ఎనిమిదేళ్ల క్రితం ఎక్కడ మొదలైందో..! | Naga Chaitanya Samantha revisit Central Park In New York Where Their Love Story Began | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 1 2018 3:51 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

Naga Chaitanya Samantha revisit Central Park In New York Where Their Love Story Began - Sakshi

సమంత,నాగచైతన్య

న్యూయార్క్‌ : మధుర క్షణాలు అందించిన ప్రాంతాలకు మరల వెళ్లి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత చేస్తున్నది అదే.  పెళ్లి చేసుకున్న తర్వాత షూటింగులతో బిజీగా ఉండటంతో చేతూసామ్‌లు కలిసి ఎక్కడికీ వెళ్లలేకపోయారు. ప్రస్తుతం షూటింగ్‌లకు కాస్త విరామమిచ్చి ఎంజాయ్‌ చేయడానికై వారి ప్రేమ ఎక్కడ మొదలైందో అక్కడికే  వెళ్లారు. ‘ఏ మాయ చేసావే’ సినిమా షూటింగ్‌ సమయంలో న్యూయర్క్‌ లోని సెంట్రల్‌ పార్క్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కట్‌ చేస్తే ఎనిమిది సంత్సరాల తర్వాత వీరు భార్యభర్తలుగా ఆ ప్రాంతాన్ని సందర్శించి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

సెంట్రల్‌పార్క్‌ దగ్గర దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సమంత.. ‘‘సాధారణంగా సెల్ఫీలు దిగటం అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి మధుర క్షణాలు ఫోటోలో బంధిస్తేనే బాగుంటుంది. ఎనిమిదేళ్ల​ క్రితం మా ప్రేమ ఇక్కడే మొదలైంది.. థ్యాంక్యూ సెంట్రల్‌ పార్క్‌ అని’’ సమంత పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. రంగస్థలం భారీ హిట్‌ కావడం, తన నటనతో విమర్శకులతో సైతం మెప్పించుకోవడంతో సమంత ఫుల్‌ హ్యపీగా ఉంది. ఇక సవ్యసాచి సినిమా షూటింగ్‌తో  బిజీగా ఉన్న నాగచైతన్య కాస్త విరామం దొరకడంతో  సమంతతో కలిసి న్యూయార్క్‌లో విహరిస్తున్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement