు సభికులందరికీ నమస్తే అంటూ అభివాదం చేయడంతో ఆ ప్రాంతమంతా చప్పట్లు, హర్షాతిరేకాలతో మార్మోగింది. చివరగా ప్రపంచ శాంతి గురించి సంస్కృతంలో సందేశాన్ని వినిపించారు. -
కనువిందు చేస్తున్న పతంగుల పండుగ
న్యూఢిల్లీ: కన్నాట్‌ప్లేస్ ఆకాశవీధిలో సప్తరంగుల ప్రపంచం ఆవిష్కృతమయింది. ఇక్కడ మంగళవారం 26వ అంతర్జాతీయ పతంగుల ఉత్సవం ప్రారంభమయింది. దేశవిదేశాల నుంచి వచ్చిన గాలిపటాల ప్రియులు అనేక రగులు, పరిమాణాలు, ఆకారాలతో కూడిన భారీ పతంగులను ప్రదర్శిస్తున్నారు. సెంట్రల్‌పార్కులో నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్, మలేషియా, వియత్నా, ఎస్టోనియాతోపాటు 10 భారతీయ నగరాల యువతీయువకులు పాల్గొంటున్నారు. దేశరాజధానిలో అంతర్జాతీయ పతంగుల ఉత్సవం నిర్వహించడం ఇది మూడోసారి. రష్యా నుంచి వచ్చిన స్టానిస్లావ్ కొల్బిన్స్టెవ్ ఎగరేసిన ఆరు భుజాల భారీ పతంగి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నైలాన్‌తో తయారు చేసిన ఈ పతంగిపై రెండు రష్యన్ ప్రముఖ కట్టడాలు సెయింట్ పీటర్స్బర్గ్ పాల్ కేథడ్రల్, క్రెమ్లిన్ నగర చిత్రాలు కనిపిస్తున్నాయి. ‘మీరు రష్యా గురించి ఆలోచించగానే ఈ రెండు కట్టడాలు మీకు గుర్తుకు వస్తున్నాయి. ఇక నా పతంగిపై ఉన్న డిజైన్లు చిన్నారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. గాలిపటాన్ని దగ్గరగా చూడాలని వాళ్లు కోరుకుంటారు కాబట్టి దానిని తరచూ కిందికి దించుతున్నాను’ అని ఈ 41 ఏళ్ల రష్యన్ చెప్పారు. ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు దశాబ్దం క్రితం ఆయన పతంగుల క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. అంతేకాదు స్వదేశానికి వచ్చిన తరువాత కూడా ‘కైట్ యూనివర్స్’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఏటా నాలుగుసార్లు పతంగుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ఢిల్లీవాసులు కూడా భారీగా పతంగులు ప్రదర్శిస్తున్నారు. ప్లాస్టిక్, నైలాన్, వస్త్రం, పేపర్ తదితర వస్తువులతో తయారైన గాలిపటాలు అందంగా కనిపించడమే కాదు వినోదాన్నీ పంచుతున్నాయి. గుజరాత్ పర్యాటక అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 14న సబర్మతి నదీతీరంలో ముగుస్తుంది. ‘ఢిల్లీలో మంగళవారం ఈ ఉత్సవాన్ని ముగించి, బుధవారం ముంబైలో నిర్వహిస్తాం. మరో నాలుగు నగరాల్లో ఏర్పాటు చేశాక, జనవరి 14న గుజరాత్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం’ అని గుజరాత్ పర్యాటకశాఖ సమన్వయ విభాగం అధికారి సోమన్ పాథీ చెప్పారు. -
ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో 33 ఎకో ఫ్రెండ్లీ జిమ్‌లు
న్యూఢిల్లీ: నగరవాసుల్లో ఆరోగ్యస్పృహ పెంచేందుకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) బృహత్తర ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎన్డీఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 33 పర్యావరణ అనుకూల జిమ్‌లను ఏర్పాటు చేయనుంది. అయితే వీటిని నగరవాసులు ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. ఈ జిమ్‌లలో ఏర్పాటు చేసే సదుపాయాలన్నీ పర్యావరణ అనుకూలమైనవేనని, సులభంగా ఉపయోగించే విధంగా వీటిని డిజైన్ చేశారని ఎన్డీఎంసీ చైర్పర్సన్ జలాజ్ శ్రీవాస్తవ తెలిపారు. పార్కులలో ఏర్పాటు చేయనున్న ఈ జిమ్‌లలో పదిమీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్యుప్రెషర్ వాక్ సదుపాయాన్ని కల్పించనున్నామని, ప్రత్యేక రెయిలింగ్ కూడా ఏర్పాటు చేయడంతో సీనియర్ సిటిజన్లు కూడా ఉపయోగించేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఎయిర్ వాకర్, సిట్ అప్ బెంచ్, ఎయిర్ స్వింగ్, ట్విస్టర్, సెట్ బ్యాక్, పుష్ అండ్ పుల్ అప్ చైర్, షోల్డర్ వీల్, స్పిన్నర్, బెంచ్ విత్ ఫిక్స్డ్ డంబుల్ తదితర సామగ్రి ఉన్నాయన్నారు. వీటి ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని, త్వరలో వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ జిమ్‌లను కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్, సంజయ్ పార్క్, తాల్కటోరా గార్డెన్, నెహ్రూ పార్క్, చరక్ పాలికా హాస్పిటల్, ఎన్డీఎంసీ క్లబ్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, ఓల్డేజ్ హోమ్స్లతోపాటు వివిధ ప్రజాసేవా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటిని అందరూ ఉపయోగించుకునే అవకాశముందని, ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. నగరవాసులను ఆరోగ్యవంతులుగా చేసేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఎన్డీఎంసీ రూ. 1.9 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.