
వండర్ వుమన్ హీరోయిన్ గాల్ గాడోట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను మూడోసారి తల్లి కాబోతున్నానని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. భర్త యారన్ వర్సానో, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ శుభావార్తను పేర్కొంది. 50 మిలియన్లకు పైగానే ఫాలోవర్లు ఉన్న గాల్ షేర్ చేసిన పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా గాల్ దంపతులకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా 35 ఏళ్ల ఈ నటి ఇటీవలె వండర్ వుమన్ 1984 అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2017 వచ్చిన ‘వండర్ ఉమన్’కు ఇది పార్ట్-2 వచ్చింది ఈ చిత్రం. ప్యాటీ జెన్‌కిన్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో క్రిస్టెన్ విగ్, క్రిస్ పైన్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బాట్మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమాలో నటించిన తర్వాత గాల్‌గడోత్ దేశ చిత్రపరిశ్రమలో బాగా ప్రాచూర్యం పొందారు. దీంతో డెత్ ఆన్ ది నైలు చిత్రంలో అలీ ఫజల్‌తో నటించే అవకాశం వచ్చింది.
చదవండి : (ప్రియాంకకు చేదు అనుభవం: జమీలా, నిక్ విడాకులు?)
(భజ్జీ సినిమా టీజర్ విడుదల, విషెస్ చెప్పిన రైనా)
Comments
Please login to add a commentAdd a comment