
‘వండర్ ఉమెన్’ అనే హాలీవుడ్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది గాల్ గాడోట్ . తాజాగా ఈ భామ నాలుగోసారి తల్లి అయింది.

బుధవారం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంంది

పాపకు ఓరి అనే నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ...ప్రెగ్నెన్సీ అంత సులభం కాదు.. కానీ నీ రాకతో మా జీవితాల్లోకి వెలుగు వచ్చింది.

నీ పేరుగు తగినట్టే నీ లైఫ్‌లో వెలుగులు చిమ్మాలి అని ఆకాంక్షించారు. ఓరి అంటే హెబ్రూ భాషలో నా క్రాంతి అని అర్ధం’ రాసుకొచ్చింది.

గాల్ గాడోట్ 2008లో జారోన్ వార్సానోను ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పటికే వీరిద్దరి ముగ్గురు ఆడ పిల్లలు.

పేర్లు ఆల్మా(12), మాయా(6), డేనీయోలా(2). ఓరితో కలిపి మొత్తం నలుగురు సంతానం.

సినిమాల విషయానికొస్తే.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్(2009) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గాల్ గాడోట్.

ఆ తర్వాత వండర్ ఉమెన్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది.ఇప్పటికే 20పైగా సినిమాల్లో నటించింది.

తాజాగా ఆమె నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ భామ అలియా భట్ ఓ ప్రధాన పాత్ర పోషించింది.

ఇది అలియా భట్‌కి తొలి హాలీవుడ్ మూవీ. ప్రస్తుతం మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.










