మనదేశంలో పెళ్లిళ్లు, వేడుకలు, అక్షయతృతీయ, వరలక్ష్మీ వ్రతం లాంటి సందర్భాల్లో బంగారం కొనుగోలుకు అధిక డిమాండ్ ఉంటుంది. గతంతో పోలిస్తే బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ, చాలామంది దానిని కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు.
అయితే ఒకప్పుడు 11.66(తులం) గ్రాముల బంగారం ధర కేవలం రూ.113 అని తెలిస్తే ఎవరికైనా ఆ కాలానికి తిరిగి వెళ్లాలనిపిస్తుంది. అయితే బంగారం ధర చాలా తక్కువగా ఉన్న కాలంలో ప్రజల ఆదాయం కూడా చాలా పరిమితంగానే ఉండేది. బంగారం కొనుగోలుకు సంబంధించిన పాత రసీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రసీదులో 11.66 గ్రాముల బంగారం ధర రూ.113 అని ఉంది. ఈ బిల్లు 1959 నాటిది.
ప్రస్తుతం తులం బంగారం ధర రూ.70 నుంచి 75 వేలుగా ఉందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పాత బిల్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన యూజర్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘జిందగీ గుల్జార్ హై’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ బిల్లు ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 69 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే పలువురు తమ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ ‘సమయం వేగంగా కదులుతోంది’అని రాయగా, మరొక యూజర్ ‘నాటి ఆదాయాల ప్రకారం చూస్తే బంగారం ఎంతో ఖరీదైనది’ అని రాశారు. ఇంకో యూజర్ ‘అప్పట్లో చాలామంది జీతం నెలకు 40 రూపాయలు’ అని రాశారు.
Comments
Please login to add a commentAdd a comment