
ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా వండర్ వుమెన్ 1984 భారత్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. గాల్‌గడోత్ నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. డిసెంబర్16 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ సినిమా విడుదలయ్యే తేదీలను వార్నర్ బ్రోస్ ప్రకటించారు. క్రిస్టోపస్ నోలన్స్ దర్శకత్వం వహించిన టెనెట్ సినిమా డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉండటంతో వండర్ వుమెన్ సినిమాను భారత్‌లో కొంత ఆలస్యంగా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
భారత్‌లో విడుదల..
డిసెంబర్ 25 న, భారతదేశంలోని గాల్‌గడోత్ అభిమానులు వండర్ ఉమెన్ 1984ను థియేటర్లలో చూడగలరు. పాటీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రిస్టెన్ విగ్, క్రిస్ పైన్లు కీలక పాత్ర పోషించారు. బాట్మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమాలో నటించిన తర్వాత గాల్‌గడోత్ దేశ చిత్రపరిశ్రమలో బాగా ప్రాచూర్యం పొందారు. దీంతో డెత్ ఆన్ ది నైలు చిత్రంలో అలీ ఫజల్‌తో నటించే అవకాశం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment